Chandrababu japan tour

babu japan tour, babu japan tour updates, babu japan tour meetings and agreements, chandrabbabu on japan tour, andhra pradesh japan agreements, chandrabbabu on ap capital and land, chandrabbabu on ap development, latest telugu news updates

chandrababu japan tour : andhrapradesh chief minister chandrababu naidu starts japan tour, he went japan on sunday night from rgia. till 29th of november chandrababu will be in japan tour with 19members team

జపాన్ వెళ్ళిన ఏపీ సీఎం చంద్రబాబు

Posted: 11/24/2014 10:00 AM IST
Chandrababu japan tour

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జపాన్ పర్యటనకు వెళ్ళారు. 19మంది ప్రతినిధుల బృందం చంద్రబాబు వెంట విదేశీ పర్యటనకు వెళ్ళింది. ఈ నెల 29వరకు ఈ బృందం టెక్నాలజి దేశంలో పర్యటించి రాష్ర్ట అభివృద్ధి కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపై అధ్యయనం చేయనుంది. ఏపీ పరిస్థితులను వివరించి.., రాష్ర్ట అభివృద్ధి కోసం జపాన్ సలహాలు తీసుకోనుంది. ఇదే సమయంలో పెట్టుబడులు ఆకర్షించాలనే ఉద్దేశ్యంతో ఏపీ ప్రభుత్వం ఉంది.

అటు సీఐఐ తరపున మరో బృందం కూడా జపాన్ బయల్దేరింది. బాబుతో పాటుగా, వేరుగా పర్యటించే ఈ బృందం ఏపీలో పారిశ్రామిక అభివృద్ధిపై వివరించి.., కొత్త కంపనీల స్థాపనకు కల్పించే రాయితీలు, సౌకర్యాలను వివరించి కంపనీలతో ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది. కొద్ది రోజుల క్రితమే సింగపూర్ పర్యటనకు వెళ్లి వచ్చిన చంద్రబాబు అక్కడి పరిస్థితులను అధ్యయనం చేయటంతో పాటు.. పెట్టుబడులను కూడా తీసుకొచ్చేలా ఒప్పందాలు చేసుకున్నారు. రాష్ర్టాన్ని సింగపూర్ తరహాలో వేగంగా అభివృద్ధి చేయటంతో పాటు.., జపాన్ తరహాలో టెక్నాలజి దిగ్గజంగా ఒక స్మార్ట్ సిటిని నిర్మించాలని ప్రతిపాదనలో ఉంది. ఇందుకోసం జపాన్ పర్యటన ఉపయోగపడుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chandrabbabu  japan  tour  andhrapradesh  latest news  

Other Articles