Heroic mother with rare condition died moments after giving birth to baby in c section procedure

Heroic mother, rare condition, died, giving birth to baby, C-section procedure, Karisa Bugal, amniotic fluid embolism, labour, save her son's life, sacrifice

Heroic mother with rare condition died moments after giving birth to baby in C-section procedure

మరణం ముందు ప్రసవం.. మాతృత్వానికి నిదర్శనం..

Posted: 11/21/2014 11:54 AM IST
Heroic mother with rare condition died moments after giving birth to baby in c section procedure

కమ్మనైన అమ్మతనానికి నిలువెత్తు నిదర్శనం అమె. అరుదైన వ్యాధితో భాదపడతున్న ఆమె తానో, తన బిడ్డనో బతింకించుకునే అవకాశం మాత్రమే వుంది. తన కడుపులో బిడ్డ మరణిస్తే.. అమె బతుకుతుంది. లేదా బిడ్డ బతకాలంటే.. అమె మరణించాల్సిందే.. ఇదే పరిస్థితి ఎవరికైనా ఎదురైతే.. బిడ్డ కావాలంటే మళ్లి పుడుతుంది. కానీ తాను బతికుండాలని ఆలోచిస్తారు అందరు. కానీ తాను మరణించినా.. పర్వాలేదు.. బిడ్డ మాత్రం బతకాలని మాతృత్వానికి ప్రాముఖ్యతనిచ్చింది ఆ తల్లి. తనను తాను త్యాగం చేసుకుని... పండంటి బిడ్డకు జన్మనిచ్చింది ఆ మాతృమూర్తి.

కరిసా బూగల్ మూర్తీభవించిన మాతృమూర్తి‌. అగ్రరాజ్యం అమెరికాలోని అరోరా పట్టనంలో నివసిస్తుంది. ఈమె స్థానికంగా లేబర్ గా విధులు నిర్వహించేది. నవంబర్‌ 3న ఈమె డిక్లాన్‌ అనే చిన్నారికి జన్మనిచ్చింది. తాను కన్నుమూసింది. ప్రసవానికి కొన్ని నిమిషాల ముందు ఆమె కడుపులో ఉన్న బిడ్డ గుండె కొట్టుకునే వేగం తగ్గిపోవడాన్ని వైద్యులు గమనించారు. ఆమెకు పరీక్షలు చేయగా.. ‘ఎమ్నియాటిక్‌ ఫ్లూయిడ్‌ ఎంబోలిజం’తో బా ధపడుతున్నట్టు తేలింది. లక్ష మందిలో ఒక్కరి నుంచి పన్నెండు మందికి మాత్రమే వచ్చే ఈ వ్యాధి తనకు వచ్చిందని వైద్యులు తెలిపారు.

కడుపులో ఉన్న బిడ్డ తాలూకూ స్రావాలు, జుట్టు వంటివి తల్లి రక్తంలో కలిసిపోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తుతుంది. ఈ అలెర్జీ నుండి తనను తాను కాపాడుకోవాలంటే బిడ్డను చంపాలి. బిడ్డ బతకాలంటే తనను తాను చంపుకోవాలి. ఈ దారుణమైన వ్యాధి ఎందుకు సంక్రమిస్తుందో.. ఎలా సంక్రమిస్తుందో తమకు తెలియదని, కనీసం దీనిని ఎలా కట్టడి చేయాలో కూడా ఇప్పటి వరకు వైద్యరంగ నిపుణులు కనుగోనలేదని అక్కడి వైద్యులు చెప్పారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో కేవలం ఒక్కరికి మాత్రమే బతికే అవకాశముందని వైద్యులు తెలిపారు. ఆలస్యం చేస్తే ఇద్దరు మృత్యవాత పడోచ్చని వైద్యులు హెచ్చరించారు. ఈ విషయాన్ని చెప్పగానే కరిసా వెంటనే ఒక నిర్ణయం తీసుకుంది. సిజేరియన్‌ చేసి తన బిడ్డను బతికించమని కోరడంతో వైద్యులు వెంటనే ఆపరేషన్‌ చేశారు. కరీసా నిర్ణయాన్ని ఆమె భర్త వెస్ కూడా సమర్థించాడు. డీక్లాన్‌ పుట్టగానే.. ‘ఎలా ఉన్నాడు’ ఎంత బరువు వున్నాడు. ఆరోగ్యంగా వున్నాడా అని పిల్లాడి గురించి అడిగింది. అంతే ఆ తరువాత అమె ప్రాణాలు అనంతవాయువులో కలసిపోయాయి.

చిన్నారి డిక్లాన్ ను లోకం చూసే వీలు కల్పించిన ఆ తల్లి కరిసా బుగల్ కు అప్పటికే ఒక కూతరు వుంది. తన భార్య పోయిన భాధలో వున్న వెస్.. రోజుల వ్యవధిలోని పుట్టిన బిడ్డను, మరో పసిపాపను ఎలా చూసుకోవాలంటూ కన్నీరు మున్నీరవుతున్నారు. కాగా గో ఫండ్ మీ సంస్థ ఆధ్వర్యంలోని ఆన్ లైన్ వైబ్ పోర్టల్ ద్వారా కరిసా బుగల్ కోసం నలభై వేల అమెరికన్ డాలర్లను ఇప్పటివరకు సేకరించింది. వాటిని వెస్ కు అందజేస్తామని తెలిపింది. పిల్లలను చూసుకుంటూ ఇంట్లోనే వుండాల్సిన పరిస్థతి రావడంతో.. కొంత కాలం ఆయన జీవనం సాగేందుకు ఈ డబ్బు ఉపయోగపడుతుందని చెప్పింది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles