Ramphal baba secrets and cheating updates

Ramphal Baba secrets, Ramphal Baba arrest issue, Ramphal Baba court case, Ramphal Baba latest news, Ramphal Baba ashram secrets, Ramphal Baba secrets, Ramphal Baba cheating updates, Ramphal Baba case court updates, police and court on Ramphal Baba, Ramphal Baba milk bath, latest news updates

Ramphal Baba secrets and cheating updates : self style godman ramphal baba arrested and sent to judicial custody by court orders. after ramphal baba arrest many of his secretes coming out like he will bath with milk and that milk will used to cook food for serving as holy meal to devotees

బాబా ముసుగులో భోగాలు.. బయటపడుతున్న రాంపాల్ లీలలు

Posted: 11/21/2014 10:03 AM IST
Ramphal baba secrets and cheating updates

వివాదాస్పద ఆద్యాత్మిక గురువు రాంపాల్ బాబా అరెస్టు తర్వాత ఆయన లీలలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. గురువుగారు ఆశ్రమం ముసుగులో వెలగబెట్టిన పనులు.., రహస్యాల చిట్టా ఒక్కొక్కటిగా తెలుస్తోంది. భక్తి ముసుగులో అనుభవించిన విలాసాలు.., భక్తులను మోసం చేసిన విధానం తెలుస్తున్నాయి. బాబా గారి జీవిత వాస్తవాలు తెలుసుకుంటున్న భక్తులు ఆశ్చర్యపోతున్నారు. తాము దేవుడిగా నమ్మి మొక్కిన వ్యక్తి ఇలా చేశాడా అంటూ సిగ్గుపడుతున్నారు. ఆ రహస్యాల్లో కొన్ని ఇఫ్పుడు చూద్దాం.

పోలీసుల చెరలో ఉన్న రాంపాల్ బాబా.. ఆశ్రమంలో ఉండగా రాజబోగాలు అనుభవించేవారట. సమయానికి తిండి..., అదికూడా మామూలు భోజనం కాదు. పంచభక్ష్య పరమాన్నం అన్నట్లుగా లాగించేవారట. ఇక తిండితోపాటు సుఖమైన నిద్ర అప్పుడప్పుడూ గుర్తుకు వస్తే ఆశ్రమంలో ఉన్న భక్తుల దగ్గరకు వెళ్ళి దర్శనం ఇచ్చేవారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చి భక్తి పారవశ్యంతో భజనలు చేసే భక్తులు బాబా దర్శనం కావటంతో పులకించేవారు అని పలువురు చెప్తున్నారు. ఈ బాబా గారు పాలతో స్నానం చేసేవారట. స్నానం అంటే అభిషేకంలెండి.. రోజూ పాలతో స్నానం చేయించి.., ఆ పాలతో ప్రసాదం చేసి భక్తులకు పంచుతారట. ఈ విషయాన్ని స్వామిజి పరమభక్తుల్లో ఒకరైన మనోజ్ అనే వ్యక్తి తెలిపాడు.

మరొక వాదన ఏమిటంటే.., రాంపాల్ మహాశయుడు ధ్యానం చేస్తారట. ఆ సమయంలో శివలింగంపై పడినట్లుగా.., సీలింగ్ నుంచి పాలుధారలా బాబాపై పడతాయట. అలా ఆయనపై పడిన పాలలో ధ్యాన ఫలం ఆవహిస్తుందట. అలా శక్తివంతమైన పాలతో పాయసం చేసి భక్తులకు పంచుతారు అని మరొక భక్తుడు క్రిషన్ తెలిపాడు. ఈ ధ్యానం చేస్తుండగా.. పాలు పడితే ధ్యాన ఏకాగ్రత దెబ్బతింటుంది. మరి అలాంటి సమయంలో ధ్యాన ఫలం రావటం ఏమిటి..., అది మళ్ళీ పాలలో చేరి పాలు పవర్ ఫుల్ అవటం ఏమిటి అంతా విడ్డూరంగా ఉంది కదా. ఇవేమిటి బాబా గారి లీలలు.., రాజభోగాలు ఇంకా చాలానే ఉన్నాయి.

ఇలా భక్తి ముసుగులో ప్రజలను మోసం చేసి బురిడి కొట్టించిన రాంపాల్ బాబా గారు ప్రస్తుతం ఊచలు లెక్కబెడుతున్నారు. ఇక హై డ్రామా మద్య పోలిసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చగా.. అక్కడా మరో వింతవాదన తీసుకొచ్చారు. అదేమంటే.., తాను కోర్టుకు వచ్చి హాజరుకావాలి అనుకున్నా.. సొంత కమెండోలు సహకరించలేదట. ఆయన్ను బయటకు రాకుండాబలవంతంగా బంధించారని కోర్టుకు తెలిపారు. ఈ వాదన విన్న న్యాయమూర్తి ఆశ్చర్యపోయాడు.., పెరిగే ధరలకు హద్దేలేదు రాంపాల్ బాబా అబద్దాలకు కొరతే లేదు అని మనసులో అనుకున్నాడు. ఇక బాబాగారి చెరసాల ప్రయాణం మొదలు కాగానే.., ఆశ్రమానికి చేరుకున్న పోలిసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో 12 బోర్ రైఫిల్స్ తో పాటు, 315 బోర్ రైఫిల్స్, 10 పిస్టల్లు, వందల సంఖ్యలో బాటిల్ బాంబులు యాసిడ్ బాటిళ్ళు లభించాయట. భక్తి ప్రచారం, మంచి మాటలు చెప్పే బాబాలకు ఇలా మారణాయుధాలతో పనేముంటుంది.

మరోవైపు ప్రజల డబ్బుతో కట్టుకున్న ఆశ్రమంలో విలాసవంతమైన భవనాలు ఉన్నాయని పోలిసులు చెప్తున్నారు. అంతేకాకుండా స్విమ్మింగ్ పూల్స్, మూవీ థియేటర్లు కూడా ఉన్నాయని తెలుస్తోంది. దీన్నిబట్టే ఆశ్రమంలో సాములోరు ఏం చేసేవారో అర్ధం చేసుకోవచ్చు. ప్రస్తుతం రాంపాల్ జ్యుడిషియల్ కస్టడీలో ఉంటే.., ఆయన ఆశ్రమం సీఆర్పీఎఫ్ ఆధీనంలో ఉంది. ఇది బాబా గారు వెలగబెట్టిన జీవితంతో కొంత భాగం మాత్రమే. ఇలాంటి బాబాలు చాలామంది మన చుట్టూ ఉంటారు. వారి భ్రమలో పడి కొట్టుకుపోకుండా.. సొంత కష్టఫలంను నమ్ముకుంటే పైకి వస్తారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ramphal Baba  arrest  milk bath  devotees  latest news  

Other Articles