Pm neither sleeps nor allows us to sleep venkaiah naidu

Cabinet, Narendra Modi, Barcelona, Prime minister, jan dhan Yojana, bank accounts, Prime Minister, Union Minister, venkaiah naidu

PM neither sleeps nor allows us to sleep: Venkaiah Naidu

నిద్రపోరూ నిద్రపోనివ్వరూ.. ఐనా అనందిస్తున్నాం..

Posted: 11/16/2014 08:34 PM IST
Pm neither sleeps nor allows us to sleep venkaiah naidu

దేశంలో సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ అభివృద్ధి చెందాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. హైదరాబాద్‌లో జరిగిన స్వామినాథన్‌ అవార్డులు ప్రదానోత్సవంలో పాల్గొన్న ఆయన వ్యవసాయ శాస్త్రవేత్త ఎస్‌ఎల్‌ గోస్వామికి స్వామినాథన్‌ అవార్డు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరైనా ప్రతిభను కనబరిచినప్పుడు వాళ్లను గుర్తించి అభినందించడం సమాజం కర్తవ్యమని అన్నారు. సంస్కారం కలిగిన సమాజం అలాంటి వారికి ఒక నమస్కారం పెడుతుందని ఆయన తెలిపారు. అదే మన భారతీయ సంస్కారమని ఆయన అన్నారు.
 
ప్రతిభను గుర్తించి, గౌరవిస్తే దానివల్ల మిగతావారు స్ఫూర్తి పొందుతారని వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు.. మనం కూడా ఇలా ప్రతిభా విశేషాలు కనబరిస్తే మనల్ని సమాజం గుర్తిస్తుందని ఆయన అన్నారు. దేశ ఆదాయంలో 43.3 శాతం వడ్డీలకే పోతోందని, కొత్త ఉత్పత్తులతో దేశ ఆదాయాన్ని పెంచాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తామని వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. దేశాభివృద్దికి కంకణబద్దుడైన ప్రధాని నరేంద్రమోడీ.. అన్ని రంగాలలో భారత్ పురోగాభివృద్ది సాధించే వరకు అయన నిద్రపోరని, మమల్ని కూడా నిద్రపోనివ్వని వెంకయ్య అన్నారు,

అయితే తాము మాత్రం ప్రధాని మోడీ అందిస్తున్న ఉత్సాహానికి ఆనందిస్తున్నామన్నారు. దేశ  ప్రజల కోసం పనిచేయడం, వారి ప్రగతిని కాంక్షిస్తూ.. ముందుకు సాగడంలో వున్న ఆనందం మరేందులోనూ లేదని వెంకయ్య అన్నారు. దేశ ప్రజలందరికీ ప్రధాని  జన్ ధన్ యోజన కింద బ్యాంకు అకౌంట్లు తెరవడానికి ఐదేళ్ల సమయం పడుతుందని సహచరులు అనగానే ఏడాదిలో పూర్తి కావాలని ప్రధాని అన్నారని, అయితే ప్రధాని పిలుపునిచ్చిన 7 వారాల్లోనే 7కోట్ల మంది ప్రజలు అకౌంట్లు తెరిచారని ఆయన తెలిపారు. ఇది మోడీ పై దేశ ప్రజలకున్న విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తుందని కేంద్రమంత్రి అన్నారు.
:
జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles