Salman sisters wedding hyderabadi biryani haleem on dinner

Salman Khan, Arpita, wedding: Hyderabadi Biryani, Haleem, dinner, Taj Falaknuma, security arrangements

salman sisters wedding hyderabadi biryani haleem on dinner

అర్పిత అతిధుల కోసం ఘుమఘుమలాడే వంటకాలు..

Posted: 11/16/2014 08:28 PM IST
Salman sisters wedding hyderabadi biryani haleem on dinner

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ సోదరి అర్పిత వివాహ ఏర్పాట్లు నగరంలోని ఫలక్ నామా హోటల్ లో ఊపందుకున్నాయి. వివాహంలో పాల్గొనే అతిధులకు ఘుమఘమలాడే వంటకాలను వడ్డించేందుకు భారీ మెనూ కూడా సిద్దంగా వుందని సమాచారం. పెళ్లి విందు వేడుక కోసం వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్లలో సుమారు వందకు పైగా ఐటమ్స్ సిద్దం చేయాలని సల్మాన్ ఖాన్ అర్డర్ చేసినట్లు తెలుస్తోందిజ అయితే వీటిలో ప్రత్యేకంగా 'హైదరాబాద్ ధమ్ కా బిర్యానీ', 'హలీమ్', 'పత్తర్ కా ఘోష్' లాంటి పత్యేక వంటకాలు వడ్డించడానికి అంతా సిద్దమైంది.
 
బాలీవుడ్ ఇతర చిత్రరంగ ప్రముఖులు, వ్యాపార, రాజకీయ వేత్తల కోసం నవంబర్ 18, 19 తేదిల కోసం హోటల్ మొత్తం బుక్ చేశారు. హోటల్ వద్ద ఇప్పటికే బారికేడ్లు ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. అతిధులకు బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏర్పాట్లు ఇప్పటికే చేశారు. 18న జరిగే ప్రధాన విందు కోసం అన్ని వంటకాలను సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. అతిధులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సల్మాన్ ఖాన్ కుటుంబసభ్యులు హోటల్ యాజమాన్యానికి ఇప్పటికే విన్నవించారు.
 
దేశ నలుమూలలతో పాటు విదేశాల నుంచి వచ్చే అతిరథ మహారధుల అర్పిత, ఆయుష్ శర్మల వివాహానికి హాజరుకానున్నారు. దీంతో ఈ వివాహ కార్యక్రమానికి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను పోలీసు ఉన్నతాధికారులు దగ్గరుండీ మరీ పర్యవేక్షిస్తున్నారు. సౌత్ జోన్ డిప్యూటీ కమిషనర్ వి సత్యనారాయణ నేతృత్వంలోని ప్రత్యేక పోలీసు బృందం ఈ వివాహ వేదిక వద్ద భద్రతా ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles