Telangana assembly adjourns with sorry demands

telangana assembly latest news, telangana assembly war, tdp and trs in telangana assembly, revanth reddy on trs, revanth reddy on kcr harish rao, trs leaders on tdp, kcr on tdp, kcr in telangana assembly

telangana assembly adjourns with sorry demands : telangana assembly wasting time and adjourns with sorry demands from ruling party and also the same from opposition party members

ఇది అసెంబ్లీనా... అపాలజీ సెంటరా...?

Posted: 11/12/2014 06:39 PM IST
Telangana assembly adjourns with sorry demands

తెలంగాణ అసెంబ్లీలో టీడీపీ, టీఆర్ఎస్ పార్టీల మద్య మాటల యుద్దం జరుగుతోంది. సభా సమయంలో మెజార్టీ కాలం విమర్శలు, ప్రతి విమర్శలకే సరిపోతుంది. ప్రజా సమస్యలపై చర్చలకు ఎక్కడా ఆస్కారం ఉండటం లేదు. చర్చను మొదలు పెట్టి, దాన్ని రాజకీయ అంశాలతో ముడిపెట్టి పక్కదోవ పట్టిస్తున్నారు. మీరు ఇలా చేశారని.. వారు అలా చేశారని ఆరోపణలు చేసుకుంటూ సమస్యకు పరిష్కారం ఆలోచించటం పక్కనబెట్టి.., తగువులాటకు తెరతీస్తున్నారు. ఫలితంగా విలువైన సభాసమయం వృధా అవుతోంది. ఇది కొత్తేమి కాకపోయినా.., తాజాగా ‘సారి’ అంశం తెరపైకి వచ్చింది. క్షమాపణలు చెప్పాలని పంతాలకు పోయి.., చివరకు సభ వాయిదా పడేలా చేస్తున్నారు.

బుధవారం సభ జరిగిన తీరు చూస్తే.., ఉదయం సభ ప్రారంభం కావటంతోనే ప్రశ్నోత్తరాలు మొదలయ్యాయి. ఆ తర్వాత కల్తీ పాల అంశం చర్చకు వచ్చింది. దీనిపై స్పందించిన ప్రభుత్వం కల్తీదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పింది. ఇదే సందర్బంలో హెరిటేజ్ పాల అంశాన్ని మరోసారి ప్రస్తావించింది. దీంతో గందరగోళం నెలకొంది. హెరిటేజ్ సంస్థ బాబు కుటుంబానికి చెందినది కావటంతో గళం విప్పిన టీడీపీ సభ్యులు హెరిటేజ్ సంస్థ పాలను కేరళలో అనుమతిస్తున్నారని, సభను కేటీఆర్ తప్పుదోవ పట్టించవద్దని చెప్పారు. ఇక్కడో విషయం ప్రస్తావించాలి హెరిటేజ్ సంస్థ టీడీపీ ఆస్తి కాదు, చంద్రబాబుది కూడా కాదు, ఆయన తనయుడి వ్యక్తిగత ఆస్తి. మరి దానిపై ఆరోపణలు చేస్తే... అంతగా ఎందుకు స్పందించారు. తెలుగుదేశంపై విమర్శలు వస్తే పార్టీ పరంగా స్పందించటంలో తప్పు లేదు.. కాని ఇలా వ్యక్తుల ఆస్తులపై చేస్తే మీకెందుకు అంత ఆగ్రహం వస్తుంది. ప్రభుత్వం తప్పుగా మాట్లాడి ఉంటే సంబంధిత సంస్థ స్పందిస్తుంది. కావాలంటే కోర్టుకు వెళ్తుంది. అది వారికి సంబంధించిన అంశం.

ఇలా ఒక ప్రైవేటు సంస్థ వివాదంపై బుధవారం సభా సమయం పూర్తిగా వృధా అయింది. ఫలితంగా మధ్యాహ్నం వరకు సభ మూడు సార్లు వాయిదా పడింది. బయటకు వచ్చిన నేతలు కూడా మీడియా ముందు ఆరోపణలు, ప్రతి ఆరోపణలు చేసుకుంటూ కాలం వెల్లదీశారు. ఇక టీడీపీ నేతలు కేటీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అటు సమగ్ర సర్వేపై మంగళవారం రోజు మాట్లాడిన నిజామాబాద్ ఎమ్మెల్యే అసత్య ఆరోపణలు చేశారని ఆయన కూడా క్షమాపణలు చెప్పాలని కోరారు. దీనిపై స్పందించిన టీఆర్ ఎస్ నేతలు సభలో లేని వ్యక్తి గురించి ఎలా మాట్లాడతారు అని నిలదీశారు. ఈ సందర్బంగా టీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు తెలుగుదేశంపై మండిపడ్డారు. టీఆర్ఎస్ సారీ చెప్పటం అటుంచి సభలో లేని వ్యక్తి గురించి మాట్లాడిన రేవంత్ రెడ్డి ముందుగా సారి చెప్పాలని పట్టుబట్టారు.

ఇలా మీరంటే.., మీరు చెప్పాలని వాగ్వాదం జరిగింది. ఫలితంగా చర్చకు అవకాశం లేకపోవటంతో స్పీకర్ సభను గురువారంకు వాయిదా వేశారు. ఇక్కడ ఒక్క విషయం అర్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంది. టీడీపీ-టీఆర్ఎస్ గొడవ వల్ల ప్రజా సమస్యల పరిష్కారం కాకుండా ప్రజలకు నష్టం కలుగుతోంది. కాని వారి సారీల గొడవ వల్ల ప్రజలకు ఏం లాభం కలుగుతుంది. ప్రజలకు పనికిరాని మాటల కోసం సమయం వృధా చేయటం ఎంతవరకు సమంజసం. ఓట్లేసి గెలిపించిన ప్రజల గురించి మాట్లాడకుంటే ఇంక ఎమ్మెల్యులు అయి ఏం ప్రయోజనం. సారి చెప్తే ఈగో తృప్తి అవుతుంది..., అంతకు మంచి ఏమైనా అవార్డులు, రివార్డులు వస్తాయా... దీని కోసం పట్టుబట్టే బదులుగా, బడ్జెట్ లో లోపాల గురించో... లేక నల్లగొండ ఫ్లోరైడ్ సమస్య వంటి తీవ్ర కష్టాల గురించో మాట్లాడితే అవి పరిష్కారం అయ్యే మార్గం అయినా లభించేంది. కాని ఇది చేయకుండా అసెంబ్లీని అపాలజి సెంటర్ గా మార్చేసి, చిన్న పిల్లల మాదిరిగా సారి చెప్పాల్సిందే అని సభ వాయిదాకు కారణం అవటం ఎంతవరకు సమంజసం.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telangana  assembly  tdp  trs  latest news  

Other Articles