Hello world great to be on instagram says pm modi on debut

Narendra Modi, ASEAN, EAST Asia summit, Instagram, Prime Minister, social media, prowess, Nay Pyi Taw, 38,000 followers

Hello world, great to be on Instagram, says PM Modi on debut

ఇన్ ష్టా గ్రామ్ లో మోడీ, గంటల వ్యవధిలోనే వేల మంది ఫాలోవర్స్..

Posted: 11/12/2014 06:15 PM IST
Hello world great to be on instagram says pm modi on debut

120 కోట్ల మంది ప్రజలున్న భారతావని ఆయన ప్రధాన మంత్రి. ఆయన ఏం చేసినా క్షాణాల్లో గుడ్డిగా ఫాలో అవుతుంటారు భారతీయ యువత. ఆయన ఎక్కడ వున్నా తమకు నిత్యం అందుబాటులో వుంటాడని భారతీయ యువత విశ్వాసం. అందుకు తగ్గట్టుగానే ప్రధాని మోడీ కూడా ఎక్కడ వున్నా, ఏ సమయంలోనైనా భారతీయ యువతతో అందుబాటులోకి వస్తారు. ప్రధానిగా వుంటూ ప్రజలకు అందుబాటులో వుండే ప్రధాని కాబట్టే అయినకు అంత క్రేజ్ అనుకుంటున్నారుగా, ఇది ఒక మాదిరగా కరక్టే.

అయితే నరేంద్రమోడీ అనే పేరు ఇప్పడు కేవలం పేరు కాదు.. ఒక బ్రాండ్ అంటున్నారు యువత అందుకే అయన నిత్యం యువతతో సోషల్ మీడియాలో అందుబాటులో వుంటారు. భారతీయ యువత విశ్వాసాలకు అనుగూణంగా నడుచుకుంటారు. ఆరు పదుల వయస్సులోనూ.. కుర్రాడిలా ముందుకు సాగుతున్నారు. అదెలా అంటారా..? ప్రస్తుతం ఏసియన్ సదస్సు కోసం వెళ్లన ప్రధాని అక్కడ మరో సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్ ఇన్‌స్టాగ్రాంలోనూ ఖాతా తెరిచారు. ఫేస్‌బుక్, ట్విట్టర్‌లలో ఆయనకు లక్షల కొద్దీ ఫాలోవర్లు ఉన్న సంగతి తెలిసిందే.

ఆన్‌లైన్‌లో ఫొటోలు, వీడియోలు షేర్ చేసుకునే సోషల్ మీడియా వెబ్‌సైట్ ఇన్‌స్టాగ్రాం ద్వారానూ మోదీ యువతకు చేరువయ్యారు. మయన్మార్‌లో ఏసియాన్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనడానికి వెళ్లిన మోదీ అక్కడ ఆయన స్వయంగా తీసిన ఫొటోను ఇన్‌స్టాగ్రాంలో అప్‌లోడ్ చేశారు. 'హలో వరల్డ్! ఇన్‌స్టాగ్రాంలో చేరడం గొప్ప అనుభూతినిస్తోంది. ఇది ఇస్ ష్టాగ్రాంలో నా తొలి ఫోటో .. ఏసియాన్ సదస్సు నుంచి' అని ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేశారు. ఆయన ఖాతా తెరిచిన రెండు గంటల్లోపే దాదాపు 38వేల మంది ఫాలోవర్లు వచ్చేశారు. ఇన్‌స్టాగ్రాంలో చేరినట్లు మోదీ ట్విట్టర్‌లోనూ పోస్ట్ చేశారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Narendra Modi  ASEAN  EAST Asia summit  Instagram  Prime Minister  social media  prowess  Nay Pyi Taw  38  000 followers  

Other Articles