Homeopathy doctor attacked with 70 slaps in 30 minutes

homeopathy doctor attacked, homeopathy doctor slapped, 70 slaps in 30 minutes, doctors sexual harassment, doctors behaviour with patients, doctors sexual attack on patients, homeopathy treatment results, latest news

homeopathy doctor attacked with 70 slaps in 30 minutes : a homeopathy doctor in indore of madhyapradesh state attacked by a patient by slapping him 70times in 30minutes. indore doctor attacked for cheating a woman by stating to marry her later rejected her

30నిమిషాల్లో 70 చెంపదెబ్బలు కొట్టింది..

Posted: 11/12/2014 01:12 AM IST
Homeopathy doctor attacked with 70 slaps in 30 minutes

మధ్యప్రదేశ్ లో ఓ మహిళ కోపం కట్టలు తెంచుకుంది. పట్టలేని ఆవేశంతో హోమియోపతి డాక్టర్ ను చెంపలు వాచిపోయేట్లు కొట్టింది. ఇండోర్ లో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం కల్గించింది. దీనిపై పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. డాక్టర్ అర్పిత్ చోప్రా ఇండోర్ లో హోమియోపతి క్లినిక్ నిర్వహిస్తున్నాడు. అక్టోబర్ 28న ఆస్పత్రికి వచ్చిన వసుంధర శర్మ అనే మహిళ, డాక్టర్ గదికి వెళ్ళింది. లోపలకు వెళ్లటంతోనే డాక్టర్ పై చెంపదెబ్బల వర్షం కురిపించింది. ఆపకుండా ఎడాపెడా... రెండు చెంపలు వాయించింది.

అలా అరగంట దెబ్బల మోత మోత మోగించింది. ఎంతలా అంటే ముప్పై నిమిషాల్లో డెబ్బయి దెబ్బలు కొట్టింది. ఈ దెబ్బలకు డాక్టర్ దిమ్మదిరిగిపోవటంతో పాటు రెండు చెంపలు బూరెల్లా వాచిపోయాయి. అంతటితో ఆగకుండా అందరి ముందు డాక్టర్ చొక్కా చించేసింది. తనపై జరిగిన దాడిపట్ల ఆలస్యంగా స్పందించిన డాక్టర్ చోప్రా, నవంబర్ 7న టుకోగంజ్ పోలిస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. డాక్టర్ కథనం ప్రకారం సదరు మహిళ 2012లో తన వద్ద ట్రీట్ మెంట్ కు వచ్చిందనీ.., తనతో సన్నిహితంగా మెలిగేందుకు ప్రయత్నించగా గుర్తించిన తాను క్లినిక్ నుంచి పంపించినట్లు చెప్పాడు.

అంతేకాకుండా తరుచుగా ఫోన్ చేసి బెదిరించేదని కంప్లయింట్ లో తెలిపాడు. అటు వసుంధర డాక్టర్ పై దాడి చేయకముందే అతడిపై కేసు పెట్టింది. తనను పెళ్లిచేసుకుంటానని చెప్పి మోసం చేశాడని కంప్లయింట్ ఇచ్చింది. తన కూతుర్ని పెళ్ళి చేసుకుంటానని చెప్పి శారీరక సంబంధం పెట్టుకున్నాడని ప్రణీత్ పై వసుంధర తండ్రి ఆరోపణలు చేశారు. ఈ రెండు ఫిర్యాదులపై పోలిసులు వేర్వేరుగా ధర్యాప్తు జరుపుతున్నారు. ఇద్దర్లో ఎవరి వాదనలో వాస్తవం ఉందో ఇప్పుడే నిర్ధారించలేము. కాని వసుంధర దాడిలో మాత్రం డాక్టర్ చెంపలు వాచిపోవటంతో పాటు పేషంట్ల ముందు అవమానం పాలయ్యాడు.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : homeopathy  doctor  slap  patient  latest news  

Other Articles