Grant autonomy to temples seer

paripoornananda swami, tirumala, government, IAS Officer, spiritual concept, Government, Hegemony, Supervision

Grant autonomy to temples: seer

దేవాలయాలకు కూడా స్వయం ప్రతిపత్తినివ్వండి

Posted: 11/11/2014 11:00 PM IST
Grant autonomy to temples seer

హిందూ దేవాలయాలపై ప్రభుత్వ పెత్తనం పెరిగిపోతోందని, దేవాలయాల ఆస్తులకు రక్షణ కల్పించడంలో ప్రజాప్రతినిధులు విఫలమవుతున్నారని హిందు ధర్మ ఆచార్య సభ ఆరోపించింది. దేవాలయాల నిర్వహణ, సమారాధనలను హిందువులకే అప్పగించాలని డిమాండ్‌ చేశారు. దేవాలయాలపై దేవాదాయశాఖ పెత్తనం ఉండరాదని కోరుతూ గతంలో కూడా తాము కోర్టును ఆశ్రయించామని తెలిపింది.   దేవాలయాల పైన ప్రభుత్వం ఆధిపత్యం ఉండాలనుకుంటే భారత దేశాన్ని హిందూదేశంగా ప్రకటించాలని  స్వామి పరిపూర్ణానంద డిమాండ్ చేశారు.

దేవాలయాల నిర్వహణ హిందూ సమాజానిదని, ప్రభుత్వ బాధ్యత కాదన్నారు. ఒకవేళ దేవాలయాలను ప్రభుత్వమే నిర్వహించాలనుకుంటే దేశాన్ని హిందూదేశంగా ప్రకటించాలని, ఈ విషయమై తాము కేంద్రానికి లేఖ రాస్తామని పరిపూర్ణానంద స్వామి తెలిపారు. ఆలయాలకు కార్యనిర్వాహక అధికారులను నియమించేటప్పుడు కేవలం ఐఏఎస్ అధికారులే ప్రామాణికం కాకుండా ధార్మిక చింతన, విలువలు కలిగిన వారిని ఎవరినైనా నియమించవచ్చునని చెప్పారు. దేవాలయాల నిర్వహణ, సమారాధలనలను హిందువులకే అప్పగించాలని డిమాండ్ చేశారు.

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలలో దేవాలయాలనూ, వాటి ఆస్తులనూ ప్రభుత్వాలు హిందూ సమాజానికి గౌరవప్రదంగా తిరిగి అప్పగించాలని ఈ గోష్ఠిలో అభిప్రాయపడినట్లు ఆయన చెప్పారు. ఒకవేళ భారత్‌ లౌకిక దేశంగా ఉండాలంటే ఇతర మతస్థులకు ఇస్తున్న ప్రాధాన్యాన్ని హిందు మతానికి కూడా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. హిందూ పండుగలు వచ్చినప్పుడు నిత్యావసర వస్తువుల ధరలను పెంచి ప్రభుత్వం వ్యాపారం చేస్తోందని, ముస్లింలకు మాత్రం అనేక సందర్భాల్లో రాయితీలను ప్రకటిస్తోందని విమర్శించారు. ఆ రాయితీలను హిందువుల పండుగల సమయంలో కూడా వర్తింపజేసే విధంగా కేంద్రం నిర్ణయం తీసుకోవాలన్నారు. ఆలయాలకు దాతలు ఇచ్చిన భూములను పేదలకు పంచే అధికారం ప్రభుత్వాలకు ఏ మాత్రం లేదన్నారు.  హిందూ దేవాలయాలను ఆదాయవనరుగా భావిస్తున్నారని ఆరోపించారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles