Crisil survey says new it jobs will decrease by 50percent

it jobs in india, it jobs for freshers in hyderabd, private jobs in hyderabad, it bpo jobs in telangana, it jobs in andhrapradesh, latest job notifications, crisil survey latest, latest news

crisil survey says new it jobs will decrease by 50percent : crisil survey says in coming four years information technology jobs will decrease by 50percent because of management money and profit oriented thinking

కొత్త ఉద్యోగాలు ఉండవని చెప్తున్నారు

Posted: 11/10/2014 08:53 PM IST
Crisil survey says new it jobs will decrease by 50percent

ఐటి ఉద్యోగాలపై కోటి ఆశలతో ఎదురుచూస్తున్న యువతకు క్రిసిల సర్వే చేదువార్తను చెప్పింది. రానున్న నాలుగు సంవత్సరాల్లో యవతకు ఐటి ఉపాధి అవకాశాలు తక్కువగా ఉంటాయని చెప్పింది. ఉద్యోగ నియమకాలపై ఐటి కంపనీలు అనుసరిస్తున్న విధానాలపై క్రిసిల్ సర్వే చేసింది. తమ విశ్లేషణలో దేశంలో ఐటీ పరిశ్రమ రోజురోజుకూ వృద్ది చెందుతున్నట్లు తెలిపింది. ఐటీ వృద్ది, రాబడి 13శాతం నుంచి 15శాతంకు వృద్ధి ఉంటుందని చెప్పిది. కంపనీలు వృద్ధి చెందినా ఉద్యోగ అవకాశాలు మాత్రం పెరగకుండా విచిత్రంగా తగ్గుతున్నాయని వెల్లడించింది.

ఇందుకు కంపనీల ఆలోచనావిధానం కారణమట. అంటే లాభాలను పెంచుకునేందుకు కంపనీలు ఎక్కువగా ఆసక్తి చూపుతూ మానవ వనరుల వినియోగం తగ్గించే భావనలో ఉన్నాయి. ఫలితంగా ఆదాయం పెరుగుతున్నా ఉద్యోగాలు మాత్రం భారీగా తగ్గుతాయని క్రిసిల్ పేర్కొంది. ప్రస్తుతం ఇంజనీరింగ్, ఐటి కోర్సులు చేస్తున్న యువతకు ఉపాధి విషయానికి వస్తే ఇబ్బందికర పరిస్థితులు తప్పవని తెలుస్తోంది. ఇదే జరిగితే దేశంలో ఐటి రంగంపై ఆశలు పెట్టుకున్న యువత నిరుద్యోగులుగా మిగులుతారు.

భారత్ లో ప్రైవేటు రంగంలో ఐటి మాత్రమే ఎక్కువగా ఉద్యోగాలు కల్పిస్తున్న రంగం. ఆ తర్వాత సాఫ్ట్ వేర్, కస్టమర్ సర్వీస్ ఇతర రంగాలు ఉన్నాయి. ఐటీలో చిన్న స్థాయి నుంచి లక్షల రూపాయలు ఆర్జించే ఉద్యోగాలు కూడా ఉన్నాయి. కంపనీలకు పెరుగుతున్న ప్రాజెక్టుల కారణంగా ఆదాయం పెరుగుతున్నా, లాభార్జనపై దృష్టిపెట్టి కొత్త వనరుల్ని తీసుకోవటం లేదు. ఫలితంగా నైపుణ్యం ఉన్న యువత నిరుద్యోగులుగా మిగిలి దుస్థితి ఏర్పడుతోంది.

 

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : it jobs  india  crisil  latest news  

Other Articles