Telangana assembly on power distribution issue with andhrapradesh

telangana assembly latest update, telangana government programmes, telangana power problem, telangana vs andhrapradesh issues, kcr on chandrababu naidu, telangana latest news, andhrapradesh latest news

telangana assembly on power distribution issue with andhrapradesh : telangana assembly unanimously approved power distribution problem with andhrapradesh

విద్యుత్ పై ఏకగ్రీవ తీర్మానం...

Posted: 11/10/2014 07:30 PM IST
Telangana assembly on power distribution issue with andhrapradesh

రాజకీయాలకు అతీతంగా తెలంగాణ అసెంబ్లీ ఒక్కతాటిపైకి వచ్చింది. విద్యుత్ పై జరిగిన చర్చలో, తెలంగాణకు సక్రమంగ విద్యుత్ రావటం లేదని అన్ని పార్టీలు అంగీకరించాయి. ఈ మేరకు ప్రవేశపెట్టిన తీర్మానంను పార్టీలకతీతంగా సభ్యులు ఆమోదించారు. ఫలితంగా తెలంగాణకు నిబంధనల ప్రకారం విద్యుత్ సరఫరా జరగటం లేదన్న తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. దీన్ని త్వరలోనే ఢిల్లీకి పంపనున్నారు. అంతేకాకుండా వీలయితే అఖిలపక్ష నేతలను హస్తినకు తీసుకెళ్ళి పరిస్థితి వివరించేందుకు సిద్ధమని ప్రభుత్వ ప్రకటించింది. ఈ మొత్తం సీన్ లో అనూహ్యంగా, అనుకోకుండా తెలంగాణ టీడీపీ.., ఏపీ సర్కారుకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మానంకు ఆమోదం తెలపటం గమనార్హం.

తీర్మానంలో ప్రధానంగా తెలంగాణకు విభజన చట్ట కేటాయింపుల ప్రకారం నిధులు వచ్చేట్లు చేయాలని పేర్కొన్నారు. 24గంటల విద్యుత్ పథకంలో రాష్ర్టాన్ని కూడా చేర్చాలని కోరారు. విద్యుత్ పై సోమవారం తెలంగాణ అసెంబ్లీలో సుధీర్ఘ చర్చ జరిగింది. అధికార, ప్రతిపక్షాల మద్య పలుసార్లు తీవ్ర మాటల యుద్ధాలు కూడా జరిగాయి. తెలంగాణ ప్రభుత్వం కరెంటు కష్టాలకు ఏపీ కారణం అని విమర్శిస్తే, అది ఇక్కడి ప్రభుత్వ చేతకానితనం అని టీడీపీ మండిపడింది. ఇదే సమయంలో రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయని కాంగ్రెస్ ప్రశ్నిస్తే, అవి ఎప్పటినుంచో ఉన్నవి కావాలంటే కాంగ్రెస్ చరిత్ర చూసుకొండి అని అధికార పక్షం సమాధానం ఇచ్చింది. ఇలా సోమవారం వాడివేడిగా చర్చ జరిగింది.

ఇలా హాట్ హాట్ చర్చల అనంతరం సాయంత్రం విద్యుత్ తీర్మానంను సీఎం కేసీఆర్ సభలో ప్రవేశపెట్టారు. తీర్మానం చదివి విన్పించగా అందులోని పదాలపై పలు అభ్యంతరాలు వచ్చాయి. ‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మొండి వైఖరి వల్ల... ’ అని ఒకచోట ఉంది. దీనిపై రేవంత్ రెడ్డి అభ్యంతరం తెలిపారు. అటు ప్రతిపక్ష నేత జానారెడ్డి కూడా అభ్యంతరం తెలపగా చివరకు మొండి వైఖరి పదం తీసేసి తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానం ఏ పార్టీకి వ్యతిరేకం కాదనీ.., ప్రజా సమస్యను పార్టీల కోణంతో చూడవద్దని సీఎం విజ్ఞప్తి చేశారు. అనంతరం తీర్మానంను తెలంగాణ అసెంబ్లీ ఆమోదించింది. దీనికి టీడీపీ కూడా ఆమోదం తెలిపింది. ఆ తర్వాత విద్యుత్, రైతు సమస్యలై చర్చ జరిగింది.

తెలంగాణ ప్రభుత్వ తీర్మానంకు టి.టీడీపీ మద్దతు తెలపటం ఇబ్బందికర పరిణామంగా చెప్పవచ్చు. తాజా నిర్ణయాన్ని బట్టి ఏపీ నుంచి సక్రమంగా కేటాయింపులు జరగటం లేదని తెలంగాణ టీడీపీ ఒప్పుకున్నట్లవుతోంది. అంటే బాబు సర్కారు విద్యుత్ కేటాయింపుల నిబంధనలు పాటించటం లేదని వారి నేతలే చెప్తున్నారు. తెలివిగా వ్యవహరించిన తెలంగాణ ప్రభుత్వం టీ.టీడీపీతోనే ఏపీ సర్కారును వేలెత్తి చూపింది. లోపల కారణం ఏదైనా ఉండవచ్చు, కానీ కరెంటు లెక్క ప్రకారం రావటం లేదు అని టీ.టీడీపీ ఒప్పకుంది. మరి దీనిపై చంద్రబాబు ఎలా స్పందిస్తారో.., పార్టీ నేతలు ఏమంటారో చూడాలి.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telangana  assembly  power  latest news  

Other Articles