Wall divided berlin gif

A city undivided: the fall of the Berlin Wall commemorated 25 years on

Lights and Celebration Where a Wall Divided Berlin

కూలిన గోడకు రజతోత్సవాలు జరుపుకున్నారు..

Posted: 11/10/2014 01:30 PM IST
Wall divided berlin gif

చారిత్రక బెర్లిన్ గోడ కూల్చివేత ఘట్టానికి 25 ఏళ్లు నిండాయి. 28 ఏళ్ల పాటు జర్మనీని తూర్పు, పశ్చిమాలుగా వేరుచేసి, తుదకు జర్మనీ ఐక్యానికి దోహదపడిన ఈ గోడ కూలి పాతికేళ్లు పూర్తవుతుండటంతో జర్మనీవాసులు రజతోత్సవ వేడుకలు జరుపుకున్నారు. దేశవ్యాప్తంగా పలు సంస్మరణ కార్యక్రమాలను, వేడుకలను నిర్వహించారు. ఆ మూల నుంచి ఈ మూల వరకు సుమారు 15 కిలోమీటర్ల మేర నిర్మించిన అడ్డుగోడ స్థానంలో ఇలా ‘వెలుగు బుడగల’ గోడకట్టారు. అనంతరం ఆ బెలూన్లను గాల్లోకి వదిలారు. అదే ఎరియల్ సర్వేలో కనబడతున్న కాంతి.

తూర్పు జర్మనీ నుంచి పారిపోతూ మరణించిన వారి సంస్మరణార్థం నిర్మించిన స్మారకం వద్ద నిర్వహించిన వేడుకలలో జర్మన్ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ పాల్గొన్నారు. నాడు శాంతియుతంగా గోడను కూల్చివేసిన పౌరుల ధైర్యాన్ని ఆమె కొనియాడారు. కలలు నిజమవుతాయనడానికి ఆ అద్భుత ఘట్టం నిదర్శనమన్నారు. మెర్కెల్.. కమ్యూనిస్టు పాలనలో ఉన్న తూర్పు జర్మనీలో పెరిగారు. అనంతరం గోడ అవశేషాలతో నిర్మించిన మ్యూజియంను మార్కెల్ ప్రారంభించారు.

berlin-wall-1
berlin-wall-10
berlin-wall-11
berlin-wall-12
berlin-wall-13
berlin-wall-14
berlin-wall-15
berlin-wall-16
berlin-wall-2
berlin-wall-4
berlin-wall-5
berlin-wall-6
berlin-wall-7
berlin-wall-8
berlin-wall-9

ప్రచ్ఛన్న యుద్ధ క్రమంలో 1961లో బెర్లిన్ గోడను నిర్మించారు. నాటి తూర్పు జర్మనీ ప్రభుత్వం దీనికి పూనుకుంది. దీన్ని నిర్మించకముందు దాదాపు 35 లక్షల మంది తూర్పు జర్మన్‌వాసులు తూర్పు బెర్లిన్ నుంచి పశ్చిమ బెర్లిన్‌లోకి వలసవెళ్లారు. అక్కడి నుంచి వారు పశ్చిమ జర్మనీలోకి.. ఆ తర్వాత ఇతర పశ్చిమ ఐరోపా దేశాల్లోకి వెళ్లడానికి వారికి వీలు కలిగేది. ఈ గోడ నిర్మించిన తరువాత ఇలాంటి వలసలకు అడ్డుకట్ట పడింది. అయినా సంపాదన కోసమో, బతుకుదెరువు కోసమో వెళ్లక తప్పని పరిస్థతి. దీంతో ఆ కాలంలో గోడ దాటిపోవడానికి సాహరించిన వెళ్లిన వాళ్లలో ఐదు వేల మంది వున్నారు. అయితే వారిలో  భవనాల నుంచి దూకడం, కంచెలో నుంచి చొరబడి పరిగెత్తడం, చిన్న విమానాల్లో ప్రయాణించడం, రహస్య సొరంగాలను తవ్వుకొని, వాటి గుండా పారిపోవడం వంటివి చేశారు. ఈ క్రమంలో బెర్లిన్, దాని సమీపంలో వందల మంది ప్రాణాలు కోల్పోయారు.

అయినా తూర్పు బెర్లిన్ ప్రభుత్వం గోడను తొలగించలేదు. ఈ క్రమంలో 28 ఏళ్ల తరువాత వచ్చిన రాజకీయ మార్పుల నేపథ్యంలో 1989 నవంబర్ 9న తూర్పు జర్మనీలోని కమ్యూనిస్టు ప్రభుత్వం.. పశ్చిమ జర్మనీ వెళ్లేందుకు తమ పౌరులకు అనుమతినిచ్చింది. దీంతో ఆ రోజున వేల మంది జర్మన్లు బెర్లిన్ గోడను కూల్చేశారు. ఆ తరువాత 1990లో జర్మన్ ఒకే దేశంగా మారింది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles