Andhra pradesh contractor kidnapped in assam by bodo militants

Andhra pradesh, contractor, kidnap, Assam, bodo Militants

andhra pradesh contractor kidnapped in assam by bodo Militants, demands Rs 2 crore to release him

కాంట్రాక్టర్ విడుదల కోసం రూ.2కోట్లు ఇవ్వండి:బోడో తీవ్రవాదులు

Posted: 11/10/2014 11:15 AM IST
Andhra pradesh contractor kidnapped in assam by bodo militants

అసోం రాష్ట్రంలో మరోమారు బోడో మిలిటెంట్ల దుశ్చర్యకు పాల్పడ్డారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సివిల్ కాంట్రాక్టర్ ను కిడ్నాప్‌ చేశారు. దివాస్ జిల్లా గౌడీ(అటవీ) ప్రాంతంలో సబ్ కాంట్రాక్టరుగా పనులు నిర్వహిస్తున్న.. వైఎస్సార్ జిల్లా రామాపురం మండలం హసనాపురం గ్రామానికి చెందిన పప్పిరెడ్డి మేహేశ్వరరెడ్డిని బోడో మిలిటెంట్లు కిడ్నాప్ చేశారు. కాంట్రాక్టరును విడిచిపెట్టాలంటే రెండు రోట్ల రూపాయలు ఇవ్వాలన డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. దీంతో మహేశ్వర్ రెడ్డి కుటుంబసభ్యులు భయాందోళనకు గురవుతున్నారు.

క్లాస్‌వన్ కాంట్రాక్టర్ అయిన మహేశ్వరరెడ్డి హసనాపురం గ్రామానికి గతంలో సర్పంచ్‌గా కూడా పనిచేశారు. గత మూడేళ్ల నుంచి హైదరాబాద్ గచ్చిబౌలిలోని రాంకీ టవర్స్ ఈ-బ్లాక్ ఫ్లాట్ నంబర్ 1607లో నివాసం ఉంటున్నారు. ఆయనకు భార్య సుభద్రమ్మ, కూతురు నిశిత, కొడుకు మంజునాథ్ ఉన్నారు. ప్రస్తుతం మహేశ్వరరెడ్డి గుజరాత్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, జమ్మూకాశ్మీర్, అసోం రాష్ట్రాలలో ఐఎల్‌ఎఫ్ (రాంకీ కంపెనీ )లో సబ్ కాంట్రాక్టర్‌గా పనులు చేయిస్తున్నారు. అసోం రాష్ట్రం దివాస్ జిల్లాలో రూ.45 కోట్లతో 70 కిలోమీటర్ల వరకు రోడ్డుపనులు ఆయన పర్యవేక్షణలోనే కొనసాగుతున్నాయి.

కాగా, అక్కడ ఇటీవల కురిసిన వర్షాలకు చేసిన నిర్మాణాలన్నీ కొట్టుకుపోవడంతో పనులకు సంబంధిన బిల్లులు ఆగిపోయాయి. దీంతో తిరిగి నిర్మాణ పనులు పర్యవే క్షించేందుకు మహేశ్వరరెడ్డి సైట్ ఇంజనీర్‌తో కలసి బైక్ మీద డిమహసవో జిల్లా లుమ్‌డింగ్‌లోని గెస్ట్‌హౌస్ సమీపంలోని సైట్‌కు వెళ్లాడు. ఈ క్రమంలో హత్‌కళి గ్రామం సమీపంలో ఐదుగురు వ్యక్తులు వారి బైక్‌ను ఆపి మహేశ్వరరెడ్డి, సైట్ ఇంజనీర్‌ను తమతోపాటు తీసుకెళ్లారు. కొద్దిదూరం వెళ్లాక సైట్ ఇంజనీర్‌ను వదిలిపెట్టారు. మహేశ్వరరెడ్డి కిడ్నాప్ ఉదంతం తెలియడంతో ఆయన కుటుంబ సభ్యులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు.

సైబరాబాద్ పోలీసులు అసోం పోలీసు అధికారులను సంప్రదిస్తున్నారు. ఇప్పటికే మాదాపూర్ డీసీపీ కార్తికేయ డిమహసవో ఎస్పీ ప్రసాద్ జంధ్యాలతో మాట్లాడారు. మహేశ్వరరెడ్డిని విడిపించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా, తన భర్తను విడిపించేందుకు చర్యలు తీసుకోవాలని తెలంగాణ, అసోం ప్రభుత్వాలకు మహేశ్వరరెడ్డి భార్య సుభద్రమ్మ విజ్ఞప్తి చేసింది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Andhra pradesh  contractor  kidnap  Assam  bodo Militants  

Other Articles