Ramachandraiah comments on nara lokesh

nara lokesh comments, nara lokesh latest news, c ramachandraiah comments on nara lokesh, andhrapradesh latest news, andhrapradesh congress leaders, latest news, laxmi parvati comments, laxmi parvati latest updates

ramachandraiah comments on nara lokesh : andhrapradesh congress leader c ramachandraiah fires on nara lokesh says he is behaving like a parlal constution body. nara lokesh participating in government activities with unauthorisation says nara lokesh

నారా లోకేష్.. లక్ష్మిపార్వతి సేమ్ టు సేమ్ అట !

Posted: 11/08/2014 01:25 AM IST
Ramachandraiah comments on nara lokesh

పేరుకు టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధికి కన్వీనర్ గా ఉన్నప్పటికీ తెలుగుదేశం వ్యవహారాలు మొత్తం ప్రస్తుతం లోకేష్ చూసుకుంటున్నారు. పార్టీ రోజు వారి కార్యక్రమాలపై సమీక్షలు, నేతలతో సమావేశాలు, కార్యకర్తలనుద్దేశించి ప్రసంగాలు, కార్యాచరణలు అన్నీ లోకేష్ చూసుకుంటున్నారు. అంతేకాకుండా ప్రభుత్వ పరంగా చేసే పలు కార్యక్రమాల్లో కూడా సలహాలు, సూచనలు ఇస్తున్నారు. దీనిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఏ హోదాతో లోకేష్ ను ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యానికి అనుమతిస్తున్నారు అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.

ఈ కోవలోనే నారా లోకేష్ పై కాంగ్రెస్ నేత సి. రామచంద్రయ్య తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. లోకేష్ రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారు అని కామెంట్ చేశారు. అనుమతి లేకపోయినా ప్రతి ప్రభుత్వ వ్యవహారంలో జోక్యం చేసుకుంటున్నారని విమర్శించారు. అంతేకాకుండా ప్రభుత్వ నిర్ణయాలపై కూడా ఆయన ప్రభావం చూపుతున్నారని ద్వజమెత్తారు. గతంలో లక్ష్మి పార్వతిని రాజ్యాంగేతర శక్తి అని విమర్శించిన చంద్రబాబు ఇప్పుడేం సమాధానం చెప్తారని రామచంద్రయ్య ప్రశ్నించారు.

అటు రాజధాని భూమి సేకరణ విషయంలో రైతుల అనుమతి ప్రకారమే ప్రభుత్వం నడుచుకోవాలని డిమాండ్ చేశారు. పూలింగ్, అమ్మకం లేదా ఇతర పద్దతుల ద్వారా అక్రమంగా, బలవంతంగా భూమిని సేకరించాలని చూస్తే సహించబోమన్నారు. రాజధాని స్వప్రయోజనాల కోసం కాకుండా ప్రజలందరికి ఉపయోగపడేలా నిర్మించాలన్నారు. లక్ష్మి పార్వతి అంటే అసలు పడని చంద్రబాబు ఫ్యామిలికి ఆమెతో బాబు తనయుడిని పోల్చటం నారా వారికి కాస్త ఇబ్బందికర పరిణామమే. దీనిపై మరి వారు ఎలా స్పందిస్తారో చూడాలి.

 


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nara lokesh  andhrapradesh  laxmi parvathi latest news  

Other Articles