Another cyclone to hit coastal andhra

Depression, Bay of Bengal, cyclone, Visakhapatnam, Hud Hud, Aashobha, Indian meteorological department

depression in bay of bengal soon changes as storm, may hit coastal andhra

కోస్తా తీరానికి పొంచి వున్న అశోబా తుఫాన్ ముప్పు

Posted: 11/07/2014 09:59 AM IST
Another cyclone to hit coastal andhra

హుద్దూద్ తుపాను ప్రభావానికి కాకవికళమైన విశాఖ సహా కోస్తా తీరానికి మరో తుఫాను ముప్పు పోంచి వుంది. హుద్దూద్ బీభత్సం సృష్టించిన నష్టాలను అంచనాలు వేసుకుంటున్న తరుణంలో.. తమ తీరానికి మరో తుపాన్ ముప్పు పొంచి ఉందని తెలిసి ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం మరింత బలపడుతూ కోస్తా వైపు కదులుతోంది. నిన్నరాత్రికి ఈ తీవ్రవాయుగుండం విశాఖపట్నానికి ఆగ్నేయంగా 560 కిలోమీటర్లు, ఒడిశాలోని పారదీప్‌కు దక్షిణ ఆగ్నేయంగా 690 కిలోమీటర్ల దూరంలోనూ కేంద్రీకతమై ఉంది.

ఇది క్రమంగా బలపడి మరికొన్ని గంటల్లో తుపాను ఏర్పడే అవకాశం ఉన్నట్లు విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో తీవ్ర వాయుగుండం గత 12గంటలుగా స్థిరంగా కొనసాగుతోంది. ఇది క్రమంగా వాయువ్యదిశగా పయనించి మరో 12 గంటల్లో తుపానుగా మారే అవకాశం ఉంది. ఈ తుపానుకు శ్రీలంక దేశం సూచించిన 'అశోబా' అనే పేరును ఖరారు చేయనున్నారు. అశోబా క్రమంగా పశ్చిమ వాయువ్యదిశగా పయనించి ఆంధ్రప్రదేశ్ తీరం వైపు రానుంది.

అయితే అశోబా తీరానికి సమీపించే కొద్దీ ... తుపాను క్రమంగా వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉంది. తీవ్ర వాయుగుండం ప్రస్తుతం ఒంగోలుకు తూర్పు ఆగ్నేయ దిశలో 750, విశాఖకు ఆగ్నేయ దిశలో 560, పారాదీప్‌కు దక్షిణ ఆగ్నేయ దిశలో 690 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. తుపాను ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరం వెంబడి రేపటి నుంచి బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. సముద్రంలోకి మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని, ఇప్పటికే సముద్రంలో ఉన్న జాలర్లు తీరానికి చేరుకోవాలని అధికారులు ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని ఓడరేవుల్లో ఒకటో నంబరు ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి. అటు ఒడిశాలో కూడా బలమైన గాలులతొ కూడిన వర్షాలు వీస్తాయని, అధికారులు హెచ్చరించారు. ఇటు తెలంగాణలోనూ పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. వర్షాల నేపథ్యంలో పలు ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగత్రలు మరింత తక్కువగా నమోదయ్యే అవకాశాలున్నాయని అధికారులు చెప్పారు.
 
అశోబా పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ వాయుగుండంగా బలహీనపడుతూ తొమ్మిదో తేదీ ఉదయానికి కోస్తాలో తీరాన్ని దాటవచ్చని తెలిపింది. తుఫాన్‌గా మారకుండానే వాయుగుండంగానే కోస్తాలో తీరం దాటవచ్చని ఐఎండీ అంచనా వేసింది. అయితే తుపాను నేపథ్యంలో ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యల్లో నిమగ్నమైంది. వాయుగుండంగా మారి తీరాన్ని దాటుతుందని అధికారులు అంచనా వేస్తున్నప్పటికీ.. అలా జరగని పక్షంలో తీరప్రాంతంలో ఎలాంటి నష్టం వాటిల్లకుండా తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే ప్రభుత్వ అధికారులకు అదేశాలు జారీ చేసింది. ప్రభావిత ప్రాంతాలలో అధికారులు నిరంతరం సేవలు అందించేందుకు సిద్దంగా వుండాలని ఆదేశించింది. ప్రభావిత ప్రాంతాల్లో కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. తుఫాను ప్రభావం అధికంగా వుండే ప్రాంతాలలోని ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు ఆదేశాలను జారీ చేసింది.

జి, మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles