Discussion over power generation sharing between telangana and andhra pradesh

telangana assembly, CM KCR, congress, Telangana TDP, budget sessions, debate, power generation, share, telangana, andhra pradesh

discussion over power generation sharing between telangana and andhra pradesh

తెలంగాణ అసెంబ్లీలో విద్యుత్ పంపిణీపై చర్చ

Posted: 11/07/2014 09:03 AM IST
Discussion over power generation sharing between telangana and andhra pradesh

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో సభలో ‘విద్యుత్’ సెగలు తాకనున్నాయి. బడ్జెట్ సమావేశాల రెండో రోజున ప్రధానంగా విద్యుత్ సమస్యపై చర్చ జరుగనుంది. ఉదయం 10 గంటలకు తెలంగాణ అసెంబ్లీ ప్రారంభం కానుంది. ముందుగా ప్రశ్నోత్తరాల కార్యక్రమం కొనసాగనుంది. ప్రశ్నోత్తరాల సమయంలో ప్రస్తావనకు వచ్చే పది ప్రశ్నల్లో.. మూడు ప్రశ్నలు విద్యుత్‌కు సంబంధించినవే ఉన్నాయి. దీంతో అధికార, విపక్షాల మధ్య ఈ అంశంపై వివాదం రాజుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

ఈ నేపథ్యంలో రాష్ట్రంలో విద్యుత్ కోతలలో ఎండుతున్న పంటలు, జీవితాలను చాలిస్తున్న రైతలు అంశం ప్రధానంగా చర్చకు రానుంది. ఈ అంశంపై ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు ఇరుకున్పెట్టనున్నాయి. ముఖ్యమంగా టీడీపీ నుంచి ప్రభత్వంపై విమర్శల దాడి కోనసాగనుంది. ఈ తరుణంలో రాష్ట్ర పునర్ విభజన బిల్లులో కేటాయించిన ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమకు వాటాను ఇవ్వడం లేదన్న అంశంతో కౌంటర్ ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం సిద్దంగా వున్నట్లు సమాచారం.

ప్రశ్నోత్తరాల్లో శాసనసభ్యులు అడిగే పలు ప్రశ్నలకు రాష్ట్ర మంత్రులతో పాటు సీఎం కేసీఆర్ సమాధానాలు ఇవ్వనున్నారు. విద్యుత్ ఉత్తత్తి, పంపిణీ, నూతన పారిశ్రామిక విధానం, కల్యాణ లక్ష్మీ, భూ పంపిణీ, ఫీజు రీయింబర్స్ మెంట్ లపై  తదితర అంశాలు ప్రశ్నోత్తరాల సమయంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా బడ్జెట్ పై చర్చను ప్రతిపక్ష నేత జానారెడ్డి ప్రారంభిస్తారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles