Beyonce is no 1 on forbes top earning list

Top Earners, fornes, Beyonce, Taylor Swift, Pink, Rihanna, Katy Perry. Jennifer Lopez, Miley Cyrus, Celine Dion, Lady Gaga, Britney Spears

Beyonce is No. 1 on Forbes top-earning list

అత్యధికంగా ఆర్జించిస్తున్న మహిళా ఆర్టిస్టులు వీరే

Posted: 11/06/2014 05:51 PM IST
Beyonce is no 1 on forbes top earning list

ప్రస్తుత్త తరుణంలో ప్రపంచ సంగీత ప్రియుల మదిని టైలర్ స్విఃస్ట్ దోచుకున్నా..అత్యంత వార్షిక సంపాదనను ఆర్జించిన వారిలో మాత్రం బియాన్స్ మరోమారు చరిత్ర సృష్టించింది. ఈ ఏడాదిలోనూ బియాన్స్ అత్యంత అధిక ఆదాయన్ని ఆర్జించి ఫోర్బ్స్ అత్యంత ఆర్జించిన మహిళా ఆర్టిస్టుల జాబితాలో తొలిస్థానాన్ని సుస్థిరం చేసుకంది. గత ఏడాది కూడా ఆమె అత్యధిక ఆదాయం ఆర్జించిన జాబితాలో నెంబర్ వన్ గా నిలిచింది. అయితే గత ఏడాదికి ఈ ఏడాదీకి ఏకంగా తన ఆదాయన్ని రెట్టింపు చేసుకుంది. గత ఏబాది 53 మిలియన్ డాలర్ల ఆదాయన్ని ఆర్జించిన ఆమె.. ఈ ఏడాది ఏకంగా 115 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని అర్జించి తన స్థానాన్ని పథిలపర్చుకుంది. ఫోర్బ్స్ పత్రిక అత్యధిక ఆదాయాన్ని ఆర్జిస్తున్న అర్టిస్టుల వివరాలను నమోదు చేసుకుంటున్న తరుణంలోనే బియాన్స్ కార్టర్ 95 ప్రదర్శలు ఇచ్చారని, దీంతో ఆమె ఆదాయం అమాంతంగా 100 మిలియన్ డాలర్ల జాబితాలోకి చేరిందని ఫోర్బ్స్ పత్రికా యాజమాన్యం తెలిపింది.

బియాన్స్ తో నువ్వా నేనా అంటూ అటు సంగీతంలోనూ. ఇటు ఆదాయంలోనూ పోటీ పడుతున్న టైలర్ స్విప్ట్ రెండవ స్థానంలో కొనసాగుతుంది. ఆవె వార్షిక ఆదాయం 64 మిలియన్ డాలర్లుగా నమోదైయ్యిందని పత్రికా యాజమాన్యం తెలిపింది. 1989 పేరున విడుదల చేసిన ఆల్బయ్ 1.3 మిలియన్ మ్యూజిక్ సీడీలను విక్రయించడంతో స్విప్ట్ కొనసాగింది. అయితే మూడో స్థానంతో దూసుకోచ్చిన పింక్ మాత్రం స్విఫ్ట్..తో బాగానే తలపడింది. కేవలం పన్నెండు మిలియన్ డాలర్ల వత్యాసంతో పింక్ మూడోవ స్థానంలో కొనసాగింది.

పింక్ తరువాత రిహనా 48 మిలియన్ డాలర్లతో నాల్గవ స్థానంలో నిలువగా, ఆ తరువాతి ఐదవ స్థానం 40 మిలియన్ డాలర్ల వార్షికాదాయంతో క్యాటీ పెర్రీ నిలిచింది. తన అద్భుత గానంతో నాటి నుంచి నేటి తరం వరకు అన్ని వర్గాల సంగీత ప్రియులను ఓలలాడిస్తున్న జెన్నీఫర్ లోఫెజ్ 37 మిలియన్ల వార్షికాదాయంతో ఆరవ స్థానంలోకి కొనసాగుతుంది, అయితే అమె అమెరికన్ ఐడల్ లో న్యాయనిర్ణేతగా రావడంతో ఆదాయం పెరిగింది. బాంగ్రేజ్ అల్బమ్ అమ్మాకాలు జోరందుకోవడతో 36 మిలియన్ డాలర్ల వార్షికాదాయంతో మిల్లీ సైరస్ ఏడవ స్థానానికి చేరుకుంది. అయితే సీలైన్ డియాన్ కూడా 38 మిలియన్ డాలర్లు ఆర్జించి మిల్లీసైరన్ తో  పోటీపడింది. సీలైన్ డియాన్ ఈ ఏడాదికి చెప్పుకోదగ్గ అల్బమ్ లు లెకపోయినా.. లాస్ వెగాస్ లో స్థిరంగా వుండటం, యూరోపియన్ దేశాలలో క్రమంగా ప్రదర్శనలు ఇవ్వడంతో అమెకు ఎనమిదస్థానం దక్కింది.

తన మాధూర్యమైన పాటలతో కొత్త క్రేజ్ సొంతం చేసుకున్న లేడీ గగ గా ఈ సారి తొమ్మిదవ స్థానంతో సరిపెట్టుకోవాల్సివచ్చింది. మూడేళ్ల కింద్రట 90 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించి.. చర్చలకు కేంద్రబింధువుగా నిలిచిన గగా, ఈ ఏడాది కేవలం 33 మిలియన్ డాలర్ల ఆదాయంతో సరిపెట్టుకుంది. బ్రిట్నీ ప్పియర్స్ కూడా ఈ ఏడాది బ్రిట్నీ జీన్ అనే అల్బమ్ ను మినహాయించి చెప్పుకోదగ్గ స్థాయిలో ఎలాంటి ఆల్బమ్ లను విడుదల చేయలేదు. కేవలం బీన్ అల్బమ్ ఆర్జించిన 20 మిలియన్ డాలర్లతో బ్రిట్నీ జీన్స్ పదో స్థానంతో సరిపెట్టుకుంది.
 
జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles