Will never resign again have learnt my lesson says arvind kejriwal

Arvind Kejriwal, Aam Aadmi Party, Delhi, trap, Prime Minister, Narendra Modi, assembly dissolution, 49 days of governance, great orator, Maharashtra, Haryana, Modi for PM, Kejriwal for Chief Minister

Will Never Resign Again, Have Learnt My Lesson says Arvind Kejriwal

49 రోజుల పాటన రాజకీయ పాఠాలను నేర్పింది.

Posted: 11/06/2014 03:58 PM IST
Will never resign again have learnt my lesson says arvind kejriwal

దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హవా కోనసాగుతుందని తెలిసి.. తనదైన శైలిలో ప్రచారానికి తెరలేపారు ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్. ఇటీవల జరిగిన మహారాష్ట్ర, హర్యానా ఎన్నికలలోనూ అది స్పష్టం కావడంతో అప్ కాస్త గందరగోళంలోకి జారుకుంటోంది. అయితే ఈ గంధరగోళం నుంచి సామాన్యుల పార్టీగా నామకరణం చేసుకున్న మేధావుల సారి అవీనీతి అంతం.. మా పంతం అనే ప్రచారానికి బదులు.. మోడీని చూసి ఓట్ల వేయకండి, 49 రోజుల పాలనను చూసి ఓట్లు వేయండి అంటూ కొత్త నినాదాన్ని తెరపైకి తీసుకువచ్చింది.

ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు నిర్వహించాలని ఆప్ నేత ప్రశాంత్ భూషన్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటీషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం.. దేశ రాజధానిలో ప్రజలను ప్రజాస్వామ్య పాలను నుంచి ఎందుకు దూరం చేస్తున్నారని ప్రశ్నించింది. త్వరగా ప్రజాస్వామ్య పాలనను అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో.. చకచక పావులు కదిపిన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్.. అన్ని పార్టీలో చర్చించి.. ప్రభుత్వ ఏర్పాటుకు ఎవ్వరూ సుముఖంగా లేరని చెప్పింది. దీంతో ప్రస్తుత అసెంబ్లీని రద్దు చేయాలని ఆయన కేంద్రానికి లేఖ రాయగా, దానిని వెనువెంటనే కేంద్రంతో పాటు రాష్ట్రపతి అమోదించారు.

ఈ నేపథ్యంలో మరోమారు ఏడాది తిరగకుండానే మరోమారు ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు రానున్నాయి. ఈ నేపథ్యంలో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్.ను ఓ జాతీయ ఆంగ్ల మీడియా ఇంటర్వ్వూ చేసింది. ఈ సందర్బంగా ఆయన తన మనస్సులోని మాటలను భయటపెట్టారు. ఢిల్లీ ప్రజలు ప్రధాని నరేంద్రమోడీని చూసి ఓటు వేయవద్దన్న ప్రచారానికి తెరలేపారు. ఢిల్లీని మోడీ పరిపాలించరని చెప్పారు. మహారాష్ట్ర, హర్యానా ఎన్నికలు ప్రధాని మోడీ ఆధారంగానే జరిగాయని ఆయన తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.

అయితే చివరకు ఫడ్నవిస్, ఖత్తర్ ముఖ్యమంత్రులు అయ్యారని అన్నారు. హర్యానా, మహారాష్ట్రలలో వేరే ఆప్షన్ లేదని, అయితే ఢిల్లీలో ఆప్ రూపంలో ప్రత్యామ్నాయం ఉందన్నారు. ఇక్కడ తనకు, జగదీష్ ముఖీకి మద్య సాగుతున్న పోరుగా అభివర్ణించిన ఆయన.. ఢిల్లీలో పోరు తనకు మోడీకి మధ్య కాదని అన్నారు.. తనకు ఎదురైన అనుభవాల ద్వారా పాఠాలు నేర్చుకున్నానని, ఇంకెప్పుడూ రాజీనామా చేయనని కేజ్రీవాల్ తెలిపారు. తమ 49 రోజుల పాలన రాజకీయ పాఠాలను నేర్పించదన్నారు. అయితే రాజీనామా తరువాత తమపై ఆశలు పెట్టుకున్న ప్రజల ఆశలను, అఢియాశలు చేశామన్న భాధ వుందని, మరోమారు ఇలాంటి పోరబాట్లు చేయబోమని చెప్పారు.

తన రాజీనామా వల్ల మధ్యతరగతి ప్రజలు నిరాశ చెందారన్నారు. భవిష్యత్ లో ఆందోళన ద్వారా రాజకీయాలు చెయ్యమని ఆయన తెలిపారు. ఢిల్లీని అత్యుత్తమంగా తీర్చిదిద్దడమే తమ ఎన్నికల అజెండాగా కేజ్రీవాల్ పేర్కొన్నారు. కాగా  నరేంద్ర మోడీ గొప్ప ఆపరేటర్గా ఆయన అభివర్ణించారు. అయితే క్షేత్రస్థాయిలో పనులు ముందుకు సాగడంలో నిర్లక్ష్యం ఉందని కేజ్రీవాల్ ఆరోపించారు. గత ఎన్నికలలో 20 కోట్ల మేర విరాళాలను సేకరించామని, ఈ సారి కొంత అధికస్థాయిలో 30 నుంచి 40 కోట్ల రూపాయల వరకు విరాళాలను రాబడతామని చెప్పారు. అయితే తమ ప్రత్యర్థులకు 3 నుంచి 4 వేల కోట్ల రూపాయలను ఖర్చుపెట్టే స్థోమత వుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

 

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles