Telangana assembly budget sessions expectations high from maiden telangana state budgettelangana assembly budget sessions expectations high from maiden telangana state budget

telangana assembly, butget, Eetela rajendar, legislative council, DY. Cm Rajaian, Telangana government, CM, KCR

telangana assembly budget sessions, expectations high from maiden telangana state budget

కోట్ల మంది ఆశలను చిగురింపజేసే లక్షకోట్ల బడ్జెట్..

Posted: 11/05/2014 09:54 AM IST
Telangana assembly budget sessions expectations high from maiden telangana state budgettelangana assembly budget sessions expectations high from maiden telangana state budget

మరికొద్ది సేపట్లో అవిష్కృతం కానున్న తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ఒక ప్రాముఖ్యత వుంది. ఇన్నాళ్లు తాము కోరుకున్న స్వయం పాలన, స్వరాష్ట్ర కాంక్ష నేరవేరిన పక్షంలో వారి రాష్ట్ర బడ్జెట్ ఎలావుండబోతోందన్నది మరికొద్ది సేపట్లో అవిష్కృతం కాబోతోంది. శాసనసభలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తొలిసారిగా బడ్జెట్ ను ప్రవేశపెడుతుండగా, అదే సమయంలో శాసనమండలిలో డిప్యూటీ సీఎం రాజయ్య బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. అయితే తెలంగాణ ప్రజలపై వరాల జల్లు కురిపిస్తామే తప్ప.. ఇతర ప్రభుత్వాల మాదిరిగా వడ్డింపుల జోలిక పోబోమని ఇప్పటికే మంత్రి ఈటెల స్పష్టం చేయడంతో.. ప్రజలు తీవ్ర ఉత్కంటతో బడ్జెట్ కోసం ఎదురుచూస్తున్నారు.

రాష్ట్ర ప్రజల సంక్షేమమే ధ్యేయంగా, అభివృద్ధికి తోడ్పడేలా తెలంగాణ రాష్ట్ర తొలి బడ్జెట్ ఉంటుందని ఈటెల రాజేందర్ తెలిపారు. తెలంగాణ ప్రజల సమస్యలపై ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీలో తాను ఎన్నోసార్లు పోరాడామని.. అయినా ఆంధ్రా పాలకులు ఒక్క రూపాయి కూడా ఇచ్చేది లేదన్నారని పేర్కొన్నారు. అలాంటిది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం కలిగినందుకు సంతోషంగానూ, గర్వంగానూ అనిపిస్తోందని ఈటెల చెప్పారు.

ఆకలితో అలమటిస్తున్న అణగారిన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా మా బడ్జెట్ ఉండబోతోందన్నారు. సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఇప్పటివరకూ రూ. 200గా ఉన్న పింఛన్లును రూ. 1,000కి, రూ. 500 పింఛన్లను రూ. 1,500కు పెంచాం. కుటుంబంలో ఒక్కో వ్యక్తికి ఇచ్చే బియ్యాన్ని ఆరు కేజీలకు పెంచాం. 20 కేజీల బియ్యం పరిమితిని తీసేశాం. వ్యవసాయంతో గ్రామ ఆర్థిక వ్యవస్థ ముడిపడి ఉన్నందున ఈ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. పేద దళిత యువతుల వివాహాలకు ఆర్థిక సాయం వంటి కార్యక్రమాలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు.

తెలంగాణ ఉద్యమాన్ని తీవ్రరూపం చేసి రాష్ట్రాన్ని ఎలా సాధించామో... అలాగే మా ప్రభుత్వం చేపట్టిన చెరువుల పునరుద్ధరణ, వాటర్‌గ్రిడ్ వంటి ప్రాజెక్టులను అమలుచేసి తీరుతాం. మా ప్రాథమ్యాలను బడ్జెట్ రూపంలో ఆవిష్కరించబోతున్నాం. నిధుల సమీకరణకు మా మార్గాలు మాకున్నాయి. ఏడాదిలోనే మా సృజనాత్మకత ఏమిటో చూపెడతామన్నారు. అయితే సంక్షేమాలకు పెద్ద పీట వేస్తున్నారని చెప్పిన ప్రభుత్వం ఏ సంక్షమానికి ఎంతంత చోప్పున కేటాయించనుందోనని ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇఫ్పటికే తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వాలు అమలపర్చిన పలు పథకాలు కొనసాగడం లేదని విమర్శలు వస్తున్నాయి. అయితే వాటి స్థానంలో కొత్త పథకాలు వస్తున్నాయని తెలుస్తోంది.

ముఖ్యంగా ఆరోగ్య భద్రతా కార్డు అర్హుదారులకు లక్ష నుంచి లక్షన్నర రూపాయల వరకు పోడగించనున్నారా..? అంటూ ప్రజలు వేయి చూస్తున్నారు. దీంతో పాటు ఉద్యోగులకు ఆరోగ్య కార్డులు జారీ చేసిన ప్రభుత్వం ప్రజారోగ్యం కోసం ఎలాంటి చర్యలు చేపడుతుందోనన్నది కూడా ప్రజలు కోటి ఆశలతో వేచిచూస్తున్నారు. ఆరోగ్య శ్రీ పథకం అమలు అంతంత మాత్రంగా ఉన్న దరిమిలా.. ఈ పథకం స్థానంలో కొత్త పథకాలను ప్రవేశ పెట్టనున్నట్లు సమాచారం. విద్యార్థుల ఫీజు రియంబర్స్ మెంట్ కోసం ఎన్ని నిధులు కేటాయిస్తారన్నది కూడా క్రీయాశీలకంగా మారనుంది. దీంతో పాటు ఇళ్లు లేని పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మాణ పథకానికి ఎంత మేర నిధులు కేటాయిస్తారన్న అంశంపై కూడా ప్రజలు కోటి ఆశలు పెట్టుకున్నారు.

హామీలన్నీ నెరవేరుస్తాం..

ఉద్యమకారులుగా మా గమ్యాన్ని చేరాం. పాలకులుగా కూడా ప్రజలకిచ్చిన హామీలన్నింటిని నెరవేరుస్తాం. ఇప్పటికే పలు కార్యక్రమాల ద్వారా కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టాం. సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించాం. టాస్క్‌ఫోర్స్ నివేదికలు తెప్పించుకున్నాం. అన్ని అంశాలను బేరీజు వేసుకొని బడ్జెట్‌ను రూపొందించాం. 14 ఏళ్లుగా మాపై విశ్వాసం ఉంచారు. ప్రజలకు ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో వుందని, ఆదే దిశలో ముందుకు సాగుతుందని ఈటెల చెప్పారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles