Intelligence warns al qaeda may attack kolkata

intelligence bureau latest warnings, intelligence bureau on pakistan, intelligence bureau on al qaeda attacks, indian intelligence bureau news, al qaeda attack on kolkata, latest news, indian navy alert, west bengal alert

intelligence warns al qaeda may attack kolkata : intelligence officers warns kolkata to be on high alert that al qaeda may attack on country terrorists may come by by sea way. with intelligence warnings navy and kolkata government alerted

ఉపఖండంపై దాడికి వస్తున్న ఉగ్రవాదులు

Posted: 11/04/2014 09:37 PM IST
Intelligence warns al qaeda may attack kolkata

ఉపఖండంపై దాడి చేసేందుకు ఉగ్రవాదులు మరోసారి సిద్ధం అవుతున్నారు. భారత్ పై ఉగ్రవాదులు దాడి చేసే అవకాశం ఉందని దేశ ఇంటలిజెన్స్ హెచ్చరించింది. దేశంపై పన్నుతున్న కుట్రలపై తమకు సమాచారం అందిందని స్పష్టం చేసింది. ముఖ్యంగా కోల్ కతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. సముద్ర మార్గంలో వచ్చి దాడులు చేసే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా ఆల్ ఖైదా ఉగ్రవాదులు కోల్ కతా ఓడరేవుపై దాడి చేసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని హై అలర్ట్ ప్రకటించింది.

గత పరిణామాలు, దాడులను విశ్లేషించిన ఇంటలిజెన్స్ గతంలో కూడా దాడులకు ముందు సముద్ర మార్గం ద్వారానే దేశంలోకి ఉగ్రవాదులు ప్రవేశించే ఆస్కారం ఉందని చెప్పారు. తాజా హెచ్చరికలతో నేవి అప్రమత్తమైంది. యుధ్ద నౌకలు ఐఎన్ఎస్ పృథ్వి, ఐఎన్ఎస్ సుమిత్రలను వెంటనే సముద్రంలోకి పంపటం జరిగింది. వాస్తవానికి నేవి ఉత్సవాల నేపథ్యంలో రెండూ తీరంలో వేడుకల్లో పాల్గొంటున్నాయి. అయితే ఇంటలిజెన్స్ హెచ్చరికలతో వీటిని ఉన్నపళంగా సముద్రంలో రక్షణ కోసం పంపించారు. ఈ మేరకు రక్షణ మంత్రి కూడా ప్రకటన చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే యుద్ధనౌకలు సముద్రంలోకి వెళ్లాయన్నారు.

అటు కోల్ కతా ప్రభుత్వం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి పరిస్థితిని సమీక్షించింది. తీర ప్రాంతంతో పాటు.., కోల్ కతాలోని కీలక ప్రాంతాలు, రాష్ర్టంలని ముఖ్య నగరాల్లో బందోబస్తు, తనిఖీలు పెంచాలని ఆదేశించింది. దేశంలో బ్రాంచి విస్తరణ దిశగా గతంలో చర్యలు చేపట్టిన ఆల్ ఖైదా తాజాగా దాడులు చేస్తుందని సమాచారం రావటంతో అంతా అప్రమత్తం అయ్యారు. అనుమానితుల కదలికలపై కూడా గట్టి నిఘా పెట్టారు. జనరద్దీ కలిగి ఉండే చారిత్రక నగరంపై ఉగ్రవాదులు దాడి చేస్తే నష్టాన్ని ఊహించటం చాలా కష్టం అవుతుంది. దీంతో ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించి అప్రమత్తంగా పరిస్థితిని సమీక్షిస్తోంది.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : intelligence bureau  al qaeda  latest news  kolkata  

Other Articles