Woman jailed for trying to watch volleyball in iran

British-Iranian woman jailed, objection on women in iran, iran government rules for women, gnoncheh ghavami jailed, gnoncheh ghavami vollyball, iran vollyboll team, women rights latest, vollyball matches latest, iran jails

woman jailed for trying to watch volleyball in iran : British-Iranian woman gnoncheh ghavami jailed for a year for trying to watch volleyball game

న్యాయమా? : మగాళ్ళ మ్యాచ్ కు వెళ్లిన మహిళకు జైలు

Posted: 11/03/2014 12:14 PM IST
Woman jailed for trying to watch volleyball in iran

ప్రపంచ దేశాలు అభివృద్ధిలో ఒకదానితో మరొకటి పోటి పడుతున్నాయి. కాని అరబ్ దేశాలు మాత్రం ఇంకా పాత సాంప్రదాయాలు, సిద్ధాంతాలు, ఆంక్షలను మాత్రం వీడటం లేదు. మహిళలపై ఇరాన్ లో ఎలా ఆంక్షలు ఉంటాయో తెలిపే సంఘటన ఇది. ఘోంచే ఘనామి అనే బ్రిటీష్-ఇరానియన్ మహిళ టెహ్రాన్ లో జరిగిన ఇరాన్ -ఇటలీ పురుషుల వాలీబాల్ మ్యాచ్ చూసేందుకు ప్రయత్నించింది. ఇది చట్ట విరుద్ధం అంటూ ఆమెకు స్థానిక కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది.

ఇరాన్ లో మహిళలు పురుషుల మ్యాచ్ లు చూడటమే కాదు.., చూసేందుకు ప్రయత్నించినా కూడా నేరమే. అయితే ఈ చట్టానికి వ్యతిరేకంగా పురుషుల మ్యాచ్ లకు ఆడవారు కూడా ధైర్యంగా వెళ్ళాలి అని ఘోంచె పిలుపునిచ్చింది. ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు తాను మ్యాచ్ కు వెళ్లే ప్రయత్నం చేసింది. అడ్డుకున్న పోలిసులు ఘనామిని అరెస్టు చేశారు. ఈ ఘటన జూన్ లో జరగ్గా.. నాటి నుంచి రిమాండ్ ఖైదీగా జైలులోనే ఘోంచే ఉంది. దీంతో ఆమెను విడుదల చేయాలని ఆమ్నెస్టీ వంటి సంస్థలు అంతర్జాతీయంగా ఉద్యమించాయి.  

ఈ ఆందోళనల నేపథ్యంలో స్పందించిన ఇరాన్ కోర్టు.., తమ చట్టాలు, నిబంధనల ప్రకారం పురుషుల మ్యాచ్ చూడటం నేరమని... ఇందుకు ప్రయత్నించిన ఘోంచె ఘనామిపై వచ్చిన ఆరోపణలు నిర్ధారిస్తూ ఆమెకు ఏడాది జైలు శిక్ష విధించింది. ఈ తీర్పుపై ఇరాన్ సహా ఇతర దేశాల్లో నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. మహిళల మ్యాచ్ అయితే కాస్తో కూస్తో డ్రస్ కోడ్ ఇబ్బంది ఉంటుంది కానీ.., పురుషుల మ్యాచ్ చూడటంలో ఇబ్బంది ఏమిటని విమర్శలు వస్తున్నాయి. చట్టాలు, కోర్టు తీర్పులపై కామెంట్లు చేయలేము. కాని మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా చట్టాలు కూడా మారాల్సిన అవసరం ఉంది.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : gnoncheh ghavami  iran  jail  latest news  

Other Articles