Rss chief mohan bhagawat criticised modi government

mohan bhagawat on narendra modi, mohan bhagawat comments on modi, mohan bhagawat latest news, mohan bhagawat rss speech, mohan bhagawat comments, rss meetings, nda government programmes, latest news, modi in rss

mohan bhagawat criticised modi government : Mohan Bhagwat made a veiled criticism of the Narendra Modiled NDA government during his speech in rss meeting.

మోడి ప్రభుత్వంపై మోహన్ భగవత్ విమర్శలు

Posted: 11/03/2014 11:30 AM IST
Rss chief mohan bhagawat criticised modi government

కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంపై రాష్ర్టీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ పరోక్ష విమర్శలు చేశారు. ఆగ్రాలో జరిగిన ఆర్ఎస్ఎస్ సమావేశం ముగింపు సభలో భగవత్ ప్రసంగించారు. ఈ సందర్బంగా మోడి సర్కారుకు పరోక్షంగా చురకలంటించారు. సంఘ్ ఆశించిన ఫలితాలు ప్రభుత్వం నుంచి రావటం లేదన్నారు. తాము ఏం మాట్లాడినా విమర్శించే ఒక వర్గం కామెంట్లపై ప్రభుత్వం నోరుమెదపకపోవటం ఆశ్చర్యకరమన్నారు. ఉదాహరణకు భారతదేశంలో ఉండేవారంతా హిందువులే అన్న తమ ప్రకటనపై కొన్ని పార్టీలు, సంస్థలు విమర్శలు చేశాయని గుర్తు చేశారు. అయితే ఈ ప్రకటనపై ప్రభుత్వం కనీసం నోరు మెదపలేదన్నారు. రాజకీయ లాభం దెబ్బతింటుందునే భయంతో ప్రభుత్వం తమ కామెంట్ పై స్పందించేందుకు వెనకాడుతోందని విమర్శిచారు.

అయితే ఇప్పటికీ ప్రభుత్వంపై తాము నమ్మకంతో ఉన్నామని చెప్పారు. ఇకపై అయినా ప్రజల మనోభావాలకు అనుగుణంగా నడుచుకుంటుందని సంఘ్ ఆశిస్తోందన్నారు. తాము కోరుకుంటున్న పలు కార్యక్రమాల జాబితాను ఈ మద్యే ప్రభుత్వానికి అందించాలని ఆర్.ఎస్.ఎస్. భావిచింది. మెజార్టీ ప్రజల సంక్షేమం కోసం తాము కార్యక్రమాలు రూపకల్పన చేశామని చెప్తున్నారు. అటు ఈ సమావేశంలో మాట్లాడాల్సిన వీకేసింగ్ కు నిరాశ ఎదురైందని చెప్పాలి. 11గంటలకు వీకేసింగ్ మాట్లాడాల్సి ఉంది. సంఘ్ నిబంధనల ప్రకారం మాట్లాడాల్పిన వారు నిర్ణీత సమయానికి ముందుగానే సభ వద్దకు చేరుకోవాలి. కానీ మంత్రి మాత్రం ఆలస్యంగా 1240కి వచ్చారు.

దీంతో ఆయనకు మాట్లాడే అవకాశం ఇవ్వటం లేదని మోహన్ భగవత్ ప్రకటించారు. ప్రభుత్వంలో ఆర్.ఎస్.ఎస్. కు సంబంధం లేని వ్యక్తులు ఉన్నారనీ వారికి సంఘ్ కార్యకలాపాలు, సమయపాలన, క్రమశిక్షణ గురించి తెలియదన్నారు. అయినా సరే ఒకరి కోసం తమ నిబంధనలు మార్చుకోమని స్పష్టం చేశారు. ఆలస్యంగా వచ్చినవారు వెనక కూర్చోవాల్సిందే అని చెప్పటంతో చేసేది లేక వీకేసింగ్ వెనుక వరుసలో కూర్చున్నారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rss  mohan bhagawat  modi  latest news  

Other Articles