Bonda uma fires on telangana chief minister kcr

telangana chief minster, kcr comments, bonda uma on kcr, telangana budget, telangana budget session latest news, loan waiver, telangana andhrapradesh issues, bonda uma son case

tdp leader bonda uma fires on telangana chief minister kcr : andhrapradesh tdp leader bonda uma fires on kcr and alleges that even he dont know how to prepare budget

కేసీఆర్ విజయవాడకు వస్తే బొందపెడతాం...

Posted: 11/03/2014 09:00 AM IST
Bonda uma fires on telangana chief minister kcr

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఆంధ్రప్రదేశ్ టీడీపీ నేత బోండా ఉమా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్; రుణమాఫీ అంశాలపై కేసీఆర్ చేసిన ఆరోపణలకు ఉమ ధీటుగా సమాధానం ఇచ్చారు. ఏపీ ప్రభుత్వం ఐదు రూపాయలు కూడా రుణమాఫి చేయలేదన్న వ్యాఖ్యలు సరికావన్నారు. అంతేకాకుండా ఈ ఆరోపణలు నిరూపించేందుకు విజయవాడలో సభ పెట్టి మాట్లాడుతానన్న కేసీఆర్ నగరంలో అడుగుపెడితే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. కేసీఆర్ భాషలో చెప్పాలంటే విజయవాడకు వస్తే బొందపెడతాం అంటే హెచ్చరించారు.

కనీసం రాష్ర్ట బడ్జెట్ కూడా తయారుచేయలేని దద్దమ్మ కేసీఆర్ అని వ్యాఖ్యానించారు. ఇళ్ళు చక్కదిద్దుకోలేని వ్యక్తి ఇతరుల లోపాల గురించి మాట్లాడటం ఏమిటని ప్రశ్నించారు. తెలంగాణలో ఉన్న సమస్యలు పరిస్కరించుకోలేని సన్నాసి ఏపి గురించి ఏవో మాటలు చెప్తున్నారు అని విమర్శించారు. సమస్యలను పరిష్కరించుకోవటం చేతకాక.., ఇతర రాష్ర్టాలు, కేంద్ర ప్రభుత్వంతో సన్నిహితంగా ఉండక తెలంగాణ భవిష్యత్తును ప్రశ్నార్ధకం చేస్తున్నారని మండిపడ్డారు. నిత్యం తిట్టేవారికి ఎవరు సాయం చేస్తారో తెలుసకోవాలన్నారు.

గత ఐదు నెలలుగా కేసీఆర్ తెలంగాణకు చేసిందేమి లేదన్నారు. అసమర్ధత కప్పిపుచ్చుకునేందుకు ప్రజల్ని రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు. భవిష్యత్తులో ఇలాగే ఉంటే తెలంగాణ ప్రజలు కేసీఆర్ కు బుద్ది చెప్పటం ఖాయమన్నారు. బొండా ఉమ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి అనే గౌరవం లేకుండా అహంకారంతో మాట్లాడుతున్నారని టీఆర్ఎస్ నేతలు ద్వజమెత్తుతున్నారు.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kcr  bonda uma  telangana  andhrapradesh  

Other Articles