Lovers public kissing in hyderabad against morel policing

hyderabad lovers protest, lovers protest in hcu, central university lovers protest, kiss of love protest, kiss and hug protest, abvp on lovers kissing, moral policing, protest on moral policing, latest news

lovers protest with public kissing against morel policing : central university students protested by public kissing with their lovers agaist moral policing. abvp and other organisations protest against lovers behaviour and the same time lovers protest against them

హైదరాబాద్ లో ‘కిస్ ఆఫ్ లవ్’ రచ్చ రంబోల...

Posted: 11/03/2014 08:28 AM IST
Lovers public kissing in hyderabad against morel policing

రెండు మనోభావాల మద్య ఘర్షణ రాష్ర్టాలకు పాకుతోంది. దేశ సంస్కృతి, సాంప్రదాయాలు కాపాడాలి, ప్రేమ పేరుతో ఇష్టంవచ్చినట్లు ప్రవర్తించవద్దంటూ కొన్ని సంస్థలు మోరల్ పోలిసింగ్ నిర్వహిస్తుండగా వారికి వ్యతిరేకంగా ప్రేమికులు, వీరికి మద్దతుగా మరికొన్ని సంస్థలు ఉద్యమిస్తున్నాయి. సమాజంలో కనీసం ప్రేమించుకునే హక్కు కూడా లేదా అంటూ బహిరంగ ముద్దులతో వినూత్నంగా నిరసనలకు తెరతీశాయి. కేరళలో మొదలైన ఈ ఉద్యమం తెలుగు రాష్ర్టాల రాజధాని హైదరాబాద్ కు పాకింది. ఆదివారం రోజు హైదరాబాద్ సెంట్రల్ యునివర్సిటీలో ‘‘కిస్ ఆఫ్ లవ్’’ తీవ్ర ఉద్రిక్తతలు, ఆందోళనలకు దారి తీసింది.

వివాదంకు కేరళ కారణం

ఎన్నడూ లేనట్లుగా బహిరంగంగా ముద్దులు పెట్టుకుని నిరసన చేపట్టి సంచలనం కల్గించిన ఈ ఉద్యమానికి పునాది కేరళలో ఉంది. అక్కడ ప్రేమ పేరుతో జరుగుతున్న అసాంఘీక కార్యకలాపాలపై పలు హిందూ ధార్మిక, సంస్కృతి పరిరక్షణ సంస్థల ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొచ్చిలోని ఓ రెస్టారెంట్ లో ప్రేమజంటలపై దాడి చేశారు. అయితే ఇందులో అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడిన వారితో పాటు మామూలుగా మాట్లాడుకుంటున్నవారు కూడా ఉన్నారు. అయితే కార్యకర్తలు అందరిపై దాడి చేయటంతో మామూలుగా మాట్లాడుకుంటున్న ప్రేమికులు మండిపడ్డారు. మోరల్ పోలిసింగ్ పేరుతో తమను అడ్డుకోవటానికి మీరెవరంటూ తీవ్ర వాగ్వాదం జరిగింది. చివరకు పోలిసులు వచ్చి ధార్మిక సంస్థల కార్యకర్తలను అరెస్టు చేశారు. కాని వారి దాడిని ప్రేమికులు సీరియస్ గా తీసుకున్నారు. వీరికి ధీటుగా నిరసన తెలపాలని భావించి బహిరంగ ముద్దులు, కౌగిలింతల ప్రదర్శన పేరుతో నిరసన తెలపుతామని ప్రకటించారు.

ఈ ఉద్యమంపై పెద్దఎత్తున ప్రచారం చేపట్టేందుకు ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియా సైట్లలో ప్రత్యేక పేజీల ద్వారా ప్రచారం కల్పించారు. దీనిపై దేశ వ్యాప్తంగా మిశ్రమ స్పందన వచ్చింది. ప్రజాస్వామ్యవాదులు మోరల్ పోలిసింగ్ తప్పుబడుతుండగా.., విద్యావేత్తలు, మేధావులు మాత్రం కిస్ ఆఫ్ లవ్ ద్వారా దేశానికి ఉన్న పేరు దెబ్బతింటుందన్నారు. అదేవిధంగా సున్నిత పరిస్థితులుండే సమాజంపై చెడు ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఇవేవి పట్టించుకోకుండా కొచ్చిలో ప్రేమికులు ఆదివారం రోజు కిస్ ఆఫ్ లవ్ ప్రదర్శన చేశారు. మెరైన్ గ్రౌండ్స్ లో జరిగిన ఈ కార్యక్రమంకు విస్తృత ప్రచారం కల్పించటంతో జనం భారీగా తరలివచ్చారు. ఈ సందర్బంగా ప్రేమికులు మోరల్ పోలిసింగ్ కు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. అటు వీరికి వ్యతిరేకంగా హిందూ, ముస్లిం సంఘాలు నిరసన తెలిపాయి. దీంతో ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. చివరకు ప్రేమికులు తమ ముద్దుల ప్రదర్శన వ్యూహం మార్చుకుని నిరసన ర్యాలి చేపట్టారు.

 


Simple Picture Slideshow:
Could not find folder /home/teluguwi/public_html/images/slideshows/kissoflove

 

ఇలా మిశ్రమ స్పందన మద్యే ఈ ఉద్యమం హైదరాబాద్ కూ పాకింది. నగరంలోని సెంట్రల్ యునివర్సిటీలో ‘కిస్ ఆఫ్ లవ్’ కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం ఆరు గంటలకు పలువురు విద్యార్థులు, కొన్ని విద్యార్థి సంఘాల మద్దతుతో ఈ కార్యక్రమం నిర్వహించాయి. ఈ సందర్బంగా క్యాంపస్ లోనూ తీవ్ర ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. బహిరంగ ముద్దులకు వ్యతిరేకంగా ఏబీవీపీ, భజరంగదళ్ ఇతర హిందూ ధార్మిక సంస్థల కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. కార్యక్రమం అడ్డుకునేందుకు ప్రయత్నించారు. రెండు వర్గాల మద్య ఘర్షణ జరిగే అవకాం ఉండటంతో పెద్దఎత్తున చేరుకున్న పోలిసులు రెండు వర్గాలతో చర్చలు జరిపారు. అయితే తమ స్వేచ్ఛను అడ్డుకునేందుకు ధార్మిక సంస్థలు ఎవరంటూ విద్యార్థులు ప్రశ్నించారు. చీరకడితేనే భారతీయులా... ఎవరి స్వేచ్ఛ వారిది అని ప్లకార్డులు ప్రదర్శించారు. చివరకు పోలిసులు, క్యాంపస్ ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవటంతో రెండు వర్గాలు శాంతించాయి. కాని కిస్ ఆఫ్ లవ్ కార్యక్రమం మాత్రం జరిగింది.

ఎవరు కరెక్ట్..

కిస్ ఆఫ్ లవ్ నిరసనలకు భిన్న స్పందన వస్తోంది. ప్రజాస్వామిక వాదులు ఇది సరైన చర్యే.. స్వేచ్ఛను అడ్డుకునే వారికి ఇది సమాధానం అవుతుందని అంటున్నారు. అయితే మేధావులు మాత్రం ఇలాంటి వినూత్న నిరసనల వల్ల తల్లితండ్రులు తమ బిడ్డల గురించి మనవేదన చెందుతారని.., సమాజంపై కూడా చెడు ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రేమించుకోవటం తప్పు కాదు, కానీ ఈ ముసుగులో అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడటం ఎంతవరకు ఆమోదనియమో ప్రేమికులు సమాధానం చెప్పాలి. స్వచ్ఛమైన ప్రేమ అనేది శరీరాలకు సంబంధించినది కానప్పుడు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారో చెప్పగలరా...? అటు ధార్మిక సంస్థల ప్రతినిధులు కూడా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించాలి. పరిరక్షణ పేరుతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటామంటే ఇలానే అవుతుంది. ఫలితంగా మీరు కోరుకుంటున్న సమాజ పరిరక్షణ మరింత చెడు పరిణామాలకు దారి తీస్తుంది. అందరూ ఒకసారి ఎవరి వ్యక్తిగత మనోభావాలు పక్కనబెట్టి దేశం గురించి.., మన హక్కులు, స్వేచ్ఛ, సంస్కృతి సాంప్రదాయాల గురించి ఆలోచిస్తే ఇలాంటి సమస్యలే ఉండవు.

 

 

కార్తిక్

 

(photo courtesy : Eenadu)

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telangana  kiss of live  moral policing  latest news  

Other Articles