Vimbas navrachana venus washing machine for rs 1500

Vimbas Navrachna's Venus washing machine, cheap washing machine, washing machine for 1500, small washing machine for 2000, washing machine rates price in inidia, washing machine technology, washing machine latest news, latest gadgets, latest news

Vimbas Navrachna's Venus washing machine for rs 1500 : Mumbai-based Indian startup Vimbas Navrachna's Venus is attempting to make a small washing machine to middle class and poor families for cheaper rates by rs 1500 and the product will available by 2015 second qaurter

భలే కదా : రూ.1500కే వాషింగ్ మెషీన్

Posted: 11/01/2014 11:25 PM IST
Vimbas navrachana venus washing machine for rs 1500

ఇప్పుడు ప్రతి ఇంట్లో తప్పకుండా ఉండాల్సిన గృహోపకరణాల్లో వాషింగ్ మెషిన్ ఒకటి. సమయం లేక, ఉతకటం చేతకాక ఇలా వివిధ కారణాలతో చాలామంది వాషింగ్ మెషీన్లు కొనుక్కుంటున్నారు. అయితే ఇప్పటికీ వాషింగ్ మెషీన్ లేని కుటుంబాలు చాలానే ఉన్నాయి. మీ ఇంట్లో కూడా వాషింగ్ మెషీన్ లేదా.. ఉన్నా మరొకటి తీసుకోవాలి అనుకుంటున్నారా, అయితే ఈ వార్త మీకోసమే. వాషింగ్ మెషీన్ ధర కేవలం రూ. 1500 మాత్రమే. అదేంటి 15వేలు ఉంటే ఇలా చెప్తున్నారు అనుకుంటున్నారా..? ఎక్కడా లెక్క తప్పలేదు సున్నా పెట్టడం కూడా మర్చిపోలేదు. మీరు చదివేది నిజమే.

ముంబైకి చెందిన వింబస్ నవ్ కంపనీ కేవలం రూ.1500కే మిని వాషింగ్ మెషీన్ అందిస్తోంది. తక్కువ ఆదాయం వచ్చే కుటుంబాలను దృష్టిలో ఉంచుకుని ఈ మెషీన్ తయారు చేశారు. ఇది గృహిణులు, పెద్దవారితో పాటు రూంలలో ఉండే బ్యాచిలర్స్ కు కూడా బాగా ఉపయోగపడుతుందని కంపనీ వ్యవస్థాపకుడు పియూష్ అగర్వాల్ చెప్తున్నారు. వీనస్ అనే పేరుతో తయారు చేసిన ఈ మినీ వాషింగ్ మెషీన్ కరెంటుతో (ఏసీ, డీసీ - 12 వోల్టు బ్యాటరీ) పని చేస్తుంది. మనం ఉతకాల్సిన బట్టలను ఒక బకెట్ లో వేసి అందులో ఈ మెషన్ పెట్టేస్తే సరి ఎంచక్కా... మురికి వదలగొట్టేస్తుంది.

 

 

ఎంతో సులువు మరియు ధర కూడా తక్కువ వెంటనే కొనేద్దాం అనుకుంటున్నారా అయితే మరో ఆరు నెలలు ఆగాల్సిందే. ఎందుకంటే ఈ మెషీన్ 2015 రెండవ త్రైమాసికంలో పూర్తిస్థాయి విక్రయాలు జరుపుతామని పియూష్ చెప్తున్నారు. ముందుగా ఉత్పత్తి చేసిన 100 మెషీన్లు రూ. 2500కు విక్రయించగా.., 2015లో మాత్రం రూ.1500కే విక్రయిస్తామని చెప్తున్నారు. అంటే మరో ఆరు నెలలు ఆగితే మనకు చాకిరీ కష్టాలు తీరతాయన్న మాట.

 

 

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : washing machine  technology  gadgets  latest news  

Other Articles