Isis treats girls and women like cattle

isis terrorists cruelty, isis terrorists latest attacks, isis terrorists beheadings, isis terrorists on america, isis terrorists on india, isis terrorists in india, isis terrorists rapes girls, isis terrorists on woman and girls, latest news, gilrs sold by price tags

isis treats girls and women like cattle : isis terrorists commites physical and sexual violence on woman, including systematic rape and sex slavery. isis kepts woman and girsl markets in Mosul and in Raqqa, Syria, carrying price tags for selling.

నీచులు : అమ్మాయిల్ని రేటు బోర్డు పెట్టి అమ్మేస్తున్నారు

Posted: 10/31/2014 10:42 PM IST
Isis treats girls and women like cattle

ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల అరాచకాలు, అకృత్యాలు రోజుకు ఒకటి బయటకు వస్తున్నాయి. వీరి బంధీగా ఉన్న ఓ యువతి చెప్పిన సమాచారం ఉగ్రవాదుల దాష్టీకాలను వివరిస్తోంది. జనా అనే 19ఏళ్ళ యువతి దారుణాల గురించి వివరించింది. గతేడాది ఆగస్టులో ఈ అమ్మాయి గ్రామానికి వచ్చిన ఉగ్రవాదులు గ్రామంలోని ప్రజలందర్నీ బంధీలను చేశారు. అందులో ముందుగా ఆడవారు, మగవారిని వేరు చేశారు. మగవారిలో పది సంవత్సరాల కంటే వయస్సు ఎక్కువ ఉన్నవారిని వేరు చేసి వారందర్నీ ఓ చోటకు తీసుకెళ్ళి నిర్ధాక్షిణ్యంగా కాల్చిచంపారట. అంతకుముందుగా వారి వద్ద ఉన్న నగలు, డబ్బు అంతా దోచుకన్నారు.

వీరంతా యాజిది అనే వర్గానికి చెందిన వారు కావటంతో ప్రజలందర్ని బలవంతంగా ఉగ్రవాదులు తమమతంలోకి చేరాలని డిమాండ్ చేశారట. ఇక ఆడవారిలో కూడా వయస్సు పైబడిన, యువతులను వేరు చేసి యువతులందర్ని ఒక గదిలో బంధించారని జనా తెలిపింది. అలా ఓ మూడంతస్థుల భవనంలో తమలాంటి యువతులు చాలామంది వందల సంఖ్యలో ఉన్నారని వెల్లడించింది. రోజూ ఉగ్రవాదులు వచ్చి ముగ్గురు లేదా నలుగురు అమ్మాయిలను తీసుకుని వెళ్ళేవారట. వారిపై లైంగికంగా దాడి చేయటంతో పాటు క్రూరమృగాల మాదిరిగా చిత్ర హింసలకు గురిచేసేవారు అని కఠోర నిజాలను వెల్లడించింది. అంతేకాకుండా వీరిని లైంగిక బానిసలుగా, పశువులుగా పరిగణిస్తూ అవసరం తీరిపోయాక మెడలో రేటు బోర్డులు పెట్టి మరీ మోసుల్, రఖ్కా, సిరియాలోని వివిధ బహిరంగ ప్రదేశాల్లో అమ్మేస్తుంటారని తెలిపింది.

ఈ దారుణాలు నిజమే అని ఐక్యరాజ్యసమితి దృవీకరించింది. ఇస్లామిక్ తీవ్రవాదుల ఆగడాలపై ఐరాస సహా ఇతర సంస్థల ప్రతినిధులు తయారుచేసిన నివేదికలు, జరిపిన సర్వేలు తాజా ఘోరాలను వెల్లడిస్తున్నాయి. యాజిదిలు సహా ఇతర వర్గాల ప్రజలను ఇస్లామిక్ స్టేట్ బానిసలుగా పరిగణిస్తోంది. వీరిని హింసించటాన్ని కూడా ఉగ్రవాదులు సమర్ధించుకుంటున్నారు. ఇరాక్, సిరియా దేశాల్లో సమాంతర ప్రభుత్వాలను నడుపుతున్న వీరు మిగతా దేశాల్లో కూడా కార్యకలాపాలను విస్తరించేందుకు కుట్రలు చేస్తుండటం ఆందోళనకర అంశం. ఇంకా చెప్పాలంటే వీరి కన్ను భారత్ పై కూడా ఉంది. కొన్ని నెలల క్రితం జమ్మూలో ఇస్లామిక్ స్టేట్ జెండాలు కన్పించటంతో పాటు, హైదరాబాద్, ఇతర ప్రాంతాలకు చెందిన యువకులు ఉగ్రవాదంలో చేరేందుకు ప్రయత్నించి పట్టుబడటం మరింత భయాందోళనలు కల్గించే విషయం.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : isis  girls  rapes  latest news  

Other Articles