Sachin tendulkar to isit pr kandriga on november 16th lay foundation stones to development works

sachin tendulkar, Nellore, November 16, adopt, chennai, Rajyasabha, MP. Foundation, development works, district collector, Rekharani, andrapradesh

sachin Tendulkar to isit PR Kandriga on november 16th, lay Foundation stones to development works

నెల్లూర్ పీఆర్ కండ్రిగకు నవంబర్ 16న సచిన్ రాక..

Posted: 10/31/2014 02:47 PM IST
Sachin tendulkar to isit pr kandriga on november 16th lay foundation stones to development works

క్రికెట్ దిగ్గజం, రాజ్యసభ సభ్యుడు సచిన్ టెండూల్కర్.. తాను దత్తత తీసుకున్న నెల్లూరు జిల్లా పుట్టంరాజు కండ్రిగకు నవంబర్ 16న రానున్నారు. ఈ మేరకు ఆయన పర్యటన ఖరారైంది. నవంబరు 16న గూడూరు మండలం పుట్టంరాజు కండ్రిగ గ్రామంలో ఏర్పాటుచేసే అధికారిక అభివృద్ది కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. క్రికెట్ నుంచి వైదొలిగి నవంబరు 16 నాటికి ఏడాది పూర్తికానున్న సందర్భంగా ప్రజాసేవకుడిగా ఆయన ఆదే రోజున అభివృద్ది కార్యక్రమాలకు పూనుకున్నారు.

నవంబర్ 15న సచిన్ ముంబయిలో బయలుదేరి అర్ధరాత్రి చెన్నైకి చేరుకుంటారు. అక్కడ బస చేసి 16న ఉదయం పుట్టంరాజు కండ్రిగ గ్రామానికి చేరుకుంటారు. రాజ్యసభ సభ్యుడి హోదాలో ఆ గ్రామాన్ని దత్తత తీసుకుని వివిధ పథకాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ గ్రామాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో ఆదర్శంగా రూపుదిద్దుతానని ఆయన ప్రధాని మోడీని కలిసిన సందర్భంగా  చెప్పారు.

అయితే రాజ్యసభ సభ్యుడు సచిన్ మంజూరు చేసిన నిధులతో జిల్లా కలెక్టర్ రేఖారాణి ఇప్పటికే పనులు ప్రారంభించారు. రోడ్లు, భూగర్భ మురుగునీటి వ్యవస్థ, వీధి దీపాలు, మంచినీటి వ్యవస్థ, వార్షపు నీరు నిలువ, పారిశుద్ధ్య పనులు చేస్తున్నారు. సచిన్ అందించే నిధులతో అదనపు సౌకర్యాలు కల్పించేందుకు ప్రణాళికలు రూపొందించామని జాయింట్ కలెక్టర్ రేఖారాణి తెలిపారు. కాగా, సచిన్ తమ గ్రామాన్ని దత్తత తీసుకోవడమే కాకుండా తమ గ్రామానికి వస్తున్నారని గ్రామస్థులు కూడా ఆయన ఘనస్వాగతానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles