Narendra modi refused to meet dmk mp kanimozhi and team

DMK, 2G Scam, Kanimozhi, Prime Minister Narendra Modi, Dmk leaders Team, karunanidhi

narendra modi refused to meet dmk mp kanimozhi and Team

కనిమొళి సహా డీఎంకే నేతలకు ప్రధాని షాక్..!

Posted: 10/30/2014 12:56 PM IST
Narendra modi refused to meet dmk mp kanimozhi and team

దేశ రాజకీయాల్లో ప్రభావశీల శక్తిగా దూసుకుపోతున్న ప్రధాని నరేంద్ర మోదీకి చేరవయ్యేందుకు డీఎంకే చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ప్రధాని అపాయింట్ మెంట్ కోరిన డీఎంకే అధినేత కరుణానిధి తనయ, రాజ్యసభ సభ్యురాలు కనిమొళి బృందానికి దేశ రాజధాని హస్తినలో పరాభవం ఎదురైంది. కనిమొళి నేతృత్వంలోని బృందాన్ని కలుసుకునేందుకు ప్రధాని మోడీ నిరాకరించారు. దీంతో షాక్ తిన్న కనిమొళి బృందం చేసేది లేక చెన్నైకి చేరుకున్నారు. ఎంపీలను కలుసుకుని వారికి కావాల్సిన సహాయ సహకారాలను అందించేందుకు ముందంజలో వున్న మోడీ కనిమొళి బృందాన్ని కలవడానికి ఎందుకు నిరాకరించారు.?

టెలికాం రంగంలో వచ్చిన సాంకేతిక విప్లవం 2జీని ఇష్టానుసారం కేటియింపులు జరిపి.. అక్రమంగా లక్షల కోట్ల రూపాయలను ఆర్జించిన కుంభకోణంలో నిందితులుగా వున్నందునే వారిని ప్రధాని కలుసుకోలేదా..? అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఈ కేసులో కేంద్ర మాజీ మంత్రి రాజా ప్రధాన సూత్రధారి కాగా, కనిమొళి పాత్రధారిగా సీబీఐ కేసులు పెట్టింది. అంతేగాక 2 జీ స్పెక్ట్రంకు చెందిన నిధులు అక్రమ మార్గంలో కలైంజర్ టీవీ చానల్‌కి చేరాయని ఆరోపిస్తున్న సీబీఐ ఆ చానల్ డెరైక్టర్‌గా వ్యవహరిస్తున్న కరుణ సతీమణి దయాళు అమ్మాళ్‌ను కూడా కేసులో చేర్చింది. కరుణ సోదరి కుమారుడైన మరో మాజీ కేంద్ర మంత్రి దయానిధి మారన్‌పై కూడా సీబీఐ కేసులు ఉన్నాయి. పదేళ్ల యూపీఏ పాలనలో కేంద్ర కేబినెట్ మంత్రులుగా ఉంటూ కోట్లాది రూపాయల కుంభకోణాలకు పాల్పడినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న వీరంతా కరుణ కుటుంబీకులు కావడంతో పాటు డీఎంకే నేతలు కూడా కావడం గమనార్హం. అసలు ప్రధానిని డీఎంకే నేతలు ఎందుక కలవాలనుకుంటున్నారు..?

ప్రకృతి విలయానికి సుందర కాశ్మీరం అల్లకల్లోలం కాగా అక్కడి సహాయక చర్యల కోసం భూరి విరాళాలు అందజేయాలని ప్రధాని మోదీ ఇటీవల దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. జాతీయ రాజకీయాలను ఒక్కసారిగా తమవైపు తిప్పుకునేందుకు ఇదే మంచి తరుణంగా కరుణ భావించారు. అంతేగాక కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి చేరువ కావడం ద్వారా అన్నాడీఎంకేకు చెక్‌పెట్టాలని ఎత్తువేశారు. ప్రధాని ఇచ్చిన పిలుపునకు స్పందించి కాశ్మీర్ వరద బాధితుల సహాయార్థం రూ.25 లక్షల విరాళాన్ని సెప్టెంబర్ 13న కరుణ ప్రకటించారు. విరాళ చెక్కును కనిమొళి నేతృత్వంలోని డీఎంకే ఎంపీల బృందం స్వయంగా ప్రధానికి అందజేస్తుందని స్పష్టం చేశారు. ఆ తరువాత కనిమొళి నేతృత్వంలో డిఎంకే ప్రతినిధుల బృందం ఢిల్లీకి చేరుకుని, చెక్ అందించేందుకు ప్రధాని కార్యాలయంలో అపాయింట్‌మెంట్‌కు విజ్ఞప్తి చేసుకున్నారు. దాదాపు నెలరోజులు గడుస్తున్నా ఇంత వరకు పీఎంవో నుంచి పిలుపురాలేదు. అనేక సార్లు చేసిన యత్నాలు విఫలం కావడంతో విసుగుచెందిన డీఎంకే నేతలు తిరిగి చెన్నైకి చేరుకున్నారు.
 
అక్రమార్కులకు మోదీ దూరం

 ఈ వ్యవహారంపై ఢిల్లీకి చెందిన బీజేపీ సీనియర్ నేత ఒకరు మాట్లాడుతూ, వివిధ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న సొంత పార్టీ (బీజేపీ) నేతలనే మోదీ దూరం పెట్టారని, ఇటువంటి పరిస్థితిల్లో 2 జీ స్పెక్ట్రం కుంభకోణంలో కూరుకుపోయిన కనిమొళిని ఆయన ఎలా కలుసుకుంటారని వ్యాఖ్యానించారు. కాశ్మీర్ బాధితుల సహాయార్థం చెక్కును అందజేసే సందర్భంగా మోదీ, కనిమొళి కలిసినా జాతీయస్థాయిలో వివాదాస్పద చర్చకు తావిచ్చినట్లు అవుతుందని ఆయన అన్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : DMK  2G Scam  Kanimozhi  Prime Minister Narendra Modi  Dmk leaders Team  karunanidhi  

Other Articles