As cyclone nilofar nears gujarat evacuates thousands of coastal area people

Cyclone, Nilofar, Gujarat, Evacuates, coastal people, 31 st, saturday, very severe cyclonic storm, Arabian Sea, 220 kilometres, Indian Meteorological Department, marginal cyclone, Kutch district.

As Cyclone Nilofar Nears, Gujarat Evacuates Thousands of coastal area people

కచ్ వద్ద తీరం దాటగానే శాంతించనున్న ‘నీలోఫర్’..

Posted: 10/30/2014 10:46 AM IST
As cyclone nilofar nears gujarat evacuates thousands of coastal area people

ఇటీవల విశాఖ సహా ఉత్తరకోస్తా తీరంలో పెనుబీభత్సాన్ని సృష్టించిన హుద్ హుద్ తుపాను విలయతాండవాన్ని మరువక ముందే భారతావనిని మరోమారు కాకావికళం చేయడానికి మరో తుపాను పొంచి వుంది. అరేబియా సముద్రాన్ని కేంద్రంగా చేసుకుని ఆవిర్భవించిన నీలోఫర్ తుపాను ఈనెల 31వ తేదీ రాత్రి గుజరాత్లోని కచ్ జిల్లాలో తీరాన్ని దాటనుందని భారత వాతావరణ శాఖ అధికారులు భావిస్తున్నారు. అయితే ఇంతకు ముందుగా వూహించినట్లు ఇది పెను తుపాను కాదని, వేగాన్ని తగ్గించుకుంటూ శాంతిస్తూ ముందుకు కదులుతుందని అధికారులు చెబుతున్నారు.

ఈ నెల 31న కచ్ వద్ద నీలోఫర్ తీరాన్ని దాటనుందన్న హెచ్చరికలతో గుజరాత్ అధికారులు వేలాది మంది కోస్తా తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కచ్ వద్ద తుపాను తీరం దాటే సమయానికి దాని తీవ్రత అంతగా వుండదని అధికరాలు చెబతున్నా.. ప్రజల ప్రాణాలను పనంగా పెట్టే సహాసానికి ఒడిగట్టలేమని గుజరాత్ అధికారులు చెబుతున్నారు. తీరం దాటే సమయానికి పెను తుపాను కాస్తా తుపానుగా మారుతుందని, తీరం దాటగానే అది పూర్తిగా శాంతిస్తుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ముందు ఊహించినట్టుగా ఇది గంటకు 220 కిలోమీటర్ల వేగంతో కూడిన గాలులతో రాదని, కేవలం 60 నుంచ 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు చెబుతున్నారు.

కచ్ జిల్లాలోని 30 వేల మంది కోస్తా తీర ప్రజలను అధికారులు ఇప్పటికే సురక్షిత ప్రాంతాలు తరలించారు. కచ్ తో పాటు సౌరాష్ట్ర జిల్లాలోని తీర ప్రాంతవాసులను కూడా అప్రమత్తంగా వుండాలని అధికారులు సూచించారు.  నీలోఫర్ కారణంగా ఈ రెండు జిల్లాల్లో కుండపోత వర్షం కురుస్తుందని తెలిపారు. కచ్‌లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయి. నిలోఫర్ ప్రభావం వల్ల రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో కూడా వర్షాలు కురుస్తాయి. తీర ప్రాంతాలైన వెరావల్, సోమనాథ్, పోర్‌బందర్, ఒఖా, ద్వారా, జామ్‌నగర్‌లపై నిలోఫర్ ప్రభావం ఉంటుంది. సముద్రం అల్లకల్లోలంగా మారుతుందని హెచ్చరించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో జాతీయ విప్తత్తు నిరోధక దళం బృందాలను రంగంలోకి దిగాయని అధికారులు తెలిపారు.

ఉతృతంగా వస్తున్న నీలోఫర్ తుపాను ఎంత నష్టాన్ని కలగజేస్తుందని తాము అందోళనలో వున్నామని, అయితే ఊహించనంత వేగంగా రావడం లేదన్న వార్తలు తమకు ఉపశమనాన్ని ఇస్తున్నాయని గుజరాత్ ముఖ్యమంత్రి అనందిబెన్ అన్నారు. తుపాను వేగం పూర్తిగా తగ్గాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నామని అమె అన్నారు. విపత్తు సృష్టించేందుక వస్తున్న తుఫానుపై ఆమె సమీక్షలు నిర్వహించారు. తుపాను ప్రభావిత తీర ప్రాంత వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించానలి ఆనందిబెన్ ఆదేశించారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles