Congress workers demand priyanka join active politics

Priyanka Gandhi, AICC office, Congress workers

congress workers demand priyanka join active politics

ప్రియాంక రావాలి.. కాంగ్రెస్ ను రక్షించాలి..!

Posted: 10/19/2014 04:24 PM IST
Congress workers demand priyanka join active politics

మహారాష్ట్ర, హర్యానా శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని ఫలితాల సరళి వెల్లడిచేయడంతో పార్టీ కార్యకర్తల్లో ఆందోళన మొదలయింది. పార్టీని ముందుకు నడిపే నేత కోసం వారు డిమాండ్ చేస్తున్నారు. ఇక పార్టీకి ప్రియాంక గాంధీయే శరణ్యమని వారు భావిస్తున్నారు. ఆమె పార్టీ పగ్గాలు చేపట్టాల్సిందేనని నినదిస్తున్నారు.

ఏఐసీసీ కార్యాలయం వద్ద ఆదివారం పెద్ద సంఖ్యలో చేరిన కాంగ్రెస్ కార్యకర్తలు ప్రియాంక గాంధీ క్రియాశీలక రాజకీయాల్లోకి రావాలంటూ ఆందోళనకు దిగారు. ప్రియాంక లావో కాంగ్రెస్ బచావో (ప్రియాంకను తీసుకురండి; కాంగ్రెస్ ను కాపాడండి) అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. అయితే ప్రియాంక గాంధీని రాజకీయాల్లోకి రావాలని కోరడం ఇదే మొదటిసారి కాదు. ఇప్పుడే తనకు క్రియాశీల రాజకీయాల్లోకి  వచ్చే ఉద్దేశం లేదని ఇంతకుముందు ప్రియాంక స్పష్టం చేశారు.

కాగా హర్యానా, మహారాష్ట్రలలో కాంగ్రెస్ ఓటమిపై మరోమారు కాంగ్రెస్ నేతలు అధిష్టానానికి వ్యతిరేకంగా గళం విప్పారు. ఈ ధఫా కాంగ్రెస్ పార్టీ గోవా అధికార ప్రతినిధి దుర్గాదాస్ కామత్ అధిష్టానాన్ని దెప్పిపొడిచారు. కాంగ్రెస్ లో వారసత్వ రాజకీయాలకు చరమగీతం పాడాలని అప్పుడే కాంగ్రెస్ బతికి బట్టకడుతుందని పరోక్షంగా అధినేత్ర  సోనియాగాంధీ, యువనేత రాహుల్ ను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యాలు చేశారు. ఇకనైనా వారసత్వ రాజకీయాలకు చరమగీతం పాడాలన్నారు. జాతీయస్థాయితో పాటు రాష్ట్రాలలోనూ వారసత్వ రాజకీయాలకు ముగింపు పలకాలని ఆయన కోరారు.. కాంగ్రెస్లోకి యువ రక్తాన్ని నింపాలని, ఏ రాజకీయ అండదండలు లేని యువతను పార్టీలోకి చేర్చుకుని పార్టీని ప్రక్షాలన చేయాలన్నారు.
 
జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Priyanka Gandhi  AICC office  Congress workers  

Other Articles