Who will sworn in as maharastra chief minister

Maharastra, BJP, Narendra Modi, modi mania, Devendra Fadnavis

who will sworn in as maharastra chief minister..?

మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠంపై ఎవరు..?

Posted: 10/19/2014 02:39 PM IST
Who will sworn in as maharastra chief minister

మహారాష్ట్రలో బీజేపీ తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ తరుణంలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరి పెడితే మంచిదన్న అలోచనలో బీజేపి కేంద్ర కార్యవర్గం నిమగ్నమైంది. మహారాష్ట్ర ముఖమంత్రిగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ పేరు తెరపైకి వచ్చినా.. ఆయనే స్వయంగా తాను సీఎం రేసులో లేనని ప్రకటించారు. తను రాష్ట్ర రాజకీయాలకు వెళ్లబోనని  కూడా వెల్లడించారు. దీంతో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరిని నిలుపుదామనేదే.. బీజేపీ పార్టీ ముందున్న పెద్ద ప్రశ్న.

అయితే ఇదే సమయంలో బీజేపీ మహారాష్ట్ర నేతల నుంచి కూడా పెద్ద ఎత్తున్న విన్నాపాలు వస్తున్నాయి. తమకు ఓ సారి సీఎం పదవిని ఇవ్వాలని కొన్ని, తమకు క్యాబినెట్ లో మంత్రి పదవిని ఇవ్వాలని మరికొన్ని విన్నపాటు బీజేపి కార్యాలయానికి చేరుతున్నాయి. మరోవైపు తమకు తెలిసిన జాతీయ నేతలతో మంత్రాంగం నడిపించి ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకునేందుకు స్థానిక నేతలు చకచకా పనులు చేపట్టారు. ఈ తరుణంలో బీజేపి మహారాష్ట్ర శాఖ అధ్యక్షడు దేవేంద్ర ఫడ్నవీన్ పేరు కూడా బీజేపి హైకమాండ్ పరిశీలిస్తోందని వార్తలు అందుతున్నాయి.

సుమారుగా రెండున్నర దశాబ్దాల తరువాత పార్టీ ఒంటరిగా పోటీ చేసి అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవడంలో దేవేంద్ర ఫడ్నీవిస్ కూడా ముఖ్య భూమిక పోషించాడని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఈ ఎన్నికలలో నాగ్ పూర్ దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన, తన సమీప శివసేన అభ్యర్థిపై సుమారు 45 వేల మెజారిటీతో గెలుపొందారు. ఆయన విజయం సాధించడంతో పాటు బీజేపి అతిపెద్ద పార్టీగా అవతరించిందన్న విషయాన్ని తెలుసుకున్న ఆయన భార్య అమృత ఫెడ్నవిస్ కృషిని శ్లాఘించారు.

అంతేకాదు అమె ఏకంగా బీజేపి హైకమాండ్ కే తన కోరికను విన్నవించుకున్నారు. తన భర్త దేవేంద్ర ఫెడ్నవిస్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి తగిన వ్యక్తని, పార్టీ హైకమాండ్ ఈ విసయాన్ని పరిగణలోకి తీసుకున్న తరువాతే ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించాలని ఆమె కోరారు. అంతేకాదు.. తన భర్త పదవి కోసం పోటీపడడం లేదని, అధిస్టానం అప్పజెప్తే బాధ్యతగా స్వీకరిస్తారని అమె సన్నాయి నొక్కులు నొక్కారు. తన భర్త కేవలం అభివృద్దే ఎజెండా పనిచేస్తారని అమె కితాబిచ్చారు.

కాగా తొలిసారి బీజేపి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నా.. అది సంకీర్ణ ప్రభుత్వమే కావడంతో.. అనుభవజ్ఞుడైన నేతను ముఖ్యమంత్రి స్థానానికి ఎంపిక చేయాలని బీజేపి భావిస్తుందని సమాచారం. ఈ నేపథ్యంలో మహా ముఖ్యమంత్రి పీళం ఎవరిని వరించనుందో.. వేచి చూడాల్సిందే

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Maharastra  BJP  Narendra Modi  modi mania  Devendra Fadnavis  

Other Articles