Ap government clarification on students fee reimbursement

fees reimbursement issue, telangana students, andhra pradesh students, andhra pradesh government, ap government, chandrababu naidu, kcr, adhar card numbers, fees reimbursement, ap telangana students fees reimbursement

finally ap government clarification on students fee reimbursement

ఫీజు రీయింబర్స్ మెంట్ విషయంపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ!

Posted: 10/18/2014 09:55 PM IST
Ap government clarification on students fee reimbursement

ఫీజు రీయింబర్స్ మెంట్ విషయంపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ!

విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ విషయంపై గతంలో తెలంగాణ సర్కార్ విడుదల చేసిన స్థానికత ప్రకటనపై ఎంత దుమారం చెలరేగిందో అందరికీ తెలిసిందే! 1956కు ముందు తెలంగాణ రాష్ట్రంలో స్థిరపడిన వారినే స్థానికతగా గుర్తిస్తూ.. అటువంటి విద్యార్థులకే ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని అమలు చేస్తామని అప్పట్లో కేసీఆర్ ప్రకటించిన విషయం విదితమే! దీంతో ఈ విషయం ఏపీ రాష్ట్రంలో తీవ్ర సంచలనంగా మారింది. ఇదెలా సాధ్యమంటూ ఏపీ సర్కార్ ప్రశ్నించినప్పటికీ.. తెలంగాణ సర్కార్ నుంచి సమాధానం రాలేదు. దీంతో ఈ విషయమై కోర్టులో పిటిషన్ వేయగా... దీనిపై స్టే విధించింది.

ఇదిలావుండగా.. ఫీజు రీయింబర్స్ మెంట్ సమస్యను పరిష్కరించకపోతే విద్యార్థుల జీవితాలు గాడిలో పడుతాయని భావించిన ఏపీ సర్కార్.. ఈ విషయంలో తాజాగా విధివిధానాలను ఖరారు చేస్తూ ప్రకటన విడుదల చేసింది. వాటి వివరాలు ఇలా...
1. ఆర్టికల్ 371(డి) ప్రకారం విద్యార్థుల స్థానికతను నిర్ధారించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
2. వరుసగా నాలుగేళ్లపాటు ఎక్కడ చదివితే అక్కడి స్థానికతనే గుర్తిస్తారు. దీని ప్రకారం... ఆంధ్రలో స్థానికత ఉన్న తెలంగాణ విద్యార్థులకు, తెలంగాణలో స్థానికత ఉన్న ఆంధ్ర విద్యార్థులకు బోధనా రుసుమును చెల్లిస్తారు.
3. వార్షిక ఆదాయం రెండు లక్షల రూపాయలకంటే తక్కువగా వున్న బిసి, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.
4. విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఆధార్ నంబర్ తప్పని సరిగా ఉండాలి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles