Megapower star ram charan met 10 years old boy rahul who is suffering with brain tumor

ram charan tej, ram charan latest news, ram charan met brain tumor boy, ram charan tej pratyush foundation, samantha pratyush foundation, brain tumor boy rahul met ram charan, ram charan met rahul, ram charan pawan kalyan, pawan kalyan latest news, pawan kalyan met srija, pawan kalyan srija news

megapower star ram charan met 10 years old boy rahul who is suffering with brain tumor

మానవత్వంలో ‘‘మెగాఫ్యామిలీ’’కి సాటి ఎవరు..?

Posted: 10/18/2014 09:10 PM IST
Megapower star ram charan met 10 years old boy rahul who is suffering with brain tumor

చిరు - పవన్ ల మధ్య చీలికలు వున్నట్లుగానే వస్తున్న వార్తల విషయాలు ఎలావున్నా... మానవత్వంలో ‘‘మెగా ఫ్యామిలీ’’కి సాటి ఎవరు లేరని నిరూపించేసింది. వీరి వ్యక్తిగత వ్యవహారాలు, ఇతర సమస్యలు ఎలా వున్నా.. తాజాగా జరిగిన పరిణామాల నేపథ్యంలో ఈ కుటుంబం మంచి పేరే సాధించింది. నిన్న హుధుద్ ధాటికి చెదిరిపోయిన వైజాగ్ బాధితులకు ఈ కుటుంబం నుంచి ఒక్కొక్కొరుగా వీలైనంతవరకు విరాళాలు అందించారు. అందులో ముందుగా రామ్ చరణ్ 10 లక్షల విరాళమిచ్చి, అందరికీ ఆదర్శంగా నిలిచాడు. తర్వాత పవన్, చిరు, టాలీవుడ్ పరిశ్రమలో వున్న ఇతర తారలందరూ తమవంతుగా విరాళాలు ఇవ్వడం జరిగింది. ఇలా జరగడానికి రామ్ చరణే కారణమని చెప్పులేముగానీ.. మొదటగా విరాళమిచ్చి ఆదర్శంగా నిలిచాడని చెప్పుకోవడంలో ఎటువంటి సంశయం లేదు.

pawan-kalyan-met-srija

ఖమ్మం ఆసుపత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ‘‘శ్రీజ’’ అనే అమ్మాయి తనకు పవన్ ను చూడాలని వుందని చివరి కోరిక తెలిపిన నేపథ్యంలో... ఈ సమాచారాన్ని ‘‘మేక్-ఏ-విష్’’ ఫౌండేషన్ ద్వారా తెలుసుకున్న పవన్ ఎంతటి బిజీ షెడ్యూల్ వున్నా దానిని పక్కనపెట్టేసి, వెంటనే ఖమ్మంకు బయలుదేరి ఆ అమ్మాయిని కలుసుకుని, తన మంచి మనస్తత్వాన్ని - మానవత్వాన్ని చాటుకుని ‘‘ఔరా’’ అనిపించాడు. ఆ అమ్మాయికి ధైర్యం చెప్పి, తనవంతు ధనసహాయాన్ని అందించాడు. ఇప్పుడు అబ్బాయ్ రామ్ చరణ్ కూడా తన బాబాయ్ రూటులోనే వెళ్లి శభాష్ అనిపించుకున్నాడు.

గ్లామర్ డాల్ సమంత అండదండలతో హైదరాబాద్ లో నడపబడుతున్న ప్రత్యూష్ ఫౌండేషన్ గురించి అందరికీ తెలిసే వుంటుంది. ఈ సంస్థ ద్వారా సాయం పొందుతూ బ్రెయిన్ ట్యూమర్ ట్రీట్ మెంట్ చేయించుకుంటున్న రాహుల్ అనే పదేళ్ల బాలుడు.. తనకు రామ్ చరణ్ ను కలవాలనే కోరిక వున్నట్లు తెలిపాడు. ఆ సంస్థ ఈ సమాచారాన్ని చరణ్ కు అందించగా.. ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా వేగంగా అక్కడికి చేరుకున్నాడు. కుర్రాడు రాహుల్ క్షేమసమాచారాలు అడిగి, కాసేపు అతనితో సమయం కేటాయించాడు. బ్రెయిన్ ట్యూమర్ వ్యాధితో బాధపడుతున్న ఆ అబ్బాయిని ఆనందంలో ముంచెత్తి తన మానవత్వాన్ని చాటుకున్నాడు చరణ్!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles