Sachin tendulkar adopted nellore village puttamraju kandriga allots rs 3 5 crores from development

nation, current Affair, sachin Tendulkar, Crickter, Gudur, MP, Adopts, Narendra Modi, Nellore, Puttamraju Kandriga, Sachin, Sansad Adarsh Gram Yojana, Tendulkar

Sachin tendulkar adopted Nellore Village Puttamraju Kandriga, allots Rs 3.5 crores from development

నెల్లూరు పీఆర్ కండ్రిగకు అదృష్టం పట్టింది..

Posted: 10/18/2014 03:57 PM IST
Sachin tendulkar adopted nellore village puttamraju kandriga allots rs 3 5 crores from development

శంఖంలో పోస్తేనే తీర్థం అవుతుందని పెవ్దలు చెప్పిన మాట ఎన్నటికీ తప్పుకాదు. అది నెల్లూరు జిల్లాలోని గూడూరు పట్టణానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న పుట్టం రాజు వారి కండ్రిగ గ్రామం. ఆ గ్రామం పేరు నిన్న మొన్నటి వరకు చాలా తక్కువ మందికి తెలుసు. కానీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. క్రికెట్ దిగ్గజం, రాజ్యసభ సభ్యుడు సచిన్ టెండూల్కర్ ఆ గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు దత్తత తీసుకోవడమే దీనికి కారణం.

ఒక పంచాయతీలో ఆవాసంగా ఉన్న ఆ గ్రామాన్ని స్వర్ణ గ్రామంగా, సకల సౌకర్యాలతో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దబోతున్నారు సచిన్. గాంధీజీ కలలు కన్న పల్లెసీమగా, ప్రధాని నరేంద్ర మోదీ ఆశయానికి అనుగుణంగా మేక్ ఇన్ ఇండియాలో ఆ గ్రామం భాగం కాబోతోంది. పల్లెసీమ అంటే ఈ విధంగానే ఉండాలి అనేవిధంగా రూపుదిద్దేందుకు ప్రణాళికలు రూపొందాయి. దీనికి అవసరమైన నిధులు టెండూల్కర్ తన ఎంపీ కోటా నిధుల నుంచి మూడున్నర కోట్ల రూపాయలను అందించనున్నారు. మరికొన్ని సొంతగా సమకూర్చనున్నారు. ఈ అభివృద్ధి పనులను తిలకించేందుకు స్వయంగా సచిన్ టెండూల్కర్ ఆ గ్రామాన్ని సందర్శించనున్నారు. నవంబరు 16న రానున్నట్లు అధికారులకు సమాచారం అందింది.

అయితే సచిన్ పర్యటన ఇంకా ఖరారు కాలేదు. ఈ నేపథ్యంలో ఆ గ్రామాన్ని 'ఈనాడు-ఈటీవీ' బృందం శుక్రవారం పరిశీలించింది. సచిన్ టెండూల్కర్ తమ గ్రామాన్ని దత్తత తీసుకున్నారన్న సమాచారంతో గ్రామస్థులు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. కనీసం శాసనసభ్యులూ సందర్శించని తమ గ్రామానికి టెండూల్కర్ రాబోతున్నారన్న సమాచారంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదృష్టం పడితే.. ఎలా వుంటుందో మరికొన్ని సంవత్సరాల్లో ఈ గ్రామమే చూపుతుందని గ్రామస్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక తమ గ్రామ అవసరాల కోసం ఏ ప్రజాప్రతినిధి వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదని ధీమాతో వున్నారు. ఈ ప్రాంతం అభివృద్ది చెందాలి.. దాని ఫలాలను మరిన్ని పల్లెలకు అందించాలని మనమూ కోరుకుందాం.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles