Chandrababu asks help from tamilnadu

hudhud cyclone, hudhud cyclone meaning, hudhud cyclone latest updates, hudhud cyclone updates, hudhud cyclone losses, hudhud cyclone result, hudhud cyclone effected areas, hudhud cyclone in andhrapradesh, kcr, telangana, telangana government, chandrababu naidu, pannerselvam, tamilnadu, telangana help to andhrapradesh, national disaster, national disaster relief team, latest updates, andhrapradesh, andhrapradesh news, telugu latest updates, andhrapradesh government, cyclones

chandrababu naidu asked help from tamilnadu to survive from hud hud cyclone : chandrababu naidu asked pannerselvam to give helping hand but not asked telangana chief minister kcr to help to andhrapradesh state

పొరుగింటి పుల్లకూరకు బాబు ప్రాధాన్యం

Posted: 10/13/2014 08:35 AM IST
Chandrababu asks help from tamilnadu

రాష్ర్టాలుగా విడిపోదాం.. అన్నదమ్ముల్లా కలిసుందాం అన్న మాటలు కేవలం ప్రకటనలు., పేపర్లపైనే తప్ప చేతల్లో కాదు అని మరోసారి నిరూపితం అయింది. ఏపీలో ప్రస్తుతం హుద్ హుద్ విరుచుకుపడుతుంది. ఈ సమయంలో తన మన బేధాలు మరిచి సాయం కోసం ఎదురుచూడాలి తప్ప కోపాలకు పోతే మునిగేది మనమే. ఈ విషయం చెప్తోంది చంద్రబాబు గురించి. హుద్ హుద్ తుఫాను వల్ల నష్టపోయిన రాష్ర్టాన్ని ఆదుకోవాలని ఆయన తమిళనాడు ముఖ్యమంత్రిని కోరారు. సాయం కోసం పన్నీర్ సెల్వంకు ఫోన్ చేసినట్లు బాబు చెప్పారు.

విశాఖకు వెళ్తూ మార్గమద్యలో రాజమండ్రిలో మీడియాతో ఏపీ ముఖ్యమంత్రి మాట్లాడారు. విశాఖలో సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు అక్కడే ఉంటానన్నారు. నష్టాన్ని శాటిలైట్ పరిజ్ఞానంతో అంచనా వేస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా తుఫాను వల్ల నష్టపోయిన ప్రజలను ఆదుకుంటామన్నారు. ఈ మేరకు కేంద్రం నుంచి తమకు హామి లభించిందన్నారు. అయితే ఈ సందర్బంగా తమిళనాడు ముఖ్యమంత్రిని సాయం కోరినట్లు చెప్పిన చంద్రబాబు.., తెలంగాణ ముఖ్యమంత్రిని సాయం కోరినట్లు గాని.., ఆయన ఏదైనా చేస్తానని చెప్పినట్లుగాని మీడియాకు వెల్లడించలేదు.

పక్కన ఉన్న తెలుగు రాష్ర్టం కంటే తమిళనాడుకే చంద్రబాబు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు.., తెలంగాణ ముఖ్యమంత్రిని అడిగే కంటే తమిళసీఎం ను డబ్బులు పంపమనేందుకే చంద్రబాబు ఇష్టపడుతున్నారని విమర్శకులు అంటున్నారు. విపత్తుల సమయంలో బేషజాలకు పోవటం మంచిది కాదని చెప్తున్నారు. కాగా తుఫానుతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ ను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ర్ట ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ వచ్చిన కేసీఆర్.., ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్షాలపై సమీక్ష జరిపారు. ఈ సందర్బంగా.., ఏపీని ఆదుకుంటామని చెప్పారు. ఈ మేరకు ఏపీ సీఎస్ కు సమాచారం ఇవ్వాలని తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మను ఆదేశించారు. సీఎం ఆదేశాల ప్రకారం ఏపీ ప్రభుత్వానికి రాజీవ్ సమాచారం అందించారు.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : hud hud cyclone  kcr  chandrababu naidu  pannerselvam  

Other Articles