అంతా భయపడినట్లే జరుగుతోంది. హుద్ హుద్ తుఫాను భీభత్సం సృష్టిస్తోంది. గంటకు 150కి.మి. కంటే ఎక్కువ వేగంతో వీస్తున్న గాలులు విలయాన్ని తలపిస్తున్నాయి. ఈ దెబ్బకు విద్యుత్; సమాచార వ్యవస్థ అంతా కుప్పకూలింది. భారీ వర్షాలు పడుతున్నా.., తాగటానికి నీరు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కోస్తాంధ్రలో తుఫాను భీభత్సం సృష్టిస్తోంది. ఇక విశాఖలో అయితే పరిస్థితి భయంకరంగా ఉంది. సముద్రం అలలు చూడాలన్నా భయమేసేంతగా.., ఉగ్రరూపం దాల్చింది. తాజా ప్రకృతి దాడిలో ఆదివారం సాయంత్రం వరకు ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ర్టాల్లో ఆరుగురు మృతి చెందారు. పరిస్థితిపై అప్రమత్తమైన కేంద్రం విపత్తు నిర్వహణా బృందాలను రాష్ర్టానికి పంపింది. అటు రాష్ర్ట ప్రభుత్వ యంత్రాంగం ప్రస్తుతం విశాఖ కేంద్రంగా పనిచేస్తూ తుఫాను అదుపు చేసేందుకు చర్యలు చేపట్టింది.
ముందుగా అంతా ఊహించినదే జరుగుతోంది. హుద్ హుద్ తుఫాను ఆంధ్రప్రదేశ్ ను వణికిస్తోంది. ఏపీ మొత్తం తుఫాను ప్రభావంలో ఉండగా.., కొన్ని జిల్లాలపై తీవ్రమైన దాడి జరుగుతోంది. తుఫాను తీరం దాటక ముందు నుంచే ప్రకృతి ఆగ్రహరూపం మొదలయింది. ప్రళయాన్ని తలపించేలా తుఫాను విరుచుకుపడుతోంది. గంటకు గరిష్టంగా 150నంచి 200కి.మి వేగంతో గాలులు వీస్తుండటంతో విద్యుత్ స్తంభాలు తెగిపడుతున్నాయి. అటు సమాచార వ్యవస్థ కూడా తీవ్రంగా దెబ్బతిన్నది. చాలా చోట్ల పెద్ద పెద్ద చెట్లు విరిగిపడ్డాయి. దీంతో సామాన్యుడే కాదు.., మద్యతరగతి, ధనవంతులు కూడా తుఫాను ప్రభావంతో వణుకుతున్నారు. ముందస్తుగా అప్రమత్తమై అనేక బస్సులను రద్దు చేయగా.., పలు రైళు సర్వీసులు రద్దయ్యాయి. మరికొన్ని దారి మళ్ళించి నడుపుతున్నారు.
విశాఖ సహా ఉత్తరాంధ్ర జిల్లాల్లో తుఫాను ప్రభావం ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలతో పాటు.., భయంకరమైన ఈదురుగాలులతో నష్టం మరింత ఎక్కువగా ఉంది. అటు పొరుగున ఉన్న ఒడిశా రాష్ర్టంపై కూడా హుద్ హుద్ ప్రభావం చూపుతోంది. తీరం వెంబడి ఉన్న ప్రాంతాల్లో ఇప్పటికే భారీ వర్సాలు భీభత్సం సృష్టిస్తున్నాయి. ఇక మన రాష్ర్టంలోని కోస్తా ప్రాంతం తుఫాను వల్ల తీవ్రంగా నష్టపోతుంది. పంటలన్నీ నీట మునగటంతో పాటు.., ఇళ్ళలోని నీరు వచ్చి.., గ్రామాల మద్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచార వ్యవస్థ దెబ్బతినటంతో పాటు.., నీరు రోడ్లపైకి చేరటం వల్ల రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడింది. అటు తెలంగాణ రాష్ర్టంలోని ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కూడా హుద్ హుద్ తుఫాను వల్ల వర్షాలు మొదలయ్యాయి. దీంతో ఇక్కడి ప్రజలు కూడా ఏం జరుగుతుందో అనే భయంతో వణుకుతున్నారు.
తుఫాను భీభత్సంపై అప్రతమత్తమైన రాష్ర్ట ప్రభుత్వం అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూంలను ఏర్పాటు చేసింది. పరిస్థితిని ముఖ్యమంత్రి స్వయంగా సమీక్షిస్తున్నారు. తుఫాను ముగిసే వరకు విశాఖ కేంద్రంగా పనిచేస్తామన్నారు. ఇప్పటికే హుద్ హుద్ పై అప్రమత్తమై అన్ని ప్రభుత్వ శాఖలను అప్రమత్తం చేయటంతో పాటు.., సహాయక బృందాలను రంగంలోకి దించామని వెల్లడించారు. ఈ ప్రకృతి విలయాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్రాన్ని కోరామన్నారు. అటు తుఫానుపై ఏపీకి సాయం చేసేందుకు అన్ని విధాలా సహకరిస్తామని ప్రధాని నరేంద్రమోడి హామి ఇచ్చారు.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more