Cyclone hudhud hits andhra pradesh kills three

Cyclone Hudhud, Visakhapatnam, Bay of Bengal, Cyclone, Andhra Pradesh, odisha, army, ndrf, chandrababu

Cyclone Hudhud hits Odisha after Andhra Pradesh; kills three, causes extensive damage to Vizag

తీరం దాటిన హుదూద్.. ఉత్తరాంధ్ర.. అతలాకుతలం.

Posted: 10/12/2014 12:53 PM IST
Cyclone hudhud hits andhra pradesh kills three

గత నాలుగు రోజులుగా ఉత్తరాంద్రవాసులను భయాందోళనకు గురిచేసిన హుదుద్ తుపాను రానే వచ్చింది. ఉత్తరాంధ్రపై తన ప్రభావాన్ని చాటి.. అతలాకుతలం చేసింది. గత నాలుగు రోజుల నుంచి తీర ప్రాంత ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేసిన తుపాను విశాఖ కైలాసగిరి వద్ద తీరాన్ని తాకింది. అనంతరం మధ్యాహ్నానికి విశాఖ సమీపంలోని పూడిమడక వద్ద తీరాన్ని దాటింది. దీంతో తీరం వెంబడి గంటకు 180 నుంచి 200 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

అటు శ్రీకాకుళం జిల్లా లావేరు మండలంలో హుదుద్ తుపాను కారణంగా 180 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలులకు సుమారు 200 విద్యుత్ స్తంభాలు నేలమట్టమయ్యాయి. లావేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనంపై చెట్టు కూలడంతో భవనం బీటలు వారింది. ఈ ఘటనతో వైద్యసిబ్బంది భయాందోళనలతో పరుగులు తీశారు. మండల కేంద్రానికి వెళ్లే రహదారిలో చెట్లు కూలడంతో రాకపోకలు నిలిచిపోయాయి.

అయితే, పెను తుఫాను ఉద్దృతి తగ్గే వరకు ప్రజలు ఇళ్లలోంచి బయటకు రావొద్దని తీర గ్రామాల ప్రజలకు ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. హుదుద్ పెను తుపాను వేగంగా బలహీన పడుతోందని భారత వాతావరణశాఖ తెలిపింది. కొన్ని గంటల్లో తుపాను అల్పపీడనంగా మారే అవకాశముందని ఆ శాఖ అధికారులు వెల్లడించారు. గాలుల తీవ్రత కొన్ని గంటల్లో గణనీయంగా తగ్గుతుందని అధికారులు అంచనావేస్తున్నారు.

సహాయక శిబిరాల్లో లక్ష మంది

విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల్లో తుపాను ప్రభావం ఎక్కువగా ఉంది. ఈ నాలుగు జిల్లాలకు సంబంధించి దాదాపు లక్షమందిని 223 సహాయ శిబిరాలకు తరలించారు. 16వ నంబరు జాతీయరహదారిపై చెట్లు కూలడంతో రాకపోకలు నిలిపివేశారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి.


Simple Picture Slideshow:
Could not find folder /home/teluguwi/public_html/images/slideshows/hudhud

పెను తుపాను ధాటికి ముగ్గురు మృతి

పెను తుపాను.. ఉత్తరాంద్రలో విధ్వంసం సృష్టించింది.. తుపాను ప్రభావం ధాటికి ముగ్గురు మృత్యువాత పడ్డారు. హుదూద్ పెనుతుపాణు ప్రభావంతో విశాఖ జిల్లాలో ఇద్దరు మృతిచెందగా శ్రీకాకుళం జిల్లాలో చెట్లు కూలి మరో వ్యక్తి మృతి చెందాడని అధికారులు తెలిపారు.. ప్రళయ భయంకరంగా వస్తున్న హుదుద్ తుపాను ప్రభావంతో విశాఖ జిల్లాలో ఇద్దరు మృతి చెందారు. బహిర్భూమికి వెళ్లిన ఓ వ్యక్తిపై తాడి చెట్టు పడటంతో తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. ఇంటి పైకప్పు కూలి మరొకరు మృతి చెందినట్లు సమాచారం. పెను గాలులతోపాటు భారీ వర్షం పడుతుండటంతో విశాఖలో జనజీవనం స్తంభించింది. రహదారులపై చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో విద్యుత్, రవాణా వ్యవస్థలు పూర్తిగా స్తంభించాయి. ప్రజలు నిత్యావసరాల కోసం బయటకు వెళ్లేందుకు కూడా అవకాశం లేకుండా పోయింది. ముందు జాగ్రత్త చర్యగా.. ప్రజలు ఇళ్లల్లోంచి బయటకు రావొద్దని అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేశారు.

వేగంగానే శాంతిస్తున్న హుదూద్: ఐఎండీ అధికారులు

మరో 6 గంటల్లో హుదుద్ పెను తుపాను తీవ్ర తగ్గుతుందని భారత వాతావరణశాఖ తెలిపింది. గాలుల తీవ్రత కూడా క్రమేపి తగ్గుతుందని అధికారులు వెల్లడించారు. విశాఖలో పరిస్థితి తీవ్రంగా ఉందని వాతావరణశాఖ పేర్కొంది. రేపట్నుంచి విశాఖలో విమాన సేవలకు ఇబ్బంది లేదని, ఈనెల 15 వరకు భారీ వర్షాలు కొనసాగుతాయని వాతావరణశాఖ తెలిపింది. జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, బెంగాల్, మధ్యప్రదేశ్, తూర్పు యూపీలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు అంచనావేస్తున్నారు.

సమర్థవంతంగా ఎదుర్కొగలిగాం: సీఎం చంద్రబాబు

అధికార యంత్రాంగం పూర్తి అప్రమత్తతో వ్యవహరించడం వల్ల హుదుద్ తుపాను బారి నుంచి ఆస్తి, ప్రాణ నష్టాన్ని నివారించగలిగామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. హుదుద్ తుపానుపై సచివాలయంలో అధికారులతో సమీక్ష అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. తుపాను తీరం దాటేందుకు మరి కొన్ని గంటలు సమయం పడుతోందని, మరో 3, 4 గంటల వరకు వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. విశాఖ, శ్రీకాకుళం జిల్లాలో చెట్లు కూలి ముగ్గురు మృతిచెందినట్లు వెల్లడించారు. వరి పొలాలు బాగా దెబ్బతిన్నాయని వివరించారు. తుఫాను ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలలో భారీ వర్షాలు వీస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా వుండాలని ఆయన కోరారు.

తుపాను సహాయక చర్యల కోసం ప్రభుత్వ ఒక మొబైల్ యాప్ తయారు చేసిందని, తుపాను బాధిత ప్రాంతాల్లోని ప్రజలు మొబైల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని సమాచార మందించాలని కోరారు. టెక్నాలజీని పూర్తిస్థాయిలో వినియోగించుకుంటున్నామని, ప్రజల నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా సహాయక చర్యలను వేగవంతం చేయనున్నట్లు చెప్పారు. టెలిఫోన్ ఆపరేటర్లందరితో మాట్లాడమని, సాధ్యమైనంత తర్వగా మొబైల్ సేవలను పునరుద్ధరిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Cyclone Hudhud  Visakhapatnam  Bay of Bengal  Cyclone  Andhra Pradesh  odisha  army  ndrf  chandrababu  

Other Articles