Ap cm chandrababu reviewing on horifying hudhud cyclone

Cyclone Hudhud, Visakhapatnam, Bay of Bengal, Cyclone, Andhra Pradesh, Chief Minister, chandrababu

AP cm chandrababu reviewing on Horrifying hud hud cyclone

తుఫాను పరిస్థితిపై చంద్రబాబు నిరంతర సమీక్ష

Posted: 10/12/2014 12:31 PM IST
Ap cm chandrababu reviewing on horifying hudhud cyclone


భయంకర ప్రళయాన్ని  సృషించేందుకు ప్రచండ వేగంతో హుదుద్ తుపాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖ వద్ద తీరం దాటనున్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఇందుకోసం సచివాలయంలో మానిటరింగ్ సెల్‌ను ఏర్పాటు చేశారు. ఉదయమే సచివాలయానికి వచ్చిన చంద్రబాబు ఉన్నతాధికారులతో సమావేశమై పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. 4జిల్లాల్లో తుపాను తీవ్రత ఎక్కువగా ఉంటుందని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు.

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లోని 44 మండలాల్లో 320 గ్రామాలు తుపాను ప్రభావానికి గురయ్యే ప్రమాదం ఉందని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఈ నాలుగు జిల్లాలకు సంబంధించి 90, 013 మందిని 223 సహాయ శిబిరాలకు తరలించినట్లు చెప్పారు. ఇప్పటికే 6 హెలికాప్టర్లతో నిరంతర పర్యవేక్షణ చేయడంతో పాటు 155 వైద్య బృందాలు, 56 పడవలు, 19 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ప్రభుత్వం అందుబాటులో ఉంచింది.

నాలుగు జిల్లాల్లోనూ విద్యుత్ సరఫరా నిలిపివేశారు. రాత్రి వరకు ప్రజలు బయటకు రావొద్దని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శ్రీకాకుళంలో రేపు కూడా విద్యుత్ సంస్థలకు సెలవు ప్రకటించారు. తుపాను తీవ్రత తగ్గిన వెంటనే యుద్ద ప్రాతిపదికన విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడంతో పాటు దెబ్బతిన్న వ్యవస్థలన్నింటిని అందుబాటులోకి తీసుకొస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రాణనష్టం లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Cyclone Hudhud  Visakhapatnam  Bay of Bengal  Cyclone  Andhra Pradesh  Chief Minister  chandrababu  

Other Articles