Story on heavy rains and cyclones

rains, rains in india, rain affected in india, floods, jammu kashmir, jammu kashmir floods, latest news, uttarakhand, uttarakhand floods, flood victimes, natural disasters, indian defence, national news, flood relief, forests, indian forests, global warming, hudud

in india recent times heavy rains and cyclones are attacking there is some human made mistakes for these : with human activities only heavy rains and non timed rains draughts are effecting in india

ప్రకృతికి ఏమవుతోంది..?

Posted: 10/09/2014 06:59 PM IST
Story on heavy rains and cyclones

ఒకప్పుడు కరువు- కాటకాలు విలయ తాండవం చేశాయి అనే మాటలు అంతా విన్నాము.., పుస్తకాల్లో చదవుకున్నాము కూడా. ఇప్పుడు కూడ కరువు కాటకాలు ఉన్నాయి. వీటికి తోడు అతివృష్టి,. అకాల వర్షాలు కూడా దేశంపై విరుచుకుపడుతున్నాయి. అన్ని కలగలిపి మానవాళికి పెను సవాల్ విసరుతున్నాయి. దేశంలో ప్రతి సంవత్సరం ఏదో ఒక ప్రకృతి ఉపద్రవం వచ్చి పడుతుంది. ప్రజలను బలితీసుకోవటమే కాకుండా పెద్దఎత్తున ఆస్తుల నష్టం సంభవిస్తుంది. ఇందులో ముఖ్యంగా పంటలు ఎక్కువగా నష్టపోతున్నాయి. ఈ మద్య పంట పండక ఉత్పత్తి తగ్గటం కంటే.., ప్రకృతి భీభత్సం వల్లే ఎక్కువగా నష్టం జరుగుతుంది. నిన్న ఉత్తరాఖండ్.., నేడు జమ్మూకాశ్మీర్ రేపు మరొకటి ఇలా ఎందుకు జరుగుతుంది. ప్రకృతి దాడిని అడ్డుకునే మార్గాలేమిటో ఇప్పుడు చూద్దాం.

దీనికి అనేక కారణాలు ఉన్నాయి. అయితే ఇవన్నీ మానవ తప్పిదాలే అని ఖచ్చితంగా చెప్పగలము. తమ స్వార్ధం కోసం మనుషులు చేస్తున్న తప్పులు ఇప్పుడు వారికి శిక్షలుగా ఎదురువస్తున్నాయి. అతివృష్టికి కారణాలు ఇవి అని చెప్పలేము కాని వాటి వల్ల కలిగే నష్టాలకు కారణాలు మాత్రం ఖచ్చితంగా మానవ చర్యలే. అవేమంటే మన అవసరాల కోసం అడవుల్ని నరికివేస్తున్నాం. దీని వల్ల  పర్యావరణంలో సమతుల్యం తగ్గటంతో పాటు. నేలలో సారం దెబ్బతింటుంది. నీటిని పీల్చుకునే శక్తి కూడా తగ్గుతుంది. ఫలితంగా భూమిపై పడిన చినుకులు నేలలోకి ఇంకకుండా బయటకు వచ్చేస్తున్నాయి. దీనితో పాటు ఇష్టం వచ్చినట్లు చెరువులు, కాల్వలను ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారు. ఫలితంగా భారీ వర్షాలకు వచ్చే నీరు వెళ్లేందుకు మార్గం లేక తిరిగి ఇళ్ళలోకి వచ్చేస్తుంది. ఇది అందరికి తెలిసిందే. ప్రభుత్వాలకు తెలిసినా.. ఏమి చేయలేని పరిస్థితి మన దేశంలో ఉంది.

ఇక అకాల వర్షాల గురించి చెప్పాలంటే ముందుగా ప్రకృతిలో మార్పుల గురించి తెలుసుకోవాలి. చెట్లను నరికివేయటం, కాలుష్యం, వాతావరణ మార్పుల వల్ల  వల్ల పర్యావరణ సమతుల్యం దెబ్బతిని గ్లోబల్ వార్మింగ్ ఏర్పడుతుంది. ఫలితంగా రుతు పవనాలు సకాలంలో రాకపోవటంతో పాటు ఆలస్యంగా వస్తున్నాయి. దీని వల్ల జులైలో కురవాల్సిన వర్షాలు సెప్టెంబర్ లో మొదలవుతున్నాయి. అప్పటికి పడ్డ అరకొర చినుకులు, భూగర్బ జలాలను నమ్మకుని పంటలు వేసిన రైతులు అకాల వర్షాలతో కుదేలవుతున్నారు. అసలే వర్షాలు లేవని అన్నదాత బాధపడుతుంటే.., అనవసరంగా వస్తున్న అకాల వర్షాలు వారికి మరింత నష్టాన్ని మిగులుస్తున్నాయి. అందు వల్లనే అతివృష్టి లేదంటే.., అకాల వర్షాలు కొద్ది కాలంగా దేశంపై దాడి చేస్తున్నాయి.

హెలెన్, ఫైలిన్, నీలం, లైలా.., తాజాగా హుదుద్. పేరేదైనా కావచ్చు ఇవన్నీ మానవాళిపై ప్రకృతి మాత ఆగ్రహించి చేస్తున్న దాడులే అని చెప్పాలి. ఓపిక నశించి.., మనుషులు చేసే ఆగడాలపై ఓపిక లేక దెబ్బకు దెబ్బ అన్నట్లుగా ప్రకృతి ఇలా తుఫానై ప్రజలపైకి వస్తోంది. దీనికి విరుగుడు కంట్రోల్ రూంలు కాదు. ఆనకట్టలు, బ్యారేజిలు, విపత్తు నిర్వహణా బృందాలు అంత కన్నా కాదు. అత్యుత్తమ నష్ట నివారణ మార్గం ఒక్కటే. అదేమంటే ప్రకృతిని కాపాడటం.., వృక్షో రక్షితి రక్షిత: అన్నారు మన పెద్దలు. ఇలా ప్రకృతిని మనం కాపాడితే.., ప్రకృతి దేవత కూడా మనల్ని చల్లగ చూస్తుంది. చెట్లు పెంచటం... కాలుష్యాన్ని తగ్గించటం, అడవుల నరికివేతను అడ్డుకోవటం ఇది ప్రభుత్వాల పనో లేక స్వచ్చంద సంస్థల బాధ్యతో కాదు. ప్రతి ఒక్కరి కర్తవ్యం. ఇది తెలుసుకుని నడుచుకుంటేనే మెరుగైన మానవ మనుగడ సాధ్యం. లేకపోతే... భవిష్యత్తులో భారత్ పై సునామిలు విరుచుకుపడ్డా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆలోచించండి.. ఆచరించండి.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rains  floods  cyclones  global warming  

Other Articles