4 000 daughters sons in law campaign for this bjp candidate

aharashtra, Assembly elections, Solapur, daughter, sons-in-law, Subhash Deshmukh, Dilip Mane

4,000 Daughters', Sons-in-Law Campaign for This BJP Candidate

ఈ అభ్యర్థికి 4 వేల మంది కూతుళ్లు, అల్లుళ్ల ప్రచారం

Posted: 10/09/2014 03:03 PM IST
4 000 daughters sons in law campaign for this bjp candidate

ఉమ్మడి కుటుంబంలో ఉన్నవారు రాజకీయాల్లో ఈజీగా రాణించవచ్చుని నానుడి. ఎందుకంటే వారి బంధువులు ఓట్లన్ని కలుపుకున్నా విజయం సాధిస్తారని ధీమా. లేనిపక్షంలో పెద్ద కుటుంబం వున్నా లాభమే. అప్పుడెప్పుడో మహాభారతంలో హస్తినాపురం పాలకులు ధృతరాష్ట్రుడికి వంద మంది సంతానం అని విన్నాం. అలాంటిదే వున్నా విందు, వినోదాలు, ఖర్చులు లేకుండా కనీసం ప్రచారమైనా చేసుకోవచ్చును కదా..! అయితే అది పురాణాలకే పరమితం అనుకుంటున్నారా..?

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సంగ్రామంలో తన ప్రత్యర్థులతో పోటీ పడుతున్న ఓ అభ్యర్థికి నాలుగు వేల మంది కూతుళ్లు, అల్లుళ్లు ప్రచారం నిర్వహిస్తున్నారు. నిజమేనండీ.. షోలాపున్ దక్షిణ నియోజకవర్గం నుంచి బీజేపి తరపున బరిలోవున్న మాజీ ఎంపీ సుబాష్ దేశ్ ముఖ్ గెలుపు కోసం రెండు వేల మంది కూతుళ్లు, మరో రెండు వేల మంది అల్లుళ్లు ప్రచారం నిర్వహిస్తున్నారు. నాలుగు వేల మంది కూతుళ్లు అల్లుళ్లు, ఇక వారి బంధుగణం అంతా కలిస్తే.. ఏ లెక్కన చూసినా సుబాష్ దేశ్ ముఖ్ విజయం ఖాయమని అర్థమవుతోంది. ఇక్కడ మీకో సందేహాం వచ్చింది.

బహుకాలం నుంచి రాజకీయాలలో వున్న సుబాష్ దేశ్ ముఖ్, ఏడేళ్ల క్రితం లోక్ మంగల్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి వాటి ద్వారా అర్థికంగా, సామాజికంగా వెనకబడిన వారి అమ్మాయిలకు పెళ్లిళ్లు జరిపించేవారు. ప్రతీ ఏటా నవంబర్ నెలలో కార్తీక మాసంలో ఈ కళ్యాణ కార్యక్రమాలు నిర్వహించే వారు. వీరికి కొత్త వస్త్రాలు, సామాగ్రి, వీటితో పాటు పలు వంటసామాగ్రిని కూడా ఇచ్చేవారు. తమ పిల్లల కళ్యాణం చేయలేని పేద తల్లిదండ్రులకు ఆయన అండగా నిలచి, కళ్యాణాలు జరిపించేవారు. తాను కళ్యాణం జరిపించిన జంటలకు ఆడ పిల్ల జన్మిస్తే ఐదు వేల రూపాయల పారితోషకాన్ని బ్యాంకులో డిపాజిట్ చేయిస్తారు. అమ్మాయికి 18 ఏళ్ల వయస్సు వచ్చిన తరువాత అవి వారి పెళ్లిళ్ల కోసం చేతికందేలా ఈ పథకాన్ని ప్రవేశపెట్టాడు.

కాగా గత ఏడేళ్లో ఇప్పటికి వరకు రెండు వేల మంది జంటలకు ఆయన తన చేతుల మీదుగా పెళ్లిళ్లు చేశారు. ఎంతో మంది పేద రైతులు అమ్మాయిల పెళ్లి కోసం తమ భూమిని తక్కువ ధరకే అమ్మి రోడ్డుపాలవుతున్నారని, మరికొందరు  అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని తాను పెళ్లిళ్ల ఖర్చులతో పాటు సామాగ్రి, వంట సామాగ్రి ఇత్యాదులను సమకూరుస్తున్నానని సుభాష్ దేశ్ ముఖ్  చేప్పారు. ప్రస్తుతం తన ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి దిలిప్ మానెతో గట్టి పోటీని ఎదుర్కొంటున్న ఈయన..తన కూతుళ్లు, అల్లుళ్ల ప్రచారంతో తప్పక గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Maharashtra  Assembly elections  Solapur  daughter  sons-in-law  Subhash Deshmukh  Dilip Mane  

Other Articles