Trs operation akarsh attracts tdp leaders

kcr, talasani srinivas yadav, teegala krishna reddy,Tdp, Trs, dharma reddy, Prakash goud, mlc gangadhar, operation akarsh

trs operation akarsh attracts tdp leaders, 4 mlas and and mlc to join Trs

షి‘కారు’కు సిధ్దమైన ఆ నలుగురు.. పనిచేయని బాబు బుజ్జగింపులు

Posted: 10/09/2014 12:44 PM IST
Trs operation akarsh attracts tdp leaders

తెలంగాణ తెలుగు తమ్ముళ్లకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు బుజ్జగింపులు రుచించలేదు. టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ కు వారు లోంగిపోయారు. తెలంగాణలో టీడీపీకి తెలుగు తమ్ముళ్లు షాక్ ఇచ్చారు. తెలంగాణ తెలుగు తమ్ముళ్లు సైకిల్ దిగి కారులో షికారు చేయడానికి సన్నదమయ్యారు. తెలంగాణలో ఎదురుగాలి వీస్తున్నందున సైకిల్ తొక్కడం కష్టం అవుతోందని భావించారో ఏమో.., కారులో ఈ ఐదేళ్లు హాయిగా షికారు చేయవచ్చన్న భావన వారిలో కనబడుతోంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ అద్యక్షుడు కేసీఆర్ తో నలుగురు ఎమ్మెల్యేలు, ఓ ఎమ్మెల్సీ భేటీ అయ్యారు. సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, చల్లా ధర్మారెడ్డి, ప్రకాశ్‌గౌడ్, ఎమ్మెల్సీ గంగాధర్ లు తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్తో భేటీ అయ్యారు.
 
టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకునేందుకు ముహుర్తం ఖరారు చేసుకున్నారు. భేటీ అనంతరం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసమే తెరాసలో చేరుతున్నాని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి స్పష్టం చేశారు.  కేసీఆర్ నాయకత్వంలో బంగారు తెలంగాణ కావాలని కోరుకుంటున్నామన్నారు. సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ... తెలంగాణలో విద్యుత్ కష్టాలకు ప్రధాన కారణం తెరాస ప్రభుత్వం కాదన్నారు. రైతుల కష్టాలకు కారణం గత ప్రభుత్వాలతో పాటు చంద్రబాబూ కారణమేనని ఆరోపించారు. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయన్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles