Sweet beverages impairs memory

Sweet beverages, impairs, memory, california university, researchers, study, Rats

Sweet beverages impairs memory, says california university researchers

స్వీట్ డ్రింక్స్ తాగితే.. మెదడుకే మోసం..

Posted: 10/09/2014 10:48 AM IST
Sweet beverages impairs memory

మీ పిల్లలు ఎక్కువగా తీపి పానీయాలను ఇష్టపడుతున్నారా..? అయితే జాగ్రత్త సుమండీ.. నోటికి తీపైనవి దేహానికి చేదుగా పరిణమించే అవకాశాలున్నాయి. తీపిని ఎక్కువగా తీసుకునే పిల్లల్లో జ్ఞాపకశక్తికి సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయని అద్యయనాలు చెబుతున్నాయి. అంతేకాదు.. మరింత అధిక మోతాదులో తీపి పానీయాలు తీసుకునే పిల్లల్లో మెదడు వాపుకు కారణమవుతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

తీపి పానీయాలను అధికంగా తీసుకునే పిల్లలపై అధ్యయనం ప్రారంభించిన కాలిఫోర్నియా వర్సిటీ పరిశోధకలు.. తమ అద్యయన వివరాలను వెల్లడించారు. ముందుగా ఎలుకలై జరిపిన అధ్యయనాల్లో తీపి పానీయాలు ఎక్కువగా తీసుకుంటే.. దాని ప్రభావం మెదడుపై పడుతుందన్నారు. ఎదిగే వయస్సులో తీసకునే అహార పదార్థాల ప్రభావం మెదడుపై పడుతుందని పరిశోధకులు తెలిపారు. మెదడులో జ్ఞాపకశక్తిని నియంత్రించే హిప్పోకాంపస్ ప్రాంతంపై తీపీ పానీయాలు గణణీయమైన ప్రభావాన్ని చూపుతాయని వివరించారు.

ఈ పరిశోధనలో భాగంగా 76 ఎలుకలను ఎంపిక చేసి అందులో 35 శాతం ఎలుకలకు హై-ఫ్రక్టోస్‌ కార్న్‌ సిరప్‌ (హెచ్‌ఎఫ్‌సీఎస్‌)ను రోజూ తాగించామని పరిశోధన చేసిన ప్రొఫెసర్‌ స్కాట్‌ కానొస్కి తెలిపారు. మిగతా ఎలుకలకు సాధారణ పానీయాలను అందించారు. క్రమం తప్పకుండా కొన్నాళ్లు ఇలా చేసిన తరువాత వాటిని పరీక్షించగా.. మిగిలిన వాటితో పొలిస్తే తీపీ పానీయాలు తీసుకున్న ఎలుకలలో మెదడు పనితీరు, జ్ఞాపకశక్తి మందగించిందని తేలిందని ప్రొఫెసర్‌ స్కాట్‌ కానొస్కి వివరించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sweet beverages  impairs  memory  california university  researchers  study  Rats  

Other Articles