Ys sharmila nominated asycp telangana state president

ys jagan mohan reddy, ysr congress party, ysrcp, ponguleti srinivasa reddy, ys sharmila, ysr, telangana

YS Sharmila nominated asYCP Telangana state President

వైసీసీ తెలంగాణ అధ్యక్షురాలిగా షర్మిల

Posted: 10/08/2014 05:58 PM IST
Ys sharmila nominated asycp telangana state president

తెలంగాణ వైఎస్సార్ సీపీ అధ్యక్షురాలిగా షర్మిలను ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నియమించారు. తెలంగాణలోని పార్టీ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, శ్రేణుల అభ్యర్థన మేరకు షర్మిలాను పార్టీ అధ్యక్షురాలిగా నియమించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎంపికయ్యారు. వైసీపీ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్లీనరీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

తెలంగాణలో ప్రజలకు ఏ సమస్య వచ్చినా ముందుకు వచ్చి పోరాడతానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ప్రజలందరికీ పూర్తిగా అందుబాటులో ఉంటానని హామీయిచ్చారు. తెలంగాణలో తమ పార్టీ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేస్తామన్నారు. 2019లో తెలంగాణలో వైఎస్ఆర్ సీపీ జెండా ఎగరాలని పిలుపునిచ్చారు. కలిసికట్టుగా ప్రయాణం చేసి దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి కలలుగన్న సువర్ణయుగాన్ని తెచ్చుకుందామని అన్నారు. అత్తాపూర్ క్రిస్టల్‌ గార్డెన్స్‌లో జరిగిన వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.

అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన షర్మిల ప్రసంగిస్తూ.. తెలంగాణ ప్రజలకు మేలు చేసిన వారిలో వైఎస్ రాజశేఖరరెడ్డిని మించిన నాయకుడు లేరన్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే వైఎస్ఆర్ ...ఉచిత విద్యుత్ ఫైలుపై తొలి సంతకం పెట్టిన విషయాన్ని ఈ సందర్భంగా షర్మిల గుర్తు చేశారు. తెలంగాణలో 17 లక్షల పంపుసెట్లకు ఉచిత విద్యుత్ అందించారన్నారు. తెలంగాణ ప్రాంత ప్రజల్లో తమకు అన్యాయం జరుగుతోందన్న బాధ ఉందని, దాన్ని తొలగించాలనే ఆలోచన చేశారన్నారు. తెలంగాణ ప్రజలకు నేనున్నాను అని వైఎస్ఆర్ భరోసా ఇచ్చారని వైఎస్ షర్మిల గుర్తు చేశారు. వైఎస్ఆర్ చనిపోయినా తెలంగాణ ప్రజల గుండెల్లో ఆయన నిలిచిపోయారని షర్మిల అన్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles