Seperate ministry for non resident of telangana

nri, nri day, nri rights, nri passport, central government schemes for nri's, modi on nri's, non resident of telangana, nrt, telangana nri association, nri telangana association, latest news, kcr, kcr government, telangana, telangana news, telangana government, telangana cabinet, telangana latest, telangana ministers list

telangaana government plans to constitute a seperate ministry for non residents of telangana people : for assistance, helping and welfare fund telangana government plans to constitute a seperate ministry for non residents of telangana

ప్రవాస తెలంగాణవారికోసం ప్రత్యేక శాఖ..

Posted: 10/07/2014 08:20 AM IST
Seperate ministry for non resident of telangana

తెలంగాణ ప్రజల సంక్షేమానికి రాష్ర్ట ప్రభుత్వం పెద్దపీట వేస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణ వారికే ఫలాలు దక్కాలనే లక్ష్యంతో పకడ్బందీ కార్యక్రమాలు చేపడుతోంది కూడా. తమ ఫలాలు రాష్ర్టంలోని తెలంగాణ ప్రజలకే కాకుండా.., విదేశాల్లో ఉన్న తెలంగాణవారికి కూడా అందించాలనుకుంటోంది. అందుకోసమే ప్రవాస తెలంగాణేయుల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది. విదేశాల్లో ఉన్న తెలంగాణ ప్రజల సంక్షేమం ప్రధాన లక్ష్యంగా ఈ శాఖను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.

ఇప్పటికే కేరళ, పంజాబ్ రాష్ర్టాలు విదేశాల్లో ఉన్న తమవారి కోసం ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖలను ఏర్పాటు చేసుకున్నాయి. వాటి ద్వారా పరాయిగడ్డపై ఉన్న తమవారి సంక్షేమం కోసం నిధులను కేటాయించటంతో పాటు వారి కోసం సహాయక కార్యక్రమాలను కూడ నిర్వహిస్తున్నాయి. అదే తరహాలో తెలంగాణ కూడా ప్రవాసీతెలంగాణ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. రెండు రాష్ర్టాల్లాగానే సంక్షేమ నిధి ఏర్పాటు, సహాయక కార్యక్రమాలు ప్రధాన ఎజెండాలుగా ఇది ఏర్పడనుంది. ఈ నెలలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రతిపాదనపై చర్చ జరిపి మంత్రిత్వ శాఖకు సంబంధించిన బిల్లును సభలో ప్రవేశపెట్టాలని భావిస్తోంది.

మంత్రిత్వ శాఖ వల్ల కలిగే ప్రయోజనాలు :

* ఒక సంక్షేమ నిధి నిర్వహణ. ప్రభుత్వ నిధుల కేటాయింపు.

* ప్రవాసీయుల సమస్యలు త్వరగా పరిష్కరించేందుకు హెల్ప్ లైన్ ఫోన్ నంబర్‌తో 24గంటల సహాయ కేంద్రం ఏర్పాటు.

* రాష్ర్టంలోని అన్ని కమిషనరేట్లు, ఎస్పీ కార్యాలయాలతో హెల్ప్ లైన్ అనుసంధానం చేసి పర్యవేక్షణకు ఒక ఎస్పీ నియామకం.

* విదేశాలలో మోసపోయి వచ్చే వారికి రాష్ట్రంలో పునరావాసం, ఉపాధికి ప్రత్యేక పథకం.

* వివాహం తర్వాత జరిగే మోసాలను అరికట్టేందుకు ప్రవాసీయుల వివాహాలను తప్పనిసరిగా నమోదు చేయాలనే నిబంధన.  

* ఇమ్మిగ్రేషన్ విభాగం ద్వారా విదేశాలకు వెళ్లే వారి వివరాలు జిల్లా స్థాయిలో సేకరించడం.

* విదేశాల్లో ఉన్న తెలంగాణ వారి భద్రత, సహాయం కోసం రాయబార కార్యాలయంలో ప్రత్యేక విభాగం ఏర్పాటు.

* ఎన్ఆర్‌టీల కోసం ప్రత్యేక వెబ్‌సైట్‌ ఏర్పాటు. మెయిళ్ల ద్వారా దరఖాస్తులను, ఫిర్యాదులను స్వీకరణ.

* ప్రవాసీయులు రాష్ర్టంలో పెట్టుబడులు జరిపేలా ప్రోత్సాహం. ప్రత్యేక రాయితీలు, సబ్సిడీల కల్పన

తెలంగాణకు చెందిన దాదాపు 8లక్షల మంది ప్రజలు విదేశాల్లో ఉంటున్నారు. ప్రధానంగా అమెరికా, బ్రిటన్, ఆస్ర్టేలియా, గల్ఫ్, ఆఫ్రికా, న్యూజిలాండ్ దేశాల్లో తెలంగాణ వారు ఎక్కువగా ఉన్నారు. విదేశాల్లో అనేకమంది నానా ఇబ్బందులు పడుతున్నారు. జీతాలు సరిగా ఇవ్వక.., ఉపాధి అవకాశాలు లేకపోవటంతో పాటు ఏజంట్లు ఉద్యోగ ఉందని చెప్పి మోసం చేసి విదేశాలకు పంపిస్తే.., అక్కడ అనేకమంది ఇబ్బందులు పడుతున్నారు. వీరిని ఆదుకునేందుకు మంత్రిత్వ శాఖ కృషి చేస్తుంది. ప్రస్తుతం ప్రవాస తెలంగాణ వారికి ఒక విభాగం పనిచేస్తుండగా ఇకపై ప్రత్యేక మంత్రిత్వ శాఖ వీరి బాగోగులను చూసుకోనుంది. సాధారణ పరిపాలన శాఖకు చెందిన అధికారులు ఇప్పటికే ఈ శాఖ ఏర్పాటు, పనితీరుపై కేరళ, పంజాబ్ ప్రభుత్వాలో సంప్రదింపులు జరిపి సమాచారం సేకరించారు. అదే విధంగా ఒక ప్రత్యేక కమిటిని గల్ఫ్ కు పంపి.., అక్కడి ప్రభుత్వ నిబంధనలపై అధ్యయనం చేయిస్తొంది. ప్రత్యేక శాఖ ఏర్పడితే పొట్ట చేతబట్టుకుని విదేశాలకు వెళ్లి మోసపోయే వారికి మంచిరోజులు వచ్చినట్లే అని ప్రవాసి తెలంగాణేయులు అంటున్నారు.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telangana  ministry  latest news  non resident of telangana  

Other Articles