Union ministers assets list released

venkaiah naidu, venkaiah naidu assets, venkaiah naidu latest, venkaiah naidu minister, venkaiah naidu profile, venkaiah naidu wiki, venkaiah naidu news, venkaiah naidu family, narendra modi, narendra modi wiki, narendra modi family, narendra modi speech, narendra modi comments, narendra modi latest, narendra modi government, narendra modi profile, narendra modi wife, central ministers, central ministers list, union ministers list, latest news, pmo, central government

prime ministers office released central ministers assets list in its website : finance minister arun jaitley is the richest minister in the ministers assets list and venkaiah naidu having last place in the list

వెంకయ్యనాయుడు ఆస్తి రూ. 20లక్షలేనట !

Posted: 10/07/2014 07:26 AM IST
Union ministers assets list released

గ్రామ సర్పంచ్ అంటేనే ఐదేళ్ల పదవీకాలంలో లక్షాధికారి నుంచి తలుచుకుంటే కోటిశ్వరుడు అవుతాడు. ఈ విషయం అందరికి తెలిసిందే. కాని కేంద్ర మంత్రి అయినా ఆస్తి మాత్రం కనీసం నలబై లక్షలు కూడా లేదు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఆస్తి విలువ రూ. 40లక్షలకు తక్కువే. ఈ లెక్కలు స్వయంగా ప్రధాని కార్యాలయం చెప్తోంది. కేంద్రమంత్రుల ఆస్తుల వివరాలను సోమవారం రోజు ప్రధాని కార్యాలయం వెల్లడించింది. ఈ జాబితా ప్రకారం.., అత్యంత ధనవంతుడైన కేంద్రమంత్రిగా అరుణ్ జైట్లి ప్రధమ స్థానంలో ఉన్నారు. జైట్లీ ఆస్తి విలువ రూ.72.10కోట్లుగా ఉంది.

ఇక ప్రధాని నరేంద్ర మోడీకి రూ.1.26 కోట్ల ఆస్తులున్నాయి. మోడీకి రూ.38,700 నగదు, రెండు బ్యాంకు ఖాతాల్లో రూ.1,32,698, రూ.17,00,927ల చొప్పున నగదు నిల్వలు, రూ.2,35,000, రూ.20,000 విలువైన రెండ్లు, గాంధీనగర్ లో రూ.1 కోటి విలువ చేసే ఇల్లు ఉంది. వీటితో పాటు రూ.1,20,980 విలువ కలిగిన నగలు, ఖరీదైన వస్తువులు, రూ.1,99,031 విలువ కలిగిన ఇన్సూరెన్స్ బాండ్, ఉన్నాయి. అయితే ఈ ఈ జాబితాలో మోడి భార్య జశోదా బెన్ ఆస్తుల వివరాల కాలమ్ ఎదురుగా ‘నాట్ నోన్’ అన్న పదాలు రాసిపెట్టారు. ఇక వెంకయ్యనాయడు కంటే కాస్త ఎక్కువగా కేంద్రమంత్రి రాం విలాస్ పాశ్వన్ ఉన్నారు. ఈయన ఆస్తి విలువ రూ. 39.88 లక్షలుగా ఉంది.

ఏపీకి చెందిన కేంద్రమంత్రి, టీడీపీ నేత అశోక గజపతి రాజు ఆస్తి విలువ రూ.3.32కోట్లుగా ఉన్నట్లు పీఎంఓ వెల్లడించింది. కేబినెట్ లో నెంబర్ టూ స్థానంలో ఉన్న రాజ్ నాధ్ సింగ్ కు రూ.2.56కోట్ల ఆస్తి ఉంది. విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్ కు రూ.2.73కోట్ల ఆస్తి ఉన్నట్లు లెక్కలు చెప్తున్నాయి. వీరితో పాటు కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్ ఆస్తి విలువ రూ. 48.54లక్షలే. ఇలా మొత్తం 22మంది కేంద్రమంత్రుల్లో 17మంది కోటిశ్వరులు ఉన్నారు. మిగతావారు లక్షాధికారులు ఉన్నట్లు ప్రధాని కార్యాలయ వెబ్ సైట్ జాబితాను ప్రకటించింది.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : central ministers  narendra modi  arun jaitley  venkaiah naidu  

Other Articles