Serial shocks to k chandrasekhar rao

telangana government, telangana government latest news, telangana government logo, telangana updates, telangana news, telangana kcr, kcr, kcr family, telangana cabinet, fast scheme, fee reimbursment, latest news, highcourt, hyderabad highcourt, number plates, vehicle numbers

kcr government facing serial shocks with high court decissions and also with central notification on metro rail : telangana govenrment facing hurdles by its decissions on fast scheme, metro rail, number plates and other issues too

ప్రభుత్వ ప్రతి ప్రకటన వివాదమే..తెలంగాణలోనే ఎందుకిలా...?

Posted: 09/24/2014 04:23 PM IST
Serial shocks to k chandrasekhar rao

తెలంగాణ ప్రభుత్వం ఏ పని తలపెట్టినా దానికి ఎన్నో అడ్డంకులు వస్తున్నాయి. ప్రతి ప్రకటన వివాదస్పదమే. ప్రతి నిర్ణయమూ ఓ సంచలనమే. ఇలా ఎందుకు జరుగుతోంది. ప్రభుత్వం చేసే ప్రతి పనికి ఎందుకు అడ్డంకులు వస్తున్నాయి అనే అంశంపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. దీనికి ప్రధాన కారణాలు ప్రభుత్వ ఆలోచనా విధానమే అని స్పష్టంగా తెలుస్తోంది. ప్రభుత్వం సమగ్ర ప్రజా సంక్షేమం కాకుండా.., ఒక వర్గ ప్రయోజనం కోసం ప్రయత్నించటం వల్లనే ఇలా జరుగుతోందని విమర్శలు వస్తున్నాయి. అందు వల్లనే ఫాస్ట్ పధకం, వాహనాల నెంబర్ ప్లేట్లపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టు తీర్పు ఇచ్చిందని అర్ధమవుతోంది.

‘ఫాస్ట్’ పధకంపై మండిపాటు

తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన ఫాస్ట్ పధకంపై హైకోర్టు తీవ్రంగా మండిపడింది. ఇదెక్కడి జీవో అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణ అంటే ప్రత్యేక దేశం కాదు., భారత్ లోనే అంతర్బాగమనే విషయం గుర్తుంచుకోవాలని సూచించింది. దేశ సమగ్రతను దెబ్బ వేర్పాటువాదం పెచ్చుమీరేలా జీవోలు విడుదల చేస్తారా అని సూటిగా ప్రశ్నించింది. తెలంగాణ విడుదల చేసిన జీవో రాజ్యాంగం ప్రకారం ఆమోదయోగ్యం కాదని తెలిపింది. ప్రభుత్వం మరోసారి జీవోను పరిశీలించాలని ఆదేశిస్తూ.., తదుపరి విచారణను 6వారాల పాటు వాయిదా వేసింది.

అసలేమి‘టీ’ ‘ఫాస్ట్’

వైఎస్ ప్రారంభించిన ఫీజు రిఎంబర్స్ మెంట్ పధకాన్ని కొనసాగిస్తూనే.., దానికి పలు నిబంధనలు, పేరు మార్పు చేయటంతో అది ఫాస్ట్ పధకంగా మారింది. ఈ పధకం ద్వారా వేగంగా విద్యార్థుల ఫీజులు చెల్లిస్తామని కేసీఆర్ ప్రకటించారు. అయితే ఇక్కడే ఒక లింకు పెట్టారు. కేవలం తెలంగాణ విద్యార్థులకే ఫీజులు చెల్లించాలనే ఉద్దేశ్యంతో.., ప్రత్యేకంగా ఈ పధకం రూపొందించారు. ఇందులో స్థానికత ఆధారంగా ఫీజులు చెల్లించటం జరుగుతుంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం విద్యార్థి తెలంగాణ స్థానికుడు కాకపోతే వారికి పీజులు చెల్లించదు. ఇందుకోసం 1956 ప్రామాణికంగా తీసుకువచ్చారు. అంటే ప్రస్తుత విద్యార్థుల పూర్వికుల తరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ 1956కు పూర్వం తెలంగాణలో ఉన్నట్లయితేనే వారు స్థానికులు. 1956తర్వాత వచ్చిన వారు ఫీజు చెల్లింపులకు అర్హులు కాదని ప్రభుత్వం నిర్ణయించింది.

దీనిపై చాలా వివాదాలు వచ్చాయి. 1956 పూర్వం వచ్చిన వారు స్థానికులు అని చెప్పటం రాజ్యాంగ విరుద్ధమని వాదనలు విన్పిస్తున్నాయి. 7సం.లు ఒక ప్రాంతంలో ఉంటే అక్కడ స్థానికుడుగా రాజ్యాంగం హక్కులు కల్పిస్తుంది. అలాంటిది అరవై ఏళ్ళ క్రితం వచ్చి ఉంటే తెలంగాణ వారు అనటం మంచిది కాదని ప్రజాస్వామ్యవాదులు సూచించారు. కేసీఆర్ ప్రకారం అయితే తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ ‘సానియా మిర్జా’ కూడా తెలంగాణ వ్యక్తి కాదని విమర్శించారు. మరి ఆమెను ఎందుకు పెట్టారో చెప్పాలని సూటిగా విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఫీజును కలిసి చెల్లించుకుందాం అని చెప్పారు. విభజన చట్టంలో సూచించిన నిష్పత్తి ప్రకారం ఫీజు ఇచ్చేందుకు అభ్యంతరం లేదన్నారు. అయినా సరే తెలంగాణ వినకుండా పంతానికి పోయింది. ప్రభుత్వ నిర్ణయంపై కోర్టులో పిటిషన్లు దాఖలు కావటంతో న్యాయస్థానం స్పందించి సర్కారుకు మొట్టికాయలు వేసింది.


నంబర్ ప్లేట్ల విచిత్రం

ఇక తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న వివాదాస్పద నిర్ణయాల్లో మరొకటి నంబర్ ప్లేట్ల మార్పు అని చెప్పవచ్చు. తెలంగాణ ఏర్పడ్డాక.. కొత్త వాహనాల రిజిస్ర్టేషన్ల కోసం కేంద్రం కొత్త కోడ్ లు కేటాయించింది. జూన్ 2కు ముందు వాహనాలన్ని ఏపీ పేరుతో రిజిస్టర్ అయ్యేవి. తెలంగాణలో ఏపీ పేరుతో ఉన్న వాహనాలన్నీ తెలంగాణ పేరుతో మార్చుకోవాలని ప్రభుత్వం విచిత్రమైన జీవో విడుదల చేసింది. ఇందుకు సమయం కూడా కేటాయించిందనుకోండి. దీనిపై కూడా గందరగోళం ఏర్పడింది. ఏపీ స్థానంలో టీజీ అని రాసుకుంటే సరిపోతుందని కొందరు మంత్రులంటే, లేదు.. లేదు రవాణా శాఖ వారే కొత్త కోడ్ ఇస్తారు అని మరికొందరన్నారు. ఇక నంబర్ ప్లేట్ల మార్పుకోసం ఇచ్చిన గడువు లోపు తెలంగాణ ఆర్టీఏలో ఉన్న సిబ్బంది అంతా పనిచేసినా.., యాబై శాతం కూడా పూర్తికావు. ఈ విషయం అధికారులే అధికారికంగా ప్రకటించారు. అయినా సరే సర్కారు వింటేకదా.., మారాలంటే, మారాలి అంతే అని ప్రకటించింది.

కొత్త వాహనాలు అయితే టీఎస్ పేరుతో రిజిస్టర్ అవుతున్నాయి కానీ.., పాత వాహనాలు టీఎస్ అని వేయించుకున్న సంఖ్య చాలా తక్కువ. పైగా ఉచిత సలహాతో ఏపీ స్థానంలో టీఎస్ అని రాసుకుని చాలామంది లైట్ తీసుకుంటున్నారు. ఈ విషయంపై కూడా కోర్టులో పిటిషన్ దాఖలైంది. కోడ్ మార్చాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నిస్తే.. సరైన సమాధానం చెప్పలేకపోయారు పెద్దలు. దీంతో ఈ నిర్ణయం కూడా సరికాదంటూ షాకిచ్చింది. మార్చకపోతే వచ్చే నష్టమేంటో చెప్పాలని స్పష్టం చేసింది. ఈ రెండు అంశాలపై కోర్టు తీర్పులు రెండు రాష్ర్టాల ప్రజలకు అనుకూలంగా ఉన్నాయి. ప్రజాస్వామ్యంలో కోర్టుల పాత్ర., ప్రాధాన్యతను గుర్తించేలా తీర్పును ఇవ్వటం సంతోషకరం. ఇలాంటి తీర్పుల వల్ల సామాన్యులకు కూడా న్యాయం జరుగుతుంది అనే నమ్మకం ఏర్పడుతుంది.

ముందు మీరు మారండి

ఫీజు చెల్లింపుకు నిబంధనలు మారుస్తూ.., నంబర్ ప్లేట్లను మార్చుకోవాలని ప్రజలకు సూచించే బదులుగా.., ప్రభుత్వం మనసు మార్చుకుంటే చాలు అని విమర్శకులు సూచిస్తున్నారు. ప్రభుత్వం చేసేది ప్రజా సంక్షేమం కోసం తప్ప పగకోసం కాదు అని నిరూపించుకోవాలి. ప్రతి విషయం వివాదాస్పదం ఎందుకు అవుతుందో ఒకసారి ఆలోచిస్తే మంచిది. తెలంగాణలో ఉన్న సీమాంధ్ర ప్రజలను కంటికి రెప్పలా చూసుకుంటామన్న ప్రభుత్వం ఇప్పుడేం చేస్తోంది అంటే.. కళ్ళలో నలుసులా భావిస్తోంది అనే సమాధానం వస్తోంది. దయచేసి ప్రజల మద్య వేర్పాటువాద భావాలు రానివ్వకండి. రాష్ర్టాలుగా విడిపోయినా తెలుగు వారుగా కలిసే ఉన్నారు అని చాటేలా వ్యవహరిచటం ఉత్తమం.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(2 votes)
Tags : telangana government  kcr  highcourt  latest news  

Other Articles