Horoscope of chiranjeevi and lokesh

chiranjeevi, lokesh, great future, cinema, politics, yuddanapufu ayanna pandithulu

chiranjeevi and lokesh both has a great future in cinema feild, they may not reach up to the mark in politics

సినీమా రంగంలోనే వారు బాగా రాణిస్తారు..

Posted: 09/21/2014 04:47 PM IST
Horoscope of chiranjeevi and lokesh

లీడర్ కావాల్సిన వారిని యాక్టర్ అయితే బాగుండు అంటున్నారు. మరో కేంద్ర మాజీ మంత్రికి లీడర్ యోగమే లేదంటున్నారు. ఇంతకీ యాక్టర్ కాల్సిందేవరు..? అలా అనిందెవరు..? అనేగా మీ ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు లోకేష్ బాబు.. సినిమా నటుడు అయితే బాగుంటుందట. తన ఐడియాలతో ప్రభుత్వ పాలనలో తన తండ్రికి సలహాలు, సూచనలు ఇస్తూ బిజీగా వున్న లోకేష్.. నటుడు అయితే ఆయన యోగమే మారుతుందని మహాకామేశ్వర పీఠాధిపతి యద్దనపూడి అయ్యన్న పండితులు అన్నారు.

తన ఆధ్యాత్మిక ప్రసంగాల మధ్యలో రాజకీయ అంశాలను ప్రస్తావించారు. మెగాస్టార్, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి, ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ భవిష్యత్లు ఏ రంగంలో ఉంటే బాగుంటుందో జోస్యం చెప్పారు. దేవీనవరాత్రి ఉత్సవ విశేషాలను వివరించే సందర్భంలో ఆయన రాజకీయాల గురించి మాట్లాడారు. లోకేష్ రాజకీయాలలోకంటే సినిమా రంగంలో అయితే బాగా రాణిస్తారన్నారు. ఆయన జాతకంలో రాహుకేతువులు ఉచ్ఛ స్థితిలో ఉన్నాయని తెలిపారు. రాహుకేతువులు ఉచ్ఛ స్థితిలో ఉంటే సినిమాలలో బాగా రాణిస్తారని చెప్పారు.

గతంలో తాను చిరంజీవికి రాజకీయ భవిష్యత్ లేదని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. చిరంజీవి సినిమా భవిష్యత్ బాగుంటుదన్నారు. అయితే ఆయన రాజకీయాలలో పనికిరారా? అంటే రాహుకేతువులు ఉచ్ఛ స్థితిలో ఉన్నప్పుడు సినిమా భవిష్యత్ బాగుంటుందని చెప్పారు. రాహుకేతువులు అంటే ఛాయాగ్రహాలని.. ఛాయాగ్రాహకుడి సంబంధం ఎక్కువగా ఉంటుందన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి వెంటనే మఠాధిపతులు, పీఠాధిపతులతో పాలకమండలిని ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. టిటిడి పాలకమండలిలో వ్యాపారస్తులకు అవకాశం ఇవ్వవద్దని అయ్యన్న పండితులు చెప్పారు.

జి మనోహర్

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chiranjeevi  lokesh  great future  cinema  politics  yuddanapufu ayanna pandithulu  

Other Articles