ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వరుసగా నాల్గవసారి ఆస్తులు ప్రకటించారు. ముఖ్యమంత్రి తేల్చిన లెక్కల ప్రకారం బాబుగారి ఫ్యామిలి ఆస్తులు మొత్తం రూ.38.92కోట్లు. గతేడాదితో పోలిస్తే ఇది కొంచెం తక్కువని చెప్పవచ్చు. 2013లో బాబు కుటుంబ ఆస్తుల విలువ రూ.41.70కోట్లుగా ఉంది. శుక్రవారం ప్రకటించిన ఆస్తుల వివరాలను పరిశీలిస్తే.., చంద్రబాబు ఆయన కోడలు బ్రహ్మణి ఆస్తులు స్వల్పంగా పెరిగాయి. ఇదే సమయంలో బాబు భార్య భువనేశ్వరి, కొడుకు లోకేష్ ఆస్తి స్వల్పంగా తగ్గింది. ఏపీలో ఆస్తుల ప్రకటనను మొదలు పెట్టిన నేతగా పేరు తెచ్చుకున్న చంద్రబాబు ఆస్తులను ఒకసారి పరిశీలిద్దాం.
బాబు ఆస్తులు యాబై లక్షలు కూడా లేవు..
చంద్రబాబు శుక్రవారం ప్రకటించిన లెక్కల ప్రకారం ఆయన ఆస్తి విలువ రూ. 70.69 లక్షలుగా ఉంది. ఇది గతేడాది రూ.42.06లక్షలుగా ఉంది. బ్యాంకు బ్యాలెన్స్ రూ.45.96లక్షలకు పెరగటంతో ఆస్తుల విలువ పెరిగినట్లు చెప్పారు. ఇతర ఆస్తులను చూస్తే... జూబ్లిహిల్స్ లోని ఇళ్ళు విలువ రూ.23.20 లక్షలు ప్రస్తుతం ఇది బ్యాంకు ఆఫ్ బరోడాలో తాకట్టులోఉన్నట్లు తెలిపారు. ఇక 1993-94 మద్య కొన్న ఒక అంబాసిడర్ కారు విలువ రూ.1.52 లక్షలు. నేషనల్ సేవింగ్స్ స్కీం సర్టిఫికెట్ రూ.10 వేలు ఉన్నాయి.
భువనేశ్వరి ఆస్తుల వివరాలు
భువనేశ్వరి ఆస్తుల విలువ రూ. 30.59 కోట్లుగా చెప్పటం జరిగింది. గతేడాది కంటే ఆమె ఆస్తి రూ.2.46కోట్లు తగ్గింది. పంజాగుట్టలో ఓ భవనం విలువ రూ.73.33లక్షలతో8 పాటు, మదీనగుడలో ఐదు ఎకరాల వ్యవసాయ భూమి, హెరిటేజ్ కంపనీలో రూ.19.95కోట్ల విలువైన పెట్టబడులు, నిర్వాణ హోల్డింగ్స్ లో రూ. 3.28 కో్ల విలువైన పెట్టుబడులు ఉన్నాయి. తమిళనాడులోని చెన్నేరుకుప్పంలో ఉన్న గోదాం కూడా భువనేశ్వరి ఆస్తుల జాబితాలో ఉంది. అంతేకాకుండా పీఎఫ్ ఖాతాలో రూ. 1.28కోట్లు, బంగారు ఆభరణాలు, విలువైన రాళ్ళు కలిపి రూ.67.16లక్షలు, 32.7కేజీల వెండి, రూ.91.93 విలువైన ఆడి కారు ఉన్నాయి. ఇతర ఆస్తులు అన్ని కలిపి రూ.16.91కోట్లు ఉండగా.., బ్యాంకు బ్యాలెన్స్ రూ.7లక్షలుగా చెప్పారు. అటు బ్యాంకు ఆఫ్ బరోడాలో రూ.15.12కోట్లు, ఇతర అప్పులు రూ.1.15కోట్లు ఉన్నాయి.
లోకేష్ బ్రహ్మణి ఆస్తులు..
లోకేష్ ఆస్తి విలువ రూ. 3.57కోట్లుగా చంద్రబాబు తెలిపారు. గతేడాది ఈ ఆస్తి విలువ రూ. 4.92కోట్లుగా ఉంది. లోకేష్ కు జూబ్లిహిల్స్లో 1285గజాల స్థలం, మదీనగుడలో ఐదు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. మహారాష్ర్టలో సోగస్ గ్రామంలో 8.426ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. లోకేష్ కు రెండు బుల్లెట్ ప్రూఫ్ ఫార్చునర్ కార్లు ఉన్నాయి. అంతేకాకుండా ఫోర్డ్ ఫియస్టా కారు కూడా ఉంది. ఇక బ్రహ్మణి ఆస్తుల విలువ రూ. 5.32 కోట్లు కాగా.., అప్పుల విలువ రూ. 1.36కోట్లుగా ఉంది. గతేడాది కంటే బ్రహ్మణి ఆస్తుల విలువ రూ.65లక్షలు పెరిగింది. మొత్తం లెక్కలను చూస్తే.. కుటుంబ సభ్యుల ఆస్తికంటే చంద్రబాబు ఆస్తి తక్కువగా ఉంది. బాబుకు ఇరవై ఏళ్ళ క్రిందటి కారు ఉంది. ఇళ్ళు కూడా తాకట్టులో ఉంది. ఈ లెక్కలపై ప్రతిపక్షాలు నోరెళ్ల బెడుతున్నాయి. సొంత లెక్కలు., సొంత పేర్లపై ఉన్న ఆస్తులు కాదు.. బినామి పేర్లపై ఉన్న ఆస్తుల వివరాలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. బాబుకు నిజంగా బినామి ఆస్తులు ఉంటే అవి ప్రతిపక్షాలు బయటపెట్టవచ్చు కదా. అప్పుడు ఆయనేం సమాధానం చెప్తారో చూద్దాం.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more