Chandrababu has done it

AP government, chandrababu, Red sandal, gngireddy, interpol, red corner notice, alipiri, smuggler, target

interpol issued red corner notice in search of ganfireddy

చంద్రబాబు ‘సాధించా‘డోచ్...

Posted: 09/19/2014 10:04 AM IST
Chandrababu has done it

మనకెవరరైనా.. ఎప్పుడైనా హాని చేస్తే వారినేం చేస్తాం.. ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అదే చేశారు. అన్ని విషయాల్లోనూ అంచనాలకు అందకుండా ఆచితూచి అడుగు వేసే చంద్రబాబు.. ఈ విషయంలో మాత్రం సాధారణ మనిషిలాగే వ్యవహరించాడు. అనుకున్నది అనుకున్నట్టుగా సాధించాడు. ఇంతకీ ఏం సాధించాడనేగా మీ ప్రశ్న.. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ అధికారంలోకి రాగానే.. విదేశాలకు తప్పించుకుని తిరిగుతున్న ఎర్రచందనం అక్రమ రవాణాలో వాంటెడ్‌గా ఆరోపణలు ఎదుర్కొంటున్న కొల్లం గంగిరెడ్డిపై ఎలాగన పట్టకుని తీరాలనుకున్న బాబు.. అతనిపై రెడ్ కార్నార్ నోటీసును ఇప్పించగలిగాడు. ఇంకేముందు గంగిరెడ్డి ఎక్కడ వున్నా ఇంటర్ ఫోల్ అధికారులు అతడిని వల పన్ని పట్టుకుంటారు.

ఎర్రచందనం అక్రమ రవాణాలో వాంటెడ్‌గా వున్న అనేక మందిని వదిలేసి కేవలం కొల్లం గంగిరెడ్డినే చంద్రబాబు ఎందుకు టార్గెట్ చేశారు.. అనేగా మీ ప్రశ్న. గంగిరెడ్డి కేవలం ఎర్రచందనం స్మగ్లరే కాదు.. చంద్రబాబును అంతమెందిచాలని ప్లాన్ చేసిన ఘనుడు కూడా. 2003లో అలిపిరి వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబుపై జరిగిన దాడి కేసులోనూ ప్రధాన సూత్రధారిగా ఇతడిపై ఆరోపణలున్నాయి. ఆ ఘటనలో కాస్తాలో పెను ప్రమాదం నుంచి బయట పడ్డ బాబుకు ఇన్నాళ్లకు అవకాశం వచ్చింది. ఇన్నాళ్లు ప్రతిపక్షంలో వుండటంతో గంగిరెడ్డి జోలికి కూడా వేళ్లని చంద్రబాబు.. ఇప్పుడు ఏకంగా ఆయననే టార్గెట్ చేశారు.

విషయాన్ని ముందే పసిగట్టిన కొల్లం గంగిరెడ్డి ఈ ఏడాది మే 21న బహెరైన్ పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. అధికారం అందుకునే సమయంలో తన ప్రాణాలు తీయాలని ప్లాన్ చేసిన గంగిరెడ్డి తప్పించుకోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైన చంద్రబాబు అతడిని ఎలాగైనా పట్టుకోవాలని ప్లాన్ చేశాడు. కేంద్రంలో అధికారంలో వున్న తన మిత్రపక్షమైన బీజేపిపై ఒత్తిడి తీసుకువచ్చి.. గంగిరెడ్డిపై ఇంటర్ పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసు ఇప్పించాడు. దీంతో ఇంటర్ పోల్ అధికారులు గంగిరెడ్డి ఎక్కడు వున్నా గుర్తించే వీలుంది. అతడిని అరెస్టు చేసి రాష్ట్రానికి అప్పగించే అవకాశాలు కూడా మెండుగా వున్నాయి. ఎర్రచందనం అక్రమ రవాణాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడనే ఆరోపణలకు సంబంధించి గంగిరెడ్డిపై కర్నూలులో కేసు నమోదైంది. ఈ కేసులో అరెస్ట్ అయిన గంగిరెడ్డి ఈ ఏడాది మే 15న బెయిల్ పొందాడు. ఈ విషయంలో న్యాయస్థానం కూడా గంగిరెడ్డిపై చాలా సీరియస్ గానే వుంది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AP government  chandrababu  Red sandal  gngireddy  interpol  red corner notice  alipiri  

Other Articles