How to eradicate corruption

AP government, chandrababu, Revenue Employees, corruption, department

shock to chandrababu government as Revenue Empolyees say corruption prevails in every department

అవినీతిని కూకటివేళ్లతో పెకిలించడమెలా..?

Posted: 09/19/2014 08:08 AM IST
How to eradicate corruption

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర వైపు పరుగులు తీయించే పనిలో వున్న ముఖ్యమంత్రి చంద్రబాబును ఒక ప్రశ్న ఇబ్బందులు పెడుతోంది. మరో విధంగా చెప్పాలంటే.. ఆయన మదిని తొలుస్తుంది. అధికారంలోకి వచ్చి సుమారుగా నాలుగు నెలలు కావస్తున్నా రాజధాని లేని రాష్ట్రంలో ముందుగా రాజధాని నిర్మాణం చేపట్టాలని నిర్ణయంచుకున్న బాబుకు తొలి షాక్ తగిలింది. రాజధాని నగరాన్ని ప్రకటించినా.. ప్రజా పాలన అంతా హైదరాబాద్ నుంచే సాగుతన్న నేపథ్యంలో ముందుగా అధికారులను అక్కడికి పంపాలన్న ఆయన ఆలోచనకు ఇప్పడు బ్రేకులు పడనున్నాయి. అంతకన్నా వేగంగా అవినీతిని నిర్మూలించాలని చంద్రబాబు యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

అన్ని శాఖల హెచ్ఓడీలను విజయవాడకు పంపించిన తరువాత.. యావత్ పరిపాలనను విజయవాడకు తరలించాలని భావించిన చంద్రబాబు.. ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవినీతిని కూకటివేళ్లతో పెకిళించడమెలా..? అన్న విషయాన్ని ఆలోచిస్తున్నారు. అవినీతి అన్ని శాఖల్లో వుంది, ఎక్కడ లేదో చెప్పమనండి.. ప్రపంచమంతా అవినీతి వుంది.. కాదంటారా అని రెవెన్యూ ఉధ్యోగుల సంఘం అధ్యక్షుడు బి.వెంకటేశ్వర్లు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు చంద్రబాబుకు కంటి మీద కునుకు లేకుండా చేశాయి. తక్షణం అవినీతి అధికారులపై చర్యలు తీసుకునేలా ప్రణాళిక రచించాలని యోచిస్తున్నారు.

తన హయాంలో అవినీతి ఏ స్థాయిలో వున్నా సహించలేదని, ఇకపై కూడా సహించబోనని ఎన్నికల్లో ప్రజలకు ఆయన హామి ఇచ్చారు. మరి ఇప్పుడేమిటా అంటే.. స్వయంగా రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు అవినీతి ఏ శాఖలో లేదో చెప్పండి అంటూ సూటిగా ప్రభుత్వాన్నే ప్రశ్నించారు. దీంతో తాను ప్రజలకిచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం.. అవినీతిని అరికట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందన్న విషయాన్ని చంద్రబాబు ఆలోచిస్తున్నారు.  రాజధాని నిర్మాణంల కోసం లక్ష కోట్ల రూపాయలు, రాష్ట్ర పునర్నిర్మాణం కోసం మరో మూడు లక్షల కోట్ల రూపాయలను ఇవ్వాలని కేంద్రాన్ని, 14వ ఆర్థిక సంఘం కమీషన్ ను అర్థించిన చంద్రబాబుకు.. అధికారులు పందికోక్కుల్లా.. ధన్నాన్ని బొక్కెస్తారేమోనని ఆందోళన చెందుతున్నారు.

వంద రోజుల పాలనలో తన వద్దకు బదిలీలు, సస్సెన్షన్ల కోసం వచ్చిన ఫైళ్లే ఎక్కువని డిఫ్యూటీ సీఎం తన రెవెన్యూ శాఖలో జరగుతున్న అవినీతిపై ఆందోళన వ్యక్తం చేయడంతో ఈ వ్యవహారానికి తెర లేచింది. నిజంగా తన శాఖలో ఇంత అవినీతి జరుగుతుందని చెప్పడం మంత్రి నిజాయితీకి దర్పణం పడుతుంది. అయితే మంత్రి వ్యాఖ్యలతో..  అవినీతికి పాల్పడుతున్న అధికారులు, అమాత్యుల దృష్టికి విషయం చేరింది కాబట్టి.. చర్యలు తప్పవని, ఇకనైనా అవినీతి పాల్పడవద్దని నిర్ణయానికి రావాలి. కానీ అందుకు భిన్నంగా తమ సంఘంలో ఇదేదో ప్రపంచ వింతనట్టుగా చేసి విషయాన్ని కాస్తా వివాదంగా మార్చేశారు.

రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో అవినీతి వుంది, ఎక్కడ లేదో చెప్పమనండి.. ప్రపంచమంతా అవినీతి వుంది.. కాదంటారా అని రెవెన్యూ ఉధ్యోగుల సంఘం అధ్యక్షుడు బి.వెంకటేశ్వర్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అన్నింటినీ వదిలేసి కేవలం రెవెన్యూ ఉద్యోగులనే టార్టెట్ చేసి చులకన చేయాలని చూస్తారా..? అంటూ విరుచుకుపడ్డారు. ఉద్దేశ్యం ఉద్యోగులలో మార్పలు తేవాలని మంత్రి వ్యాఖ్యాలు చేస్తే.. అది మాకు ఉధ్యోగం కల్పించిన హక్కుగా ఉధ్యోగులు పేర్కోంటే ఇక అవినీతిని అంతమెందించడం ఎలా.. ? ఉద్యోగం రానంత వరకు ఉధ్యోగం వస్తే చాలు అని భావించే నిరుద్యోగులు.. ఉధ్యోగం రాగానే అమ్యామ్యాలకు అలవాటు పడుతున్నారు. తాజాగా అది మా హక్కు అనే స్థాయికి చేరుతున్నారు.

మీడియా ఎదురుగా అవినీతి ఎక్కడ లేదో చెప్పండంటూ సవాల్ చేసిన రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిని మీడియా ఒక్క ప్రశ్న అయినా అడిగిందా.. అవినీతి ఎక్కడ వుందో చూడాలని కనీసం ప్రశ్నించిందా..? అంత బాహాటంగా అవినీతిపై మాట్లాడిన వ్యక్తిపై ఏసీబి అధికారులు చర్చలు చేపట్టారా..? ఇప్పటికైతే లేదనే చెప్పాలి. చేస్తున్న దగుల్బాజీ పనిని గొంతెత్తి చెప్పినంత మాత్రన.. అవినీతి చర్యల నీతివంతమవుతుందా..? ఇలాంటి అధికారులపై ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోకుండా ఉపేక్షిస్తుందా..? అంటూ సామాన్య ప్రజలు ప్రశ్నిలు గుప్పిస్తున్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AP government  chandrababu  Revenue Employees  corruption  department  

Other Articles